3 నుంచి 9 మే 2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు!

ఈ వారం రవి మేషంలో, బుధుడు వృషభంలో, కుజ శుక్రులు మీనంలో, గురువు కుంభంలో, రాహువు మకరంలో, కేతువు కర్కాటకంలో, శని సింహంలో, చంద్రుడు సింహ, కన్య, తుల, వృశ్చిక రాశులలో సంచరిస్తారు.

చాలా మంది బుధ్ధి మందగించి తప్పుడు నిర్ణయాలు తీసుకునే వారం. ఉత్సాహం బాగుంటుంది కానీ బాధ్యతలను పలువురూ విస్మరించే సమయం. ప్రజలు వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్న వారు,ఉబ్బసం ఉన్న వారు శ్రధ్ధ ఎక్కువగా తీసుకోవాలి. ప్రలోభాలకు దూరంగా ఉండాలి.జనవరి మాసంలో ఇదే బ్లాగులో నేను ప్రపంచ వ్యాప్తంగా ఒక అంటు వ్యాధి సోకుతుందని వ్రాసి యున్నాను.గురువు ప్రభావం చేత మన దేశంలో ప్రభావం ఉండక పోవచ్చును.అందరూ దుర్గా సూక్తం, భూమి సూక్తం చదువుకోవలసినదిగా మనవి.

మేష రాశి: ప్రయాణాలు తప్పవు. అరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి.బాధ్యతలు పెరుగుతాయి.మీ సత్ప్రవర్తన అందరినీ ఆకట్టుకుంటుంది.ఊహలు పలు విధాలుగా పరుగులు తీస్తాయి.నిత్యం లలితా సహస్రనామం చదువుకోండి.

వృషభ రాశి:ఇంటిలోని పెద్ద వారి ఆరోగ్యం కాపాడుకోవాలి.మనసు దైవ చింతనకు దూరంగా వెళ్లవచ్చు.ఆదాయం బాగుంటుంది.పిల్లలు వివిధ రంగాలలో రాణిస్తారు. శ్రీసూక్తం చదవండి.

మిథున రాశి: మీ చెల్లెళ్లు, తమ్ముళ్లు కలుసుకుంటారు. ఒక మంచి వార్త వింటారు.మీ మాటకు విలువ పెరుగుతుంది. వారం మధ్యలో ఆదాయం బాగుంది.సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి.

కర్కాటక రాశి: ఏది చేపట్టినా విజయం పొందుతారు. మీ అనుభవం మిమ్మల్ని సరైన దారిలో నిలబెడుతుంది. కంటి విషయంలో జాగ్రత్త వహించండి. వృధ్ధులైన స్త్రీలు ఆరోగ్యం కాపాడుకోవాలి. మహా సౌరం పఠించండి.

సింహ రాశి:మీ మాటే నెగ్గాలనే పంతం ఈ వారమైనా మానుకోవాలి! అన్ని వేళలూ, అన్ని వేళ్లూ ఒక లాగ ఉండవు.మీ దూకుడుతనాన్ని ఆసరాగా తీసుకునే వారు ఎత్తులు వేయబోతున్నారు.అడుగు చూసి అడుగు వేయాలి. హనుమాన్ చాలీసా చదవండి.

కన్య రాశి: శ్రమ ఎక్కువగా ఉన్నప్పటికీ అదృష్టం బాగుంది. ఉన్నతాధికారులు మీ మాటను వింటారు. మంచి అవకాశాలు రాబోతున్నాయి. పనుల పరంపరలో కోపం వస్తుంది. మౌనం వహించండి.అసలే గ్రీష్మం!విష్ణు సహస్రనామం చదవండి.

తుల రాశి: మిమ్మల్ని వదిలిన భాగస్వాములు మరల రాబోతున్నారు. రాజకీయాలలో లబ్ధి ఉన్నది.వ్యాపారులకు మంచి కాలం.కాకపోతే అధికంగా పెట్టుబడులు పెట్టే నైజం కనిపించవచ్చు.జాగ్రత్త వహించండి. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

వృశ్చిక రాశి: నియమానుసారంగా మీకు ఇష్టమైన పూజ చేపట్టండి. చాలా విషయాలలో లాభిస్తుంది.ఇంటిలోని సమస్యలు తీరిపోతాయి. ఋణాలు చేసిన వారికి బాధలు తొలగుతాయి.ఒక పని నిమిత్తం మీకు చేయాలా వద్దా అనే సందేహం కలుగవచ్చు.ఒక వారం ఆగండి. ఆదిత్య హృదయం చదవండి.

ధను రాశి: కడుపు నొప్పి పలు మార్లు వస్తే తప్పక వైద్యుని చూడండి.ఇంటి బయట ఆహారం తినటం అంత మంచిది కాదు.డబ్బు చేతికి అందుతుంది.ఖర్చులు తగ్గించుకోండి. ప్రేమ వ్యవహారం ఏదైనా ఉంటే కొన్నాళ్లు ఆగండి.  పనులు నెరవేరాలంటే గోవుకు గ్రాసం వేయండి.

మకర రాశి: మీరు నిర్వర్తించిన పనులకు ప్రశంసలు పొందుతారు.వ్యసనముల వైపు మనసు మళ్లుతుంది. జాగ్రత్త వహించండి.ఎవరితోనో పోట్లాడాలి అనుకుంటున్నారు. అవసరం లేదు. వద్దనుకున్నా ఒకరికి సహాయం చేస్తారు. శివునికి అభిషేకం చేయించండి.

కుంభ రాశి:చక్కెర వ్యాధి ఉన్న వారు జాగ్రత్త వహించాలి.ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వారాంతంలో కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ధర్మాచరణ చేయు వారిని సంప్రదించండి. దేవీ సూక్తం చదవండి.

మీన రాశి: ఉద్యోగస్తులకు బదిలీలు ఉండవచ్చును. వివాహాలు కాని వారికి మంచి సమయం. స్త్రీలకు లాభించే వారం.రచనలు చేసే వారికి మంచి ప్రోత్సాహం లభిస్తుంది. రాజకీయాలలో సీనియర్లకు మంచి వారం! కులదైవాన్ని కొలవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: వేదే రామాయణే పుణ్యే భారతే భరతర్షభ
ఆదౌ చాంతేచ మధ్యేచ హరిస్సర్వత్ర గీయతే

(మహాభారతం స్వర్గారోహణ పర్వం)

వేదరూపమగు రామాయణమునందు,పవిత్రమైన భారతమునందు, ఆద్యంతములోనూ, మధ్యభాగమందును, సర్వత్ర శ్రీహరియే గానము చేయబడుతున్నాడు.

మంగళం మహత్!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

 ~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “3 నుంచి 9 మే 2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: