ఇతి వార్తా: -వేదాంతం శ్రీపతి శర్మ


‘ ఎకనమిక్ టైంస్ ‘ మన ఆర్థిక పరిస్థితి మంచి రోడ్డున పడుతున్నదని వ్యాఖ్యానించింది. ఈ సెప్టెంబర్ లేదా డిసెంబర్ కల్లా పూర్తిగా రోడ్డు మీదకు వస్తుందన్న ఆశను వ్యక్తపరచింది. జి.డి.పి 6 నుంచి 7 శాతం కూడా ఉండవచ్చని అంచనా. ఐ.టి సెక్టర్ కొద్దిగా ఇంకా కుంటుతున్నప్పటికీ డొమెస్టిక్ మార్కెట్ బాగుందని చెబుతున్నారు.
ఇదే పేపర్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనమిక్ గ్రోత్ వారు జి.డి.పి 5.8 % ఉంటే గొప్ప అన్నట్లు చెబుతున్నారు.సెప్టెంబర్ లేదా డిసెంబర్ అనేది మంచి అంచనా. కాకపోతే చమురు ధరలు చిత్రంగా వ్యవహరిస్తున్నాయి. అలాగే అన్ని ప్రక్రియలూ ఒక సమన్వయం లోకి వచ్చి జి.డి.పి ని ప్రభావితం చేస్తాయనటం కొద్దిగా ఆలోచించవలసిన విషయం. ఈ లోపల వర్షాలు సరిగ్గా పడి పంటలు సరిగ్గా పండితే మరి పంట పoడినట్లే!
అన్నిటినీ మించి ప్రపంచీకరణ వ్యవస్థలో పాలు పంచుకుని ప్రపంచ సమస్యలకు మన ఆర్థిక వ్యవస్థను ‘ ఓపెన్ ‘ గా పెట్టినప్పుడు ప్రపంచ ఆర్థిక మాంద్యం వగైరాలు మన పరిస్థితిని ఎంత ప్రభావితం చేశాయి, లేదా మన వ్యవస్థ దీని నుంచి ఏమి నేర్చుకుంది అనే విషయం మీద చాలా ఆలోచన జరగవలసి యున్నది…అలాగే ఐ.టి రంగం, సర్వీసెస్ రంగం-ఈ రెండిటికీ జి.డి.పీ లో గల స్థానాన్ని ఒక సారి డైనమిక్ గా పరిశీలించాలి.
~~~***~~~

‘ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ‘ సోనియా గాంధీ బి.జె.పి వారు తీవ్రవాదులను అతిథులుగా భావించారని చేసిన వ్యాఖ్యను చెప్పింది.
ఈ దేశమే చాలా కాలంగా అతిథుల పాలనలో ఉంది అని పలువురు అభిప్రాయ పడవచ్చు!
~~~***~~~’ ద హిందు ‘ ఏసీన్ కాలేజ్ ఆఫ్ జర్నలిసం వారికి కుమార్ శహాని డిప్లొమాలను అందజేసిన వార్త ప్రచురించి ఆయన చేసిన వ్యాఖ్యల గురించి చెప్పింది. అబధ్ధం మీద నడక, తప్పు సమాచారాన్ని అందించటం వంటివి తగ్గు ముఖం పట్టిన సమయం కాబట్టి రిపోర్టింగ్ అనేది పవిత్రమైన సత్య నిరూపణ వైపు సాగాలని ఆయన కోరినట్లు తెలుస్తున్నది…
ఇచ్చి పుచ్చుకోవటం అనేది వంశ పారపర్యంగా సాగునది కాకుండా ఒక నాలెడ్జ్ బేస్ మీద, సత్య నిరూపణ, సాక్ష్యాల మీద ఆధారపడి ఉండాలని ఆయన చెప్పినట్లు తెలుస్తున్నది.
బాగుంది. కాకపోతే రోజులు అలా ఏ మాత్రం లేవు! మీడియా 26/11 రోజున ప్రవర్తించిన తీరును తలచుకుంటే బాధగానే ఉన్నది.అవతల ప్రక్క ఇంకా ఏదీ సద్దు మణగలేదు, ఈ హీరో రిపోర్టర్ మైకులో బ్రిటన్ రాయబారిని అప్రస్తుతమైన ప్రశ్నలు అడుగుతున్నాడు. ఆయన కాస్త ప్రొఫెషనల్ గా వ్యవహరించండి అని హితవు చెప్పాడు!
ఆ ఎన్.డి.టి.వి అమ్మాయి తాజ్ ముందు పూనకం వచ్చిన దానిలా ఎందుకో దొర్లుతూనే ఉంది. మొన్న ఈ మధ్య ఎన్. డి.టి.వి హీరో ప్రణోయ్ రాయి గారు అటు జ్యోతిర్మయ్ సింధియాను, ఇటు ఎవరో బి.జె.పి వ్యక్తిని వరుణ్ గాంధీ వ్యవహారం మీద ప్రశ్నిస్తున్నాడు. కొన్ని ప్రశ్నల తరువాత పాపం సింధియా ‘వన్ లాస్ట్ వర్డ్ ‘ అంటున్నాడు. ఈయన ‘ నో లాస్ట్ వర్డ్స్ ‘ అంటూ మూసేశాడు! మీ ముందు ప్రేక్షకులున్నారనీ, ఒక మైకు ఉందనీ, ఇష్టారాజ్యంగా ప్రవర్తించేది ఎంతో పేరు సంపాదించిన ‘ ప్రొఫెషనల్స్ ‘. వ్యాపార ధోరణి, తలకెక్కిన కీర్తి కిరీటాలు ఈ దేశంలో అన్ని రంగాలలోనూ అరిష్టాలె!
కొత్తగా డిప్లొమాలు పుచ్చుకున్న వీరు ఎప్పుడు తెర మీదకు వెళ్లాలనుకునే వారే కానీ అర నిమిషం గట్టిగా కూర్చుని ఒక సత్యాన్ని అన్ని కోణాల నుంచీ పరిశీలిద్దామనుకునే వారు లేరనే చెప్పాలి…
~~~***~~~

‘ ద స్టేట్స్ మన్ ‘ రాబోయే క్రిష్నగడ్ (బెంగాల్) నియోజకవర్గంలో సి.పి.ఎం వారు ప్రతిపక్షం వారి వోట్లు చీలాలని బి.జె.పి అభ్యర్థిని పొగుడుతూ చేస్తున్న ప్రచారం గురించి చెప్పింది.
ఇది ఈ ఎన్నికలలో పలు చోట్ల విరివిగా కనిపించిన అంశం. ఎవరు నిలబడ్డారూ అనేది పార్టీల కంటే ప్రాముఖ్యత ఎక్కువ సంపాదించింది. నన్ను కాదన్నావు కాబట్టి నువ్వు కూడా కాదు. చూడు నీ పరిస్థితి నేను చెబుతాను. ఇదీ పధ్ధతి. ఆంధ్ర రాష్ట్రంలో కూడా చాలా ఉదంతాలు ముందుకు రాబోతున్నాయి. ఫలితాలు వచ్చే ముందే అర్థమవుతున్నది!
~~~***~~~

అన్ని పేపర్లూ నేపాల్ లోని పరిస్థితిని దీర్ఘంగా చర్చించాయి.
సేనాధ్యక్షుని పదవి లోంచి తప్పుకోమనటం, రాష్ట్రపతి వ్యవహారం, భారత ప్రభుత్వం యొక్క జోక్యం…ఇలా చాలా మాటలు ముందుకు వచ్చాయి.
పలువురూ మన దేశానికి ఇటువంటి ఇంటర్ఫియరెన్స్ తగదని వ్రాశారు.
మన దేశం గురించి తరువాత మాట్లాడవచ్చు. ముందు విషయం ప్రచండ గారు చేసినది నేపాలీ రాజ్యాంగానికి సమ్మతమేనా అనేది.
కాదన్నది తెలుస్తున్నది. ఒక సేనాధ్యక్షుని పదవి నుంచి తీయాలంటే కొన్ని నిబంధనలు ఆ రాజ్యాంగంలో ఉన్నాయి. రాష్ట్రపతి సుప్రీం కమాండర్. పైగా ఈ ప్రభుత్వం ఒక కూటమి పరంగా నడుస్తున్నది.
ఏక పక్ష నిర్ణయాలు సరైనవి కావని ముందుగా గుర్తించాలి.
సమస్యకు దారి తీసినది ఇది కానీ మన దేశం చేస్తున్న హడావుడి,
ఙ్ఞానేంద్ర సోనియాని కలవటం ఇవన్నీ తరువాత మాటలు.
పొరుగు దేశం కాబట్టి అక్కడ జరుగుతున్న పరిణామాల పట్ల తప్పక మనకు అవగాహన అవసరం. మనకి ఒకరు ఇష్టం, మరొకరు కష్టం కావచ్చు. అది ప్రస్తుతం ప్రధానం కాదు. ఐక్య రాజ్య సమితి వారు చెప్పినట్లు నేపాల్ లో ఉన్న నలుగురూ కూర్చుని చర్చించుకోవాలి. ఒక అతి పెద్ద ప్రజాస్వామ్యం, ఎంతో అనుభవం గల దేశం అయిన భారత దేశం నుంచి ఈ దేశం నేర్చుకోవటంలో తప్పు లేదు.
ఆ మాత్రం గౌరవం మన దేశానికి వాళ్లు ఇయ్యాలి!
~~~***~~~
ఇతి వార్తా:
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: