ఇతి వార్తా:-వేదాంతం శ్రీపతి శర్మ


‘ఎకనమిక్ టైంస్ ‘కొన్ని చింతాజనకమైన వార్తలు చెప్పింది. మొదటిది జి.డి.పి అంచనా 2009-10 ఫిస్ఖల్ సంవత్సరానికి 6 నుంచి 5.7 కు ఆర్. బి.ఐ తగ్గిస్తున్నది. కాకపోతే ప్రభ్త్వం, ఈ కేంద్ర బాంకు కలసి చేస్తున్న ప్రయత్నాల వలన మార్కెట్ లో వాడుక అంచనాలు పెరగగలవు అంటున్నది ఆర్. బీ.ఐ. నేను మరల చెబుతున్నాను. మన బాంకింగు రంగంలో గణనీయమైన మార్పులు వస్తే తప్ప ఈ కేంద్ర బాంకు ఇచ్చే విధానాలు అమలు కావు సరి కదా, ఆర్థిక వ్యవస్థ విషయంలో కీలకంగా పని చేయవలసిన ఈ బాంకులు వ్యవస్థ నుంచి దురమవటం ఖాయం. రెండవది రాష్ట్రాలు సమాజ శ్రేయస్సు మీద పెడుతున్న వ్యయం తగ్గుతూ వస్తున్నదని చెప్పింది. అలాగే విద్యా రంగం మీద రాష్ట్రాలు వెచ్చిస్తున్నది గత 3 ఏండ్ల మీద 51 నుంచి 43% కు దిగి పోయింది. మన దేశం మీద జరిపిన ఒక అధ్యయనం తరువాత విశ్వ బాంకు వారు మధ్య తరగతి విద్య మీద ఎక్కువ దృష్టి సారించాలని కొన్ని సంవత్సరాల క్రితం చెప్పి యున్నారు. ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కారణాలు పెద్దగా వెతుక్కోనక్కరలేదు. ఈ రంగంలో ప్రభుత్వం ఎలా డబ్బు పెడుతుంది? ఇది ప్రాచుర్యం ఇస్తుందా లేక లాభాలు తెచ్చి పెడుతుందా? అసలు మనది వెల్ఫేర్ స్టేట్ అనే సంగతే ప్రభుత్వం ప్రక్కన పెట్టి చాలా కాలం అయిపోయింది.మామూలు మనిషికి ఇంటిలోని వారి ఆరోగ్యం, పిల్లల చదువు,పుష్టికరమైన ఆహారం చాలు.స్టాక్ మార్కెట్లు,మార్కెట్ ఎకనామీలూ ఎందుకు? నాణ్యత గల ఈ మూడూ చవకగా ఏ ప్రభుత్వాన్నైనా ఇచ్చి చూపించమనండి,జనం మార్కెట్ గురించి ఆలోచిస్తారు… ప్రధాన మంత్రి గారు సెప్టెంబర్ 2009 కల్లా ప్రపంచం ఈ మాంద్యం నుంచి తేరుకో గలదని, మన ఆర్థిక ఫలితాలు కూడా 8 నుంచి 9 శాతానికి పుంజుకోగలదని ఒక వెదిక మీద చెప్పారు. ఆశాజనకంగానే ఉన్నప్పటికీ మార్చ్ 2010 కి ఆ పరిస్థితి ఉంటుందా అనేది సందేహం గానే ఉంది. మార్కెట్ లో స్పెండింగు పెంచాలంటున్నారు కానీ బాంకులు ఆ దిశగా పోవటం లేదు. ఆర్. బి.ఐ కూడా ఇప్పటివరకూ పెద్దగా ముందడుగు వేయలేదు. ఎన్నికల తరువాత ఏదైనా జరుగవచ్చని ప్రస్తుతం సరిపెట్టుకోవచ్చును!

~~~***~~~

రిసాట్ సెటలైట్ ను విజయవంతంగా ప్రయోగించటం అన్ని పేపర్లు చెప్పాయి. వాతావరణం, సముద్ర సరిహద్దులు ఇలాంటివి చూపిస్తుంది ఈ ఉపగ్రహం అన్నారు. ఈ మధ్య వాషింగ్టన్ టైంస్ వాళ్లు మరో విషయం చెప్పారు. రానున్న కొది సంవత్సరాలలో సముద్రం మట్టం చాలా మటుకు పెరగ బోతున్నది. కొన్ని ఊళ్లు-కోల్కటా, విజాగ్ లాంటివి మాయమైపోవచ్చును అన్నారు. అలాగే కొన్ని ద్వీపాలలాగా ఉన్న దేశాలు 25 సంవత్సరాలలో మాయమైపోవచ్చును. దీనికి గ్లోబల్ వార్మింగే కారణం అన్నారు.
ఆ సంగతులు కూడా ఈ ఉపగ్రహం చెబితే బాగుంటుంది.
1980 లో రీడర్స్ డైజెస్ట్ ఒక ప్రయోగాత్మకమైన విషయాన్ని ప్రస్తావించింది. పవర్సేట్ అనే ఉపగ్రహం గురించి చర్చించింది. దాని తరువాత అటువంటిదేమీ ఎవరూ ఎక్కడా మాట్లాడలేదు. ఇది విద్యుత్తును ఉపగ్రహం ద్వారా నిలవ చేసుకుని విద్యుత్తు లేని ప్రాంతాల మీద ఈ ఉపగ్రహాన్ని నిలబెట్టి విద్యుత్తు సమస్యను పరిష్కరించే ప్రక్రియ ఇది. పవర్ కట్లతో చస్తున్నాము! ఇలాంటిది ఎదైనా చేసి చూడండి. పోనీ పై నుంచి ఎదైనా నీళ్లు చల్లే సాధనం ఉంటే బావుండు!

~~~***~~~

‘ ద హిందు ‘ కరుణానిధి అన్న ఒక మాట గురించి చెప్పింది. ‘నేను ప్రభాకరన్ తీవ్రవాది అని అనుకోను ‘ అని ఆయన అన్నాడుట!
ఆయన అనుచరులే అటువంటి వారుట!
మరి కాంగ్రెస్ వాళ్లు ఏమనుకోవాలో!
ప్రస్తుతం అన్ని తీవ్రవాద సంస్థలలోని వారు వాళ్లల్లో వాళ్లు కొట్టుకు చస్తున్నారు. ఫండింగు ఆగిపోయింది. తమిళనాడులో అసలు ఎన్నికల అంశంగా ఎల్.టి.టి.ఈ ఎందుకు ముందుకు వస్తుందో తలచుకుంటే అసలు మన దేశం, మన రాష్ట్రాలు,మన ప్రజలు…వీటన్నిటి మీద చిత్రమైన ఆలోచనలు వస్తూ ఉంటాయి…

~~~***~~~

 ‘ద స్టేట్స్మన్ ‘ బెంగాల్ లో 50 ప్రాజెక్టులకు పి.పి.పి లను తయారు చేసి కేబినెట్ కు సమర్పించిన వార్త చెప్పింది. ఇందులో ఎన్నో ఇంఫ్రా స్ట్రక్చర్ కు సంబంధించిన ప్రాజెక్టులున్నాయి. ఈ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్పులు సామాన్యంగా లేవు. వీటి మీద చాలా చర్చ జరగాలి. వీటిలో సమ్ర్థవంతమైన కాంటృఏక్ట్ మేనేజ్మెంత్ చాలా అవసరం. మన వ్యవస్థలో-ముఖ్యంగా దొరబాబుల వ్యవస్థలో ఇది తలచుకుంటే ఆందోళనే ఎక్కువ కలుగుతుంది. చాలా పి.పి.పీలలో ఒక్క విషయం గమనించవచ్చు. చేతులు కలిపిన ఆ సంస్థ కాంట్రాక్టు కాల పరిమితి ఆరు ఏండ్లు ఉంటే మొదటి మూడు ఏండ్లలోనే మొత్తం లాభాన్ని సంపాదించే వ్యవస్థ ఇది అని ఈ మధ్య జరిగిన ఒక సర్వేలో తేలింది. ఒకరి అనుభవం నుంచి మరొకరు నేర్చుకోవటం మన దేశంలో జరగదు! ఢిల్లీ మెట్రో నుంచి హైదరాబాదు మెట్రో నేర్చుకోదు. ఎవరి దారి వారిదే! (మరి ఎవరి డబ్బు వారిదే కదా!)

~~~***~~~

గాంధీ గారి వస్తువుల వేలం విషయంలో ఎందుకో చిత్రంగా అనిపించింది. సమయం సందభం లేకుండా అతను ఇప్పుడే వేలం అనాలా? మన ప్రభుత్వం దగ్గర అంత డబ్బేది? పోనీ ఎవరి దగ్గర ఉంది? అదలా ఉంచి మందు కొట్టకండిరా అని చెప్పిన మహాత్ముని వస్తువులు వేలంలో కొనటానికి సిధ్ధమయ్యింది ఎవరు? పెద్ద మందు బాబు విజయ్ మాల్యా! అంటే మంచిని చేడే కాపాడుకోవాలి! బాగుంది. అదీ నిజమే! మందు నుంచి మరి అన్ని ఆర్థిక వ్యవస్థలూ లాభాలు పొందాల్సిందే కదా?

పాపం గాంధీ గారికి మిగిలింది ఒక వైపరీత్యం తప్ప మరేమీ లేదు!

~~~***~~~

ఇతి వార్తా:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: