ఇతి వార్తా:-వేదాంతం శ్రీపతి శర్మ


 

‘ఎకనమిక్ టైంస్ ‘ ప్రకాశ్ కారట్ గారు డా:మన్మోహన్ సింగ్ గారి మీద చేసిన వ్యాఖ్యను ప్రచురించింది. ప్రధాన మంత్రి లోక్ సభనుంచి ఎన్నికవ్వాలి కానీ రాజ్యసభ నుంచి కానీ లేదా ఒక కుటుంబం ఎంపిక వలన కాదని ఆయన వ్యాఖ్యానించారు.

మన్మోహన్ సింగ్  గారి మీద అందరికీ గౌరవం ఉన్నది. కారత్ గా
రు అన్న మాట సరైనదే కానీ ఆయనకు మరి యు.పి.ఏ ప్రభుత్వానికి మద్దతు ఇచ్చినప్పుడు ఈ విషయం ఎందుకు స్ఫురించలేదో!

మన ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రజల నుంచి ప్రధాన మంత్రి రావాలని చాలా సూటిగా చెబుతోంది. ఇతర పధ్ధతులు కేవలం ఆపధ్ధర్మ పధ్ధతులు మాత్రమే. ప్రస్తుతం ఇంతకంటే ఎక్కువ ఈ విషయం మీద చెప్పనవసరం లేదు. ఎన్నికల తరువాత ఏమి జరుగుతుందో వేచి చూద్దాం. డా: మన్మోహన్ సింగ్ గారి పదవీ కాలం అయిపోయింది కదా! ఆయన విధానాలు ప్రజల వరకూ చేరాయా లేదా అనేది ఆయన లాంటి వారు అందు చేతనే ఆలోచించలేరు, చెప్పనూ లేరు, కనిపెట్టలేరు కూడా! ప్రశాసనం వేరు, అధ్యయన పరంగా మేధావిగా కాలం వెళ్లబుచ్చటం వేరు!

~~~***~~~

‘ ఇండియన్ ఎక్స్ ప్రెస్ ‘ ఐ.టి. సెక్టర్ లో దాదాపు లక్ష మందిని ఈ సంవత్సరం సెప్టెంబర్ లోపు ఇంటికి పంపవచ్చనే వార్త చెప్పింది. ప్రస్తుతం 22 లక్షల మంది పని చేయు రంగం ఇది. ఇందులో 5% మందిని-మధ్య,పై వర్గాల వారిని ఉద్యోగాల నుంచి తీసేయటం తప్పదనే మాట వినిపిస్తున్నది…

ఇది బాధాకరమైన విషయం.దీని పట్ల సరైన విధానమూ కనిపించటం లేదు, సరైన వేదిక మీద సమర్థవంతమైన చర్చా జరగటం లేదు. ఒక కూలింగ్ ఆఫ్ పీరియడ్ గురించి ప్రభుత్వం ఆలోచించాలి. ఇప్పటికే నిరుద్యోగం సమస్య సైజులో చాలా పెద్దది అవుతున్నది.కనీసం రిలొకేషన్-వీరి ప్రతిభను మరో చోట వినియోగించుకునే మార్గం గురించి-సర్వీసెస్ సెక్టర్ లో లేదా మరో చోట-ఎవ్వరూ ఆలోచించటం లేదు.

~~~***~~~
‘ ద హిందు ‘ శ్రీలంకలోని ఎల్.టి.టి.ఈ సీస్ ఫైర్ సంగతిని వ్రాసింది. ప్రపంచ దేశాలు శ్రీలంక ప్రభుత్వాన్ని. ఎల్.టి.టి.ఈ ని యుధ్ధం ఆపమని, ఎల్.టి.టి.ఈ  ని ఆయుధాలు సమర్పించమని కోరాయి. ఇంతవరకూ బాగానే ఉంది. కానీ ఆయుధాల సమర్పణ గురించి ఎల్.టి.టి.ఈ మాట్లాడలేదు. శ్రీలంకలో జరుగుతున్నదాని గురించి భారత దేశంలోని పార్టీలు రాజకీయ లబ్ధి పొందటం మామూలే! శ్రీలంక తమిళుల పట్ల సోదర భావం బాగానే ఉంది.ఎల్.టి.టి.ఈ వారు తమిళులను బంధించి ప్రాణాలను కాపాడుకోవటం ఎలా ఉంది? ఇదెక్కడి తమీళ ఈలం ప్రభాకరన్? ఈయన పేరు వెళ్లుపిల్లై ప్రభాకరన్. అస్తు! తెలుగులో ‘ వెళ్లు ‘ అనాలా? ‘రా ‘ అనాలా? ఎంత మాట?! అది మన దేశం కేంద్ర ప్రభుత్వానికీ తెలియదు, తమిళ నాడు రాష్ట్ర ప్రభుత్వానికీ తెలియదు! జనాల్ని రెచ్చగొట్టటానికి ఏదైనా ఓ.కే! కానీయండి!

~~~***~~~

‘ ద స్టేట్స్ మన్ ‘ లో భుబనేశ్వర్ లో జరిగిన ‘ టాలెంట్ రిటెన్షన్ ‘ గురించి జరిగిన వర్క్ షాప్ గురించి వ్రాశారు. ఇది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ పర్సనెల్ మ్యానేజ్ మెంట్ వారు. ఎన్. ఎచ్. ఆర్. డి వారు కలసి చేసిన రెండు రోజుల వర్క్ షాప్. ఇందులో ప్రతిభ గల ఉద్యోగులను ఎలా బయటకు వెళ్లకుండా చూడాలి అనేది చర్చించారుట!

బాగానే ఉంది. వీళ్ల మొహాలు తగలెయ్య! అసలు కంపెనీలలో సమకాలీన మైన సమాజానికీ, ఆర్థిక సమస్యల నేపథ్యానికీ ఎటువంటి ఎచ్. ఆర్ వ్యవస్థ సరైనదీ అనేది చర్చనీయాంశం! అసలు సమస్య ఏమిటంటే మనం అన్ని రంగాలలో లాభాపేక్ష తప్ప మరేదీ చూడటం లేదు. ఆఖరికి బంగారం అక్షయ తృతీయ రోజు కొంటే మంచిదని బంగారం వ్యాపారులు ఎంత వ్యాపారం చేసేసుకుంటారు? ఈ గుడికి వెళితే నాకు ఏమొస్తుంది? ఇదే మన సమాజం. మన బుర్రలు కుళ్లి పోయి చాలా కాలం అయింది!

వేర్ ద మైండ్ ఈస్ వితవుట్ ఫియర్…ఏది?

ఈ సంస్థలే మార్కెట్ ఎకనామీ లోని పిశాచాలతో కలసిన బ్యూరొక్రెసీ దొరబాబులను బయటకు నెట్టి కొద్ది సేపు ఏమి చేయాలీ అనేది ఆలోచిస్తే సంతోషిస్తాము.

ప్రతిభ ఉన్న వారు ఏమి చేసుకోవాలో వారే నిర్ణయించుకుంటారు. గెడ్డాలు పట్టుకున్నా వారికి తెలుసు! మీరు ఒరిస్సా చూడాలంటే చాలా సాకులుంటాయి. సగటు మధ్య వర్గ ఉద్యోగుల మీద కుళ్లు జోకులు వేయక్కరలేదు!

~~~***~~~

ఇదే పేపరు రాష్త్రపతి ప్రతిభా పాటిల్ గారు పోలాండులో కాన్సంట్రేషన్ కాంపులో (ఒకప్పటి)పుష్పగుఛ్చాలని ఉంచటం గురించి చెప్పింది…

నిజమే! మన రాష్ట్రపతి ఎవరో అప్పుడప్పుడు మీడియా వారైనా ఇలా గుర్తు చేయటం మంచిదే!

~~~***~~~

‘ వార్త ‘ అని చెప్పేసి మన దగ్గర ఒక వార్తా పత్రిక ఉన్నది. ఈ పత్రిక 23 ఏప్రిల్ రోజున హేలాపురి-ఏలురు లో అత్యధికంగా నమోదైన (84.06%) పోలింగు గురించి వ్రాసింది.
బాగుంది. పశ్చిమ గోదావరి వారు సామాన్యులు కారు.అసలు ఈ ఎండలో ఏలూరులో శరీరం మీద కారిపోయే చెమటను తలచుకుంటే నాకు చాలా సార్లు అనిపించేది. అసలు ఐ.పి.ఎల్ మ్యాచులు ఎక్కడో కాదు. నిజమైన ఆట సామర్థ్యం అనేది ఏలూరులో మే మాసంలో పగటి పూట డ్రింక్స్ లేకుండా ఈ ప్రపంచ దేశాలన్నిటినీ ఆడించాలి. క్రికెట్ మ్యాపు మీద నుంచి కొన్ని మాయమైపోతాయి!

అలాగే ఇక్కడ ఇంత శాతం వోటర్లు వోట్లు వేశారంటే గొప్ప విషయం. వీరిని అభినందించాలి. ఇప్పటి వరకూ ఇది దేశానికే రికార్డు అనుకుంటున్నాను మరి. ప్రజాస్వామ్య అవార్డు ఏదైనా ఇవ్వటంలో తప్పు లేదు!

~~~***~~~

ఇతి వార్తా:!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: