నిన్న లేని అందమేదో (10)-వేదాంతం శ్రీపతి శర్మలింగా చేయి చాచాడు.
‘చెయ్యి బాగుంది ‘
‘ అంతేనా?’
‘ అంటే?’
‘ గీతలు…అవేమంటున్నాయి?’
‘ మేము చేతిలోనే ఉన్నాము అంటున్నాయి ‘
చేయి వెనక్కి లాగేసుకున్నాడు.
‘ అంటే?” నీ భవిష్యత్తు నీ చేతిలోనే ఉంది!’
‘…’
‘ ఎనీ మోర్ క్వెష్చన్స్?’
‘ నాకు …ప్రేమ నా భవిష్యత్తులో ఉన్నదా?’
‘ ప్రేమ భవిష్యత్తులో ఉండదు శిశువా! ప్రేమ మనస్సులో ఉంటుంది, వర్తమానం లో ఉండాలి.’
వెనక్కి వాలిపోయాడు.
‘అసలు ప్రేమ కనిపిస్తుందా?’
‘ప్రేమ కనిపించదు. కనిపించేది ప్రేమ కాదు. కనిపించనిదే అందంగా ఉంటుంది !’
‘ నేనేమి చేయాలి?” ప్రేమించాలి!’
‘ ఖర్మ!’
‘ కరెక్ట్!’
‘ ఎలా?’
‘ పాడుకుంటున్నారా?’
‘ పిచ్చి పిచ్చిగా!’
‘ నువ్వూ పాడు.’
‘ వేళాకోలమా?’
‘ అమ్మాయి సంగీతం నేర్చుకుంటున్నదా?’
‘ చక్కగా నేర్చుకుంటోంది ‘
‘ గుడ్! జంట స్వరాలు వస్తున్నాయా?’
‘ యుగళగీతం పాడుతుంటే ఇంకా జంట స్వరాలు ఏమిటి సార్?’
‘ వెరీ గుడ్!’
నువ్వు రంగాని ప్రేమించలేదు లింగా!’
‘ నాన్ సెన్స్!’
‘ కాదు. నిజంగా ప్రేమిస్తే అమ్మాయి పాడుకునే పాటను రికార్డు చేసుకుని మరి మరీ వింటావు. ప్రేమ శరీర ఆకర్షణ కాదు. ప్రేమ అనేది సుగుణాలని పోషించ గలిగే తత్వం. నీకు సంగీతం ఇష్టం లేదా?’
‘ ఎంత మాట?’
‘ మరి? వాళ్లు పాడుకుంటున్నప్పుడు తెలియకుండా రికార్డ్ చేసి ఆమెకు తెలియకుండా వింటున్నట్లు నటించి చక్కగా తాళం వెయ్యి. ఆమె మెట్ల మీద నిలబడి చూస్తుంది…’
అతను లేచాడు. ‘ కరెక్ట్! నేను తన్మయత్వంలో ఉన్నప్పుడు నన్ను చూసి స్పందిస్తుంది…నాలో ఇంత ఆరాధన ఉన్నదని గ్రహిస్తుంది…’
‘ నీ పట్ల ఒక గౌరవం, మెల్లగా అనురాగం పెరుగుతాయి. అమ్మాయిలు అగ్గిపిడుగులు. ముందు మెరుస్తారు. తరువాత అరుస్తారు. ఆ పైన ప్రేమ వర్షం కురిపిస్తారు…’లింగా అప్పటికే తన్మయత్వం లోకి వెళ్లిపోయాడు. లేచి నడవటం మొదలు పెట్టాడు. పట్టుకుని ఆపాను.
‘ ఎక్కడికీ?’
‘ వర్షం. ప్రేమ వర్షం!’
‘ ఇలా రా. కూర్చో! అది అంత తేలికగా కురవదు శిశువా! ఉరుములు, మెరుపులు పక్కన పెట్టు. ముందు వర్షం కురిసే ఫార్ములా గురించి ఆలోచించు. ‘
‘ కరెక్ట్!’
‘ ఏమిటి అది?’
‘ చెప్పండి సార్! ఇలా చేతులు కట్టుకుంటాను. ‘
‘ వెరీ గుడ్! ప్రేమను పొందాలనుకుంటున్నవా? ప్రేమ రసాన్ని పొందాలనుకుంటున్నావా?’
‘…’
‘ శిశువా! వయసు మీద కనిపించే అందం ఉల్లిపొరలాగా తొలగిపోతుంది. ‘
‘ కరెక్ట్!’
‘ ఒక అస్తిత్వాన్ని నిలిపి చూపించే ప్రతిభను గుర్తించి మసలుకో! మరో ప్రపంచం దగ్గరవుతుంది!’
అతను ఆలోచిస్తూ కూర్చున్నాడు. అతని చేయి తీసుకుని చూశాను.
‘ గీతలలో ఏమీ ఉండదు లింగా! ప్రేమించేందుకు ఒకరి మనస్తత్వం లోకి తాళం చెవిని తీసుకుని బయలుదేరాలి. ఇద్దరికీ ఒకటే తాళం చెవి! తాళం తప్పిందా, రసాభాస తప్పదు. ఇది కనిపించని తాళం. అందుకే అందంగా ఉంటుంది…’
~~~***~~~
(తరువాయి భాగం త్వరలోనే!)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “నిన్న లేని అందమేదో (10)-వేదాంతం శ్రీపతి శర్మ

 1. “ప్రేమ శరీర ఆకర్షణ కాదు. ప్రేమ అనేది సుగుణాలని పోషించ గలిగే తత్వం.” అని, వెంటనే…ఈ సుగుణం తెలీదెమోనని ఈ ప్రశ్న వేశాడా:
  నీకు సంగీతం ఇష్టం లేదా?’
  *******************
  ఒక అస్తిత్వాన్ని నిలిపి చూపించే ప్రతిభను గుర్తించి మసలుకో! మరో ప్రపంచం దగ్గరవుతుంది!
  *******************
  ప్రతిసారి…ఆ టైటిల్ చూసి పాడుకుంటూ వస్తాను..”నిదులేచనెందుకో…”..ఓ ప్రెష్ నెస్ ఎప్పుడూ వచ్చేస్తుంది మనసుకి ;

  ఈ ఎపిసోడ్ తో మీరు :ఈ కధతో మీరు మొత్తం ..యువత ని “నిదురలేపుతున్నారు”..అనిపించింది..ఔను సార్..గీతలలో ఏమీ లేదు..అవి పిచ్చిగీతలు..కోతిగీతలు.

  మే బి యూ ఆర్ జీనియస్!..మె బి ది వరళ్డ్ విల్ నో ఇట్ సూన్..అండ్ ఫాలో!ఆల్ ది బెస్ట్.ఐ విష్ యూ ఆల్ ది బిస్ట్…అండ్ ఐ విష్ ఆల్ ది సక్సస్ ఫర్ అవర్ ఓన్ కంట్రీ..

  థాంక్యూ.

 2. రేరాజుగారూ! నా బదులు కూడా పొగిడేసారు గాని!ఓ చిన్న క్యురియాసిటితో కూడిన ఎంక్వైరి — “అమ్మాయిలు అగ్గిపిడుగులు. ముందు మెరుస్తారు. తరువాత అరుస్తారు. ఆ పైన ప్రేమ వర్షం కురిపిస్తారు…”ఇది స్వానుభవమా? అట్లైన అమ్మాయులు…?:( just kidding maastaaru! not at all serious!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: