26 ఏప్రిల్ 2009 నుంచి 02 మే 2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు!

ఈ వారం మే నెల రెండవ తేదీన గురువు కుంభం లోకి మారుతున్నాడు. గ్రహస్థితి ఇలా ఉంది:
రవి మేషం, బుధుడు వృషభం, శుక్రుడు, కుజుడు మీనం, శని సింహం, రాహువు మకరం, కేతువు కర్కాటకం, గురువు మకర కుంభాలు, చంద్రుడు మేష, వృషభ, మిథున కర్కాటక రాశులలో సంచరిస్తారు.

ఈ వారం శుభయోగాలతో ప్రారంభమవుతున్నప్పటికీ వారం మధ్యలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఒకరిద్దరు ప్రముఖులు జైలు పాలు కావచ్చు. మాటకారులకు మంచి వారం.వాతావరణం కొద్దిగా ప్రశాంతించగలదు. విద్యార్థులకు మంచి ఫలితాలు ఉన్నాయి. ప్రయాణాలలో జాగ్రత్తలు వహించాలి. ఈ గురువారం అందరూ ఇష్ట దైవాన్ని దర్శనం చేసుకోవటం మంచిది.

మేష రాశి: ఊహించని చోటు నుండి ఆదాయం రానున్నది. పాత మిత్రులు కలుస్తారు. ఇంటి విషయం లో మంచి వార్త వింటారు. ఒక విషయం మీద అవగాహన పెరుగుతుంది. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: ఉద్యోగం లో అభివృధ్ధి ఉన్నది.పెద్దలతో పరిచయాలు ఏర్పడతాయి. ఒక లేఖ ఆలోచింప చేస్తుంది. మీరు మార్పులు కావాలనుకుంటున్నారు. కొంత కాలం ఆగండి. శ్రీ సూక్తం చదవండి.

మిథున రాశి: సోదరుల కలయిక ఉన్నది. ఆరోగ్యం కుదుట పడుతుంది.ధార్మిక చింతన పెరుగుతుంది. కొన్ని వస్తువులు సేకరిస్తారు. చెప్ప దలచుకుంది మెల్లగా చెప్పండి. దుర్గా సప్తశ్లోకీ చదవండి.
కర్కాటక రాశి:దూరం నుండి ఒక ఆహ్వానం అందుతుంది. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉన్నది కాబట్టి ఆలోచించి నిర్ణయం చేసుకోండి.సంఘం లో గౌరవం పెరుగుతుంది.కొత్త విషయాలను పరిశొధిస్తారు. శివునికి అభిషేకం చేయించండి.

సింహ రాశి: వివాహం కాని వారికి మంచి సంబంధం వస్తుంది. ఆరోగ్యం మెరుగవుతుంది కానీ స్త్రీలు ఆరోగ్యం కాపాడుకోవాలి. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. వ్యాపారం లో కొన్ని మార్పులు సంభవం. గణపతికి అర్చన చేయించండి.

కన్య రాశి: చాలా మంది మిమ్మల్ని కలుసుకోవాలని అనుకుంటున్నారు. కొందరు మీకు ఇష్టం లేకపోయినా దగ్గరకు వస్తారు. జీవిత భాగస్వామి నుంచి మంచి సహాయం లభిస్తుంది.మానవాతీత శక్తులు మీలోని అంతరంగాన్ని తాకుతున్నాయి. ధ్యాన మార్గం అవలంబించండి. సూర్యోపాసన చేపట్టండి.

తుల రాశి: రాజయోగం ఫలించనున్నది. న్యాయ సంబంధమైన ధనం లభిస్తుంది.భూ వివాదాలు తొలగిపోతాయి. భాగస్వాములు మంచి సలహాలు ఇస్తారు. దూర ప్రయాణాలు చేస్తారు. హనుమాన్ చాలీసా చదవండి.

వృశ్చిక రాశి: చాలా కాలంగా బాధిస్తున్న గృహ సమస్య తీరుతుంది. ఒక ఋణం విషయం లో మంచి వార్త వింటారు. కార్యాలయంలో మంచి గౌరవం పొందుతారు. కవులకు, వైద్యులకు మంచి వారం. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

ధను రాశి: పిల్లలు మంచి వార్తలు చెబుతారు. మిత్రులతో సరదాగా గడుపుతారు. డబ్బు ఎక్కడికీ పోలేదని తెలుసుకుంటారు. ధైర్యం పొందుతారు. జల్సా చేయాలని అనిపిస్తుంది. అవసరం లేదు. కుల దైవాన్ని కొలవండి.

మకర రాశి: బాధ్యతలలో కొద్దిగా ఊపిరి పీల్చుకుంటారు. పని వొత్తిది అలానే ఉంటుంది. మీ మీద పడిన అపవాదు తొలగిపోతుంది.కాకపోతే మీ మీద నిఘా ఉందని మరువకండి. లావా దేవీలలో జాగ్రత్త వహించాలి. నాగ పూజ చేయించండి.

కుంభ రాశి: భార్యా భర్తల మధ్య చిన్న తగాదాలు ఉన్నాయి. మౌనం పాటించండి. పట్టుదలలు మంచివి కావు.సత్యవంతులు ఎవరూ లేరు. పెద్దమనుషులు అనుకున్న వారు కష్ట పెడతారు. చండీ ధ్వజ స్తోత్రం చదవండి.

మీన రాశి: గర్భవతులు జాగ్రత్త వహించాలి. సంతానం అభివృధ్ధిలోకి వస్తుంది. కళాకారులకు మంచి అవకాశాలు రానున్నాయి.కుడి కన్ను విషయం లో జాగ్రత్త వహించాలి. లలితా సహస్రనామం చదవండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: స్వామినా ప్రతికూలేన ప్రజాస్తీక్ష్ణేన రావణ
రక్ష్యమాణా న వర్ధంతే మేషా గోమాయునా యథా

(వాల్మీకి రామాయణం, అరణ్య కాండ, 41.13)

మారీచుడు రావణునికి చెప్పిన మాట: ప్రతికూలమైన వ్యవహారం,తీక్ష్ణమైన స్వభావం గల రాజు చేత రక్షింపబడు ప్రజ నక్క చేత పాలింపబడు గొర్రెల మందలాగా అభివృధ్ధి చెందదు.

సమస్త సన్మంగళాని భవంతు!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “26 ఏప్రిల్ 2009 నుంచి 02 మే 2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: