ఆర్థిక విధానాల సమన్వయం-వేదాంతం శ్రీపతి శర్మకొద్ది రోజుల క్రితం పఒలో ఎం. మార్టెలి అనే ఆయన ‘ఎకనమిక్ టైంస్ ‘ లో మంచి వ్యాసం వ్రాశారు. ఆయన రూరల్, డొమెస్టిక్ ఎకనామీ లో జరిగే ప్రక్రియలు ప్రస్తుత ఆర్థిక పరిస్థితిలో కీలకం అని పేర్కొన్నారు. ఇది వినటానికి మామూలుగా ఉండవచ్చు. కాకపోతే ఇక్కడ ఆలోచన చేయవలసిన అంశం ఉన్నది. అది సమీకరణ సిధ్ధాంతం. దేశం లోని సమగ్రమైన ఆర్థిక విధానం లోకి ఈ అంశాలు ఇమిడి ఉన్నాయా లేక ఎవరి దారిన వారు పోతున్నారా అనేది గమనించాలి.
ఒక ఊళ్లో అందరికీ ఒక విధమైన జబ్బు వచ్చినప్పుడు మనకూ రావచ్చు అనేది ఒక ప్రక్క అయితే అసలు ఆ ఊళ్లో అప్పటికే ఉన్న ఆరోగ్య సమస్యలు, మన శరీరంలో ఉన్నవి, లేనివి సమీక్షించుకునే అవకాశాన్ని చూసే వాడు నిజమైన ద్రష్ట!
ప్రస్తుతం ప్రపంచం లో ఉన్న ఆర్థిక మాంద్యం నేపథ్యం లో ఇటువంటివి పరిశీలించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్తరోత్తర ఎంత అధ్యయనం చేసినా సరైన ఫలితాలు దొరక్క పోవచ్చు!
రాష్ట్రాలు ఎన్నికల నేపథ్యంలో రూపొందించిన కార్యక్రమాలు, ఆర్థిక పరిస్థితి మీద వాటి ప్రభావాలు ఇలాంటివి ఒక ప్రక్కన తీవ్రంగా పరిశీలించాలి.
ఇక్కడ గ్రామీణ ‘ ఇంక్లూసివ్ గ్రోత్ ‘ అనేది ప్రధానమైనది. రాజధానిలో రూపొందించే విధానాలు కాగితాల మీద ఉండేవి. రాష్ట్రాలలో, గ్రామీణ వ్యవస్థలో జరిగేది పట్టాలు తప్పకూడదు.ఇది ఒక విషయం. రెండవది ప్రస్తుతం మన దేశానికి ఒక అవకాశం ఉంది. ఇతర దేశాలలో వెను వెంటనే స్పందించగల రూరల్ మార్కెట్ కనిపించదు. వనరులు లేవు. మనం కొన్ని కీలకమైన సర్వీసెస్, ఉపాధి కల్పనలోని ప్రక్రియలను వేగవంతం చేసినట్లైతే కొద్ది కాలంలోనె  ఆర్థికంగా ఒక సెక్తర్ యావత్తూ స్థిరపడే అవకాశం ఉంది.
ఉదాహరణకు భారతీయ యువశక్తి ట్రస్ట్,ఫైనాన్షీల్ ఇంఫర్మేషన్ నెట్వర్క్ అండ్ ఓపరేషన్స్,వాటర్ హెల్త్ ఇండియా…ఇలాంటివి ఎంతో ఆలోచనతో మంచి సేవలు అందిస్తున్నాయి.
ఈ వ్యాసంలో ఒక దర్జీ చెన్నైలో ఒక కంపెనీ పెట్టి ఈ రోజు నడుపుతున్న వ్యవహారాని ఆయన పేర్కొన్నారు. (ఎకనమిక్ టైంస్ 06.04.2009 చూడగలరు)

ఈ సంస్థలకు ప్రాచుర్యం పెంచాలి. స్మార్ట్ కార్డ్ వ్యవస్థను దేశ వ్యాప్తంగా అమలు చేయాలి. దీని వలన చేతిలో ఏదో ఒక నైపుణ్యం కలవారు వెను వెంటనే వేగంగా రంగంలోకి దిగాలి.
ఈ విధానాలు ‘ ఇంక్లూసివ్ ‘ కావాలి-అంటే దేశం లోని ఆర్థికపరమైన ప్రక్రియలకు ఇవి భిన్నం కాకూడదు. ఒక టైం ఫ్రేం పెట్టుకుని పాలకులు వీటిని సమీకరించుకోవాలి.
ఈ దిశగా పని చేసేందుకు ఒక జాతీయ సంస్థను ఏర్పాటు చేసినా తప్పు లేదు.ఇది ఒక సమన్వయకర్తగానూ, ఇక్కడ పని చేస్తున్న అన్ని అంతర్జాతీయ సంస్థలకూ ప్రణాలికల విషయంలో సలహాదారుగానూ పని చేయాలి. మూడవది-వీటి కార్యాచరణను ఆర్థిక విధానాల దృష్ట్యా సమీకరించి ప్రతి నెలా ఒక జాబితాను విడుదల చేయాలి.కాకపోతే ఇది మరో బ్యూరొక్రెటిక్ గా పని చేసే దిక్కుమాలిన సంస్థ కాకూడదు!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “ఆర్థిక విధానాల సమన్వయం-వేదాంతం శ్రీపతి శర్మ

 1. మీ ఆలోచన బాగుంది కాని, ఒకరు చేస్తున్నారు కదా అని అందరు అలాగే మొదలుపెడ్తే ఉపయోగం ఉండదేమో. డాట్ కాం టైం లో కూడా ఇలాగే పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చిన కంపెనీలు చాలావరకు మూత పడ్డాయి. నేను మీరు చెప్పేవాటిని డాట్ కాం తో పోలిక సరియైనది కాకపోవచ్చు కాని కొద్దిగా ఆలోచించి చూడవలసినదే. ఆర్ధిక వ్యవస్థని అర్ధంచేసుకోవడం అంత సులువు కాదనిపిస్తుంది. ఆసక్తికరమైన విషయం 🙂

  ~సూర్యుడు 🙂

 2. ఇంక్లూజివ్ గ్రోత్ అంటే ఏంటో తెలీన వాళ్ళు కూడా ఉంటారు కదా! మరి దాన్ని ఎక్కడ్నించి నేర్చుకోవాలి. మీలాంటి వారే ఆ పనిని వేరే పోస్టుల్లో నెత్తిన వేసుకోవద్దా! తెలుసుకోవలంటే ఇంగ్లీషులో తెలుసుకుంటారులే అనుకోవద్దనేగా నా అభ్యర్ధన.

  సమీకరణ సిద్దాంతం అంటే ఏంటీ? పోనీ రివర్స్ – ఇంగ్లీషులో చెప్పండి ఒకసారి.

  ఒక్కటి మాత్రం అర్ధం అయ్యింది – కంపేరిటివ్ స్టడీకి ఇది రైట్ టైమ్ అంటున్నారు మీరు అంతేనా!?

  నాదో ఆలోచన – ఇంక్లూజివ్ గ్రోత్ లో ఫండింగ్ దొరికే వాళ్ళందరూ, మళ్ళీ హ్యాండీక్రాఫ్ట్స్ వాళ్ళలాగా చేనేత మగ్గం వాళ్ళ లగా, ఓసారి సైకిల్ ఐపోయిన తరువాత కూడా సహాయం కోసం చూసేవాళ్ళలాగా అవ్వకుండా ఉండేలా చూసుకోవాలి; కొంచెం మీకు కోపం వచ్చినా, ఇలా అవ్వకుండా ఉండాలి అంటే, ఈ చేతిలో నైపుణ్యాలు సంస్థాగతం అయ్యే అవసరం రాకుండా అమ్ముకోగలవి అవ్వాలేమో అని.ఒక వేళ సంస్థాగతం అవ్వగలిగితే, అప్పుడు అవి డాట్ కామ్ కంపెనీల్లాగా ఎగిరిపోయినా పట్టించుకోకూడదు; వాళ్ళు మళ్ళీ కొత్త ఎంటర్ ప్రెన్యూరియల్ స్పిరిట్ తో ముందుకి వెళ్ళగలిగేలా ఉండాలి.

  ఇంక్లూజివ్ గ్ర్లోత్ అనేది – చాలా అట్టడుగు వర్గాల్లో ఉన్నవారికి, అందులో ఎంటర్ ప్రెన్యూరియల్ స్పిరిట్ ఉన్నవారికి డబ్బు అందే విధంగా చేసే ఆలోచన; అలాంటి ఉపాధులు నిజానికి ఒక స్థాయిని మించి ఎదగవు.కానీ కొత్త ఆలోచనలు పుట్టుకకి మాత్రం దారి తీసే విధంగా తీర్చి దిద్దచ్చు సుమండీ!.అప్పుడు వెంటెనే అది జనరెల్ మార్కెట్ ఫోర్సెస్ లోకి వచ్చేయాలి. ఏమంటారు?

  1. ఆర్యా!

   తమరు చెప్పిన దానిలో తప్పేమీ లేదు. నాకు కోపమూ రాలేదు! సామాన్యంగా రాదు కూడా! కాకపోతే ఆర్థిక వ్యవహారాల విషయం లో మాట్లాడుతున్నప్పుడు ఎంత వద్దన్నా సబ్జెక్ట్ లోని కాన్సెప్ట్స్, పదాలు అదే వాడుక ఒరవడిలో అలా ఎవరికైనా వెళ్లిపోతాయి. సమకాలీనమైన వార్తా జగత్తులో కొంత ఈదుతున్న వాళ్లు ముందుకు వస్తారనే దురాశ నాకు లేకపోలేదు! (మీరు ముణిగి తేలుతున్నారని చెప్పవచ్చేమో!)

   శ్రీపతి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: