చిలుక పలుకులు-వేదాంతం శ్రీపతి శర్మ


ఒక బ్రిడ్జ్ మీదుగా సైనికులు వెళుతున్నప్పుడు వాళ్లని మార్చ్ చేయకుండా మామూలుగా నడవమంటారని మనకి చిన్నప్పుడు చెప్పారు. రెసొనెన్స్ వలన వంతెనలోని రాళ్లలో స్పందన కలిగి అది పడిపోగలదని చెబుతారు.
~~~***~~~

ఒక రోజు పోస్ట్ ఆఫీసులో లైనులో నిలబడ్డాను. ఒకాయన వచ్చి ‘ చిల్లరిస్తారా?’ అని అయిదు వందల నోటు చూపించాడు.
‘ థాంక్స్ ‘, అన్నాను. నన్ను చిత్రంగా చూశాడు.
‘ చిల్లర లేదు. కాకపోతే ఈ మనిషి దగ్గర అయిదు వందలు ఉంటాయి అనే గౌరవం మీరు నాకిచ్చినందుకు థాంక్స్ ‘, అన్నాను.
ఆయన నవ్వి వెళ్లిపోయాడు.
ఆ రోజు రెండో సారి ఆయన నాకు తారసపడ్డాడు. రిజర్వేషన్ కౌంటర్ ముందు నిలబడి ఉండగా ‘ సార్, పెన్ను ఇస్తారా?’ అని గుర్తు పట్టి నవ్వాడు. ‘ సార్,మీ జేబులో పెన్ను కనిపిస్తోంది. తప్పదు!’
నవ్వి పెన్ను ఇచ్చాను.
మూడో సారి అదే రోజు బండీకి అడ్డంగా వచ్చి నన్ను ఆగమని రోడ్డు దాటేశాడు. పక్కకి తీసుకుని హెల్మెట్ తీసి జాగ్రత్తగా చూశాను. ఆయనే! నన్ను హెల్మెట్ వలన గుర్తు పట్టలేదు. చిత్రంగా ఉందే అనుకుని వెళ్లిపోయాను.
అంతటితో అయిపోలేదు.

బాంకులో వరుసగా ఉన్న కుర్చీలలో ఒక దానిలో కూర్చున్నాడు.నన్ను చూసి నవ్వాడు. ‘ నాకేమీ వద్దండి ‘, అన్నాడు. నేనూ నవ్వాను. డ్రాఫ్ట్ కోసం కాగితం ఇచ్చి ప్రక్కన కూర్చున్నాను.
ఏముంది మా మధ్యలో? ఏమో! కానీ వ్యక్తి నచ్చాడు.కొద్ది సేపు ఆలోచిస్తూ కూర్చున్నాను.ఇంతలో ఆయన సన్నగా పాడుతున్నాడు, ‘నీలి మేఘాలలో, గాలి కెరటాలలో…’
‘ అరే! మీరు నే పాడుకుంటున్న పాటే పాడుతున్నారు!’
‘ ఓహో! అందుకన్నమాట ఇద్దరం గాలి, మేఘాల లాగా ఇలా కలుసుకుంటున్నాము!’
~~~***~~~
 

టి.వీలో చక్కని సంగీతం ఎవరో వినిపిస్తున్నారు.ఒక పెద్దాయన చక్కగా తాళం వేస్తూ వింటున్నాడు.సంగీతం తెలిసి ఉండటం ఎంత గొప్ప వరం! అనుకున్నాను. ఆ కచేరీని ఆస్వాదించాలంటే మనకి కొంత తెలిసి ఉంటే ఎంత బాగుండు?. కచేరీ అయిపోయింది.
‘ ఏ రగమండీ?’ అని కుతూహలంగా అడిగాను.
ఆయన నవ్వాడు. ‘ నాకు తెలియదు!’
‘ మరి చక్కగా తాళం వేస్తూ వింటున్నారు?’
‘ మంచి వాడివే! తాళం వెయ్యొద్దని ఎవరు చెప్పారు? లయ అందరిలో, అన్నిటిలో ఉంటుంది. అందులోకి వెళితే ఒక సూత్రం మీదకి వస్తాము. అదే ఆనందం. మీకు నచ్చక పోయినా చెబుతున్న వారి మాటలలోకి వెళ్లి మాట కలపండి! అర్థమవుతుంది. ఇప్పుడు నాను మాట కలపాలీ అంటారు అని అన్నారనుకోండి, నేను మరింత దగ్గరవుతాను!’
~~~***~~~

హర్వార్డ్ లో అదెనా స్కాష్నర్ బృందం వాళ్లు ఈ మధ్య ఒక విషయం పరిశోధన చేసి చెప్పారు.
చిలుకలు మనం చెప్పింది అంత చక్కగా తిరిగి ఎందుకు చెప్పగలుగుతాయీ అంటే వాటిలో మరొక ప్రతిభ ఉంటుంది అని అంటున్నారు. అవి సంగీతం వినిపించినప్పుడు ఆ పాటకు లయబధ్ధంగా నాట్యం కూడా చేయగలవు. ఇలా చాలా వాటి మీద అధ్యయనం చేసి వీళ్లు చెబుతున్నదేమిటంటే ఇలా ‘లయ ‘ను గుర్తించిన వాళ్లకే త్వరగా ఏ విద్యలోనైనా అవగాహన, అధ్యయనం, అభ్యాసం సాధ్యం!

గురువు ఒక మాట అంటాడు. శిష్యుడు పలుకుతాడు. మరల ఇద్దరూ కలసి పలుకుతారు. స్వాధ్యాయం కూడా మనసుతో మాట కలపడమే!

~~~***~~~

సంధ్య వేళలలో  సమస్త  జీవ రాశులు, దేవతలు సంధ్యోపాసన చేస్తారు. అంతే కాదు. అందరినీ ఒక సారి తలచుకుని శుభం కోరుతారు!

 ఇది సృష్టిలోని కీలకమైన ప్రకృతి సహజమైన నియమం. మంకు తెలియకపోయినా మనలను ఆ సమయంలో ఆ విధానం ద్వారా మనలను తలచుకునే వారు ఉంటారు. మన మననం ఒక్కటే కాదు. మరొకరి మననం లో మనముంటాము! మనకు తెలియకుండానే ఇచ్చి పుచ్చుకోవటం జరుగుతుంది…వసుధైవ కుటుంబకం!

~~~*~~~

సహవీర్యం కరవావహై…

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “చిలుక పలుకులు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: