‘విపరీత రాజయోగం’-వేదాంతం శ్రీపతి శర్మ


నేను ప్రస్తుతం చెప్పబోతున్నది జ్యోతిషం గురించి కాదు.

చాలా కాలం క్రితం చెన్నై స్టేషన్ లో నా సూట్ కేసు బరువు చెప్పే యంత్రం మీద పెట్టి రూపాయి కాయిన్ లోపలికి తోశాను. బరువు చెబుతూ ఒక కార్డు ఇవతలకి వచ్చింది. దాని మీద మరొకటి ఉంది- మీకు త్వరలోనే వివాహం కాబోతున్నది!నవ్వుకుని రైలు వైపు వెళ్లాను. టి.టి.ఇ దగ్గర నిలబడి దిక్కుమాలిన నవ్వు ఒకటి నవ్వాను. ఈ నవ్వు వాళ్లకొకళ్లకే అర్థం అవుతుంది. విచిత్రం ఏమిటంటే ఆయన కూడా అటువంటి నవ్వు తిరిగి నవ్వాడు. ఇవి మా విసిటింగు కార్డులు. అలా నవ్వి కొద్ది దూరం జేబులో చెయ్యి పెట్టుకుని నడిచాడు. మనం వెంబడించకూడదు. అలానే నిలబడ్డాను. ఆయనే వచ్చాడు. మరల చైనా వాడు చిరు నవ్వు నవ్వి నట్లు నవ్వాను. ఆయన్ ఆ చార్ట్ ఏదో ఇ.సి.జీ రిపోర్ట్ చూసినట్లు చూసి అసలు రైలు ఎందుకు నడపాలీ అన్నట్లు రైలు వైపి చూసి చాలా కాలంగా అజీర్ణంతో బాధ తప్పటం లేదన్నట్లు నన్ను చూశాడు. ఇది వ్యవహారం ముందుకు వెళుతున్నట్లు అర్థం!
‘ చాలా కష్టం’
‘ కరెక్ట్!’
‘ గూడూరు దగ్గర చూద్దాం. ఎస్.8 లో కూర్చోండి!’
మరల చెత్త నవ్వు నవ్వి నా పెళ్లి కొడుకును తీసుకుని(సూట్ కేసు) లోపలికి వెళ్లాను.

~~~***~~~

బండీ కదిలింది. సింగల్ సీటు మీద కూర్చున్నాను. అదేమిటో పెట్టెలో ఎవరూ లేరు. ఇంతలో ఇద్దరు చిన్న పిల్లలు ఒక ప్లేట్లో ఏవేవో పట్టుకుని వచ్చారు. నాకు పొడుగాటి బొట్టు పెట్టారు. మొహం మీద రంగు నీళ్లు ఏవో చల్లారు. గొంతుకు ఏమి పూశారో తెలియదు. నవ్వుకుంటూ వెళ్లిపోయారు.

అరగంట తరువాత మళ్లీ ఎవరో వచ్చారు.చేతిలో ఒక కాగితం ప్లేటు, అందులో రక రకాల తీపి పదార్థాలూ పెట్టి పారిపోయారు. ఇంతలో ఒకడు వచ్చి వాటర్ బాటిల్ ఇచ్చి వెళ్లాడు. తినలా వద్దా అని చూస్తుండగా టి.టి.ఈ వచ్చాడు.

‘ సార్ ‘
‘ ఏమైంది?’
‘ ఇదంతా ఏమిటండీ? ‘
‘ ఏమైంది? బాగున్నారు. పెళ్లి కొడుకులా ఉన్నారు!’
‘ ఇది తినమంటారా?’
‘ భలే వారే! తినండి. మారేజీ పార్టీ! ఈ బోగీ అంతా వారిదే. పెళ్లివారు ఎక్కుతూనే ఉంటారు. మీరూ అదే అనుకున్నారు. ఎవరెక్కినా ఇదే చేస్తారు.దీనినే విపరీత రాజయోగం అంటారు.’

కిందకి చూసి నా సూట్ కేసును ఒక సారి తడుముకున్నాను. ఒక అందమైన మార్వాడీ అమ్మాయి ఎందుకో సిగ్గు పడుతూ అలా వెళ్లిపోయింది!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “‘విపరీత రాజయోగం’-వేదాంతం శ్రీపతి శర్మ

  1. ఓరి దేవుడో! ఇంతకీ ఎవరా చిన్నది? ఏమా కథా? దీనికి తరువాయి భాగం వున్నదా? వుంటే ఇదే చిన్నదా? లేక వేరెవరైనా అయ్యే చాన్స్ వున్నదా? ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానములు చెప్పవలసినదిగా కోరుతున్నాము. లేకున్న దీనిని ‘ఇతి వార్తాహ్”లోకి తరళింపబడునండహో! హ హ హ!

    1. ఏ కథైనా అమ్మాయితోనే కమ్మగా ఉంటుంది. అమ్మాయి ఉన్న ప్రతి చోటా సీరియల్ చేసి ‘సీరియల్ కిల్లర్ ‘ అవమంటారా? ‘ నవల ‘(నవలను) అంటూనే అందరినీ నమిలి మింగేయటం అంత మంచిది కాదేమో!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: