‘ కాట్ ఆన్ ఎ ట్రైన్ ‘-చలనచిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష


బి.బి.సి. లో ఒక కార్యక్రమం కింద వచ్చిన ఈ సినిమా 1980 అప్పటిది. ఈ మధ్య బ్రిటిష్ లైబ్రరీ వారి పుణ్యమా అని డి. వి. డి లొ చూశాను.
సినిమా యావత్తూ ఒక్క డల్ ముమెంట్ లేకుండా అలా సాగిపోవటం వలన ఒక సమీక్ష వ్రాయాలి అని అనిపించింది.
రైల్లోకి ఎక్కిన తరువాత ఒక వృధ్ధురాలు ఒక యువకుని ఏదో విధంగా తగులుకుంటూనే ఉంటుంది. ఆ రైల్లో తీవ్రవాది కోసం వెతుకుతూ ఇతన్ని పట్టుకుని తీసుకునే సమయంలో ఆమె పోలీసు వాళ్లతో మాట్లాడి విడిపిస్తుంది…
కథ ఇంతే అని అనుకోలేము. యాదృచ్చికంగా జరిగే సంఘటనలన్నీ చిత్రంగానే ఉంటాయి. రైలు ప్రయాణం యావత్తూ…

ఏముంది ఇందులో అనే ప్రశ్న రావచ్చు. పరిశీలిద్దాం…

~~~***~~~

మన చుట్టూ నిత్యం జరిగే ప్రక్రియలన్నీ కథలే. కాకపోతే వాటిలో ఒక దాని వెనుక ఒకటి నిలబెట్టి ఆలోచిస్తే ఒక కాన్సెప్ట్ అందుకుంటుంది. వ్యావహారిక స్పందన అనేది మనుషులలో వాళ్లకి తెలియకుండానే ఉంటుంది. రైల్లో పట్టు బడ్డ వాడు ఎవరు అంటే పొరపాటుగా ఒక వ్యక్తి తీవ్రవాది అని పట్టు బడ్డట్లు కథలో కనిపించవచ్చు. అంతర్లీనంగా ఉన్న వ్యవహారం వేరు. సమానాంతరంగా సాగే ఒక ప్రతిక్రియల మాయాజాలం ఇందులో కనిపిస్తుంది. వృధ్ధురాలు ఆ వ్యక్తికి చివరకు చెబుతుంది-నువ్వు ఏదో పొందాలనుకుంటున్నావు కానీ నువ్వు శ్రధ్ధ లేని వాడివి అని! చాలా సేపటి వరకూ నన్నెందుకు ఈమె బాధిస్తుంది అనుకున్న అతను నిజానికి అక్కడ ‘ వ్యావహారికంగా ‘ పట్టు బడ్డాడు. రచయిత ప్రవహాన్ని బాగా చూపించాడు. అందు చేతనే చివరకు ఆవిడ గుడ్ బై అని ఇతను దిగిపోతున్నా సమాధానం చెప్పదు. కళ్లు మూసుకునే ఉంటుంది. ఇది రైలు కాబట్టి వెళ్లిపోవాల్సిందే! ఒక కథ ఏదీ ఇక్కడ జరిగి ఇది నిష్కర్ష అని చెప్పటం కనిపించదు. మానవ సంబంధాలన్నీ ఒక విధంగా ఏక్సిడెంట్లే! ఎక్కడో చిక్కుకుంటాం, ఎక్కడికో పోతాం, మనలోని వ్యక్తి, వ్యక్తిత్వం-రెండూ ఒక చిత్రమైన ప్రత్యామ్నాయంతో ముడి పడి కొద్ది సేపు పెనుగులాడుకున్న తరువాతే ఒక అద్దం లొ చూసుకున్నట్లు ఇవతలికి వస్తాయి. ఇది చెప్పిన తీరు గొప్పది…ఇందులో కామెంటరీ ఉండదు. రైలు అలా సాగిపోతూ ఉంటుంది కాబట్టి అడుగడుగునా చాలా సింపుల్ గా అందరి అందుబాటులో ఉన్న ఆలోచనలతో చిత్రీకరించిన శైలి ఇటువంటిది నాకూ జరగవచ్చు అనిపించి తీరుతుంది.

~~~***~~~
వృధ్ధురాలి పాత్ర పోషించిన డేం పెగ్గీ ఏష్క్రాఫ్ట్ కనబరచిన బాలెన్స్ సామాన్యమైనది కాదు. పాత్ర స్వయంగా నటించే పాత్ర! ఇతివృత్తం లో పాత్ర యొక్క పాత్రను ఒక పొంతనతో అర్థం చేసుకున్న నటుడులేదా నటి ఎప్పుడైనా రాణించగలరు. ‘ద క్లాడ్ ‘ అనే ఒక కథ చాలా మంది చదివి ఉంటారు.ఒక ఇంటిలో మాఊలు మహిళ ఇంటికి వచ్చి విసిగిస్తున్న పోలీసులకు, దుందగులకు తనదైన రీతిలో సమాధానం చెబుతుంది. అక్కడ మామూలు మనిషికి కావలసినది ప్రశాంతమైన నిత్య జీవితం, నిజ జీవితం అనె విషయం చక్కగా బయటకు వస్తుంది. ఇక్కడ ఈ చిత్రంలో ఈమే కూడా డాంభికం లేకుండా నిజాన్ని చెబుతూ అనిపించింది, కనిపించింది కలుపుకుంటూ ఎవరేమి అనుకుంటారు అనేది ప్రక్కన పెట్టి నిజ జీవితంలో బ్రతకాలి అనే విషయాన్ని చెప్పకుండానే చెబుతుంది…ఇటువంటి పాత్రలను చిత్రీకరుస్తున్నప్పుడు సంవాదాల విషయం లో నేర్పు చాలా అవసరం.ఇప్పుడు మాట్లుడుతుంది అనుకున్నప్పుడు మాట్లాడదు. కాదు అనుకున్నప్పుడు ఆకట్టుకునే మాట అంటుంది. అలాగే పాత్రల ప్రవేశం కూడా ఓహో అన్నట్లు ఉంటుంది…

~~~***~~~

సమీక్షకులు కంటిన్యుటీ ఎడిటింగ్, సూచర్స్ కాన్సెప్ట్-ఈ రెండిటినీ తీసుకుని ప్రేక్షకులకు దర్శకుడు ఒక సబ్జెక్ట్ స్థానాన్ని ఎలా కల్పించవచ్చు అనే విషయం మీద చర్చలు జరిపి యున్నారు. సూచర్స్ విషయానికి వస్తే సుదీర్ఘమైన సైకో అనాలిసిస్ ఇక్కడ లేకపోయినా మొదటిది-కంటినూవస్ ఎడిటింగ్, అలాగే సబ్జెక్ట్ స్థానం అనేది మీడియా పరం గా అధ్యయనానికి ఎంతో పనికి వచ్చే అంశాలు.దర్శకులు ఈ సినిమాని అందుకు చూడాలి. యథా తథంగా జాలువారు సంఘటనలను చిత్రీకరించి ఒక ఆకట్టుకునే నిజాన్ని సూక్ష్మంగా చెప్పటం ఎలా అనేది కొంత తెలుసుకోవచ్చు.

స్టిఫెన్ పోలియాకోఫ్ రచించిన కథ ఇది. దర్శకత్వం పీటర్ డఫెల్ వహించారు. ఇది ఉత్తమ సింగల్ ప్లే అవార్డు కూడా పొందినది.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ కాట్ ఆన్ ఎ ట్రైన్ ‘-చలనచిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష

  1. అవును! బావుంది! నాకు డైలాగులు నచ్చాయి!హ్యుమన్ రిలషన్స్ గూర్చి ఎంతో వ్యాఖ్యానం వుంది ఈ సినిమాలో!హ్యుమర్ కూడా అదిరిపోయింది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: