మనం-మన దేశం(8)-ఎన్నికలు 2009


16 ఏప్రిల్ రానే వచ్చింది. 2009 లో ముస్తాబు కావలసిన లోక్ సభకు ఎన్నికల మొదటి దశ ఇది. దాదాపు 1031 పార్టీలలో 7 జాతీయ దళాలు, మిగతావి ప్రాంతీయ దళాలు పోటీలో ఉన్నాయి. 77 కోట్ల మంది వోటు హక్కును వినియోగించుకోవచ్చును. 58.07 శాతం క్రిందటి ఎన్నికలలో వోటు హక్కును వినియోగించుకుంటే ఈ సంవత్సరం 65 శాతం ఉండవచ్చని అంచనా. పది కోట్ల మంది మొదటి సారి వోటు హక్కును వినియోగించనున్నారు. ఈ పది కోట్లలో 18 నుంచి 25 సంవత్సరాల వయసు ఉన్న వారు ఎక్కువగా ఉన్నారు. ఇది గణితం.
1991 నుంచి 1996 కు వోటర్లలో పెరిగిన సంఖ్య దాదాపు ఇంతే! (10 కోట్లు).
వోటర్ టర్న్ అవుట్ 1% పెరిగింది..1999 కి, 2004 కి వోటర్ల సంఖ్యలో గణనీయమైన మార్పు లేదు. కానీ వోటర్ టర్న్ అవుట్ నిజానికి తగ్గిందని చెప్పాలి.
ప్రస్తుతం రెండూ పెరగనున్నాయి-వోటర్ల సంఖ్య, టర్న్ అవుట్ కూడా. ఇలా గతంలో ఎప్పుడు జరిగినది అనేది పరిశీలిద్దాం.
1977 లో వోటర్ల సంఖ్యలో 5 కోట్ల వృధ్ధి జరిగి టర్న్ అవుట్ కూడా 5 % పెరిగింది (1972 మీద).
మిగతా ఎన్నికలలో ఒకటి పెరిగితే ఒకటి తగ్గటం లాంటివి జరిగింది.
1977 లో ఇలా జరిగింది ఎమర్జెన్సీ ప్రభావం కావచ్చును. వోటర్ల సంఖ్య పెరగటం ఎవరి చేతిలోనూ లేదు.
టర్న్ అవుట్ అనేది వోటర్ల స్పందన మీద ఆధార పడి ఉంటుంది.
రెండు పార్టీలను పరిశీలిద్దాం-సి.పి.ఎం, బి.ఎస్. పి. మొదటిది ఎంత సేపూ కొన్ని సీట్ల కోసమే పోటీ చేస్తూ ఎక్కువ తక్కువలు తెచ్చుకుంటూ ఉంటుంది. బి.ఎస్.పి పోటీ చేస్తున్న సీట్ల సంఖ్యను పెంచుతూ పోతున్నది. ఇది చిత్రమైన విషయం కాదు. దీని వెనుక ఒక సిధ్ధాంతం ఉంది. పార్టీ గెలిచే చోటే పోటీ చేయటం ప్రస్తుతం ఉన్న వ్యవస్థలో అంత మంచిది కాదు.నీటిలోకి రాళ్లు విసురుతూ పోవాలి. చెల్లా చెదురు చేస్తూ పోవాలి! రంగ స్థలం మీద నిలబడి ఉండాలి.

స్పష్టంగా కనిపిస్తున్న విషయం ఏమిటంటే రాజకియ ప్రక్రియలో మునుపెన్నడూ లేనంతగా పార్టీలతో బాటు ప్రజలూ ఈ సంవత్సరం పాల్గొంటున్నారు. ఒక సమూహంలో ఒక ప్రక్రియలో పాల్గొనే వారి సంఖ్య పెరుగుతున్నప్పుడు స్వతంత్రంగా ఆలోచించే వారి సంఖ్య కూడా పెరుగుతుందని సిధ్ధాంతాలు చెబుతున్నాయి, చరిత్ర కూడా చెబుతున్నది. ఇక్కడ సమూహం అంటే ఒక గ్రూప్ అని అనుకోవటం కొద్దిగా తప్పే! కలెక్టివ్ థింకింగ్-సనఠితమైన దృక్పథం ఒక ప్లూరలిస్టిక్ సంఘం లో రావటం కష్టం. నాయకుని ఎంచుకోవటం అనేది మన సమాజంలో దూరం అవుతున్నది. ఒకరి వెనుక నడిచే ధోరణి పార్టీలలోనూ లేదు, ప్రజలలోనూ లేదు. అది మారిపోయింది. మరి వోటు అనేది దేనికి వేయబోతున్నారు? ప్రభుత్వం కోసం, పాలన కోసం. ఎటువంటి పాలన? ఏమో!

ఈ మధ్య ఒక నైజం కనిపిస్తున్నది. నా వోటు ఎటు పడ్డా ఎవరో ఒకరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తారు. అంటే మన యంత్రాంగం మీద ఎనలేని నమ్మకం ప్రజలలో కనిపిస్తోంది. అందు చేత వోటు అనేది ఒక శాసనం కోసం కాదు, ఒక అభిప్రాయాన్ని వ్యక్త పరచటం కోసం ప్రజలు వేస్తున్నారనేది అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో జరుగుతున్న, జరగబోతున్న ప్రక్రియ.

కొత్త మాటలు, కొత్త దృక్పథం గురించి చెబుతున్న వారు, కొత్త మొహాలు కొత్త వోటర్ల మనస్సులోకి చాలా మటుకు దూరారనే చెప్పాలి.
పది కోట్ల కొత్త వోటర్లు నిజంగా ఎంత కొత్త అనేది మంచి ప్రశ్న. వీళ్లు వారి కుటుంబ, కుల, మత విషయాలకు కొత్త కాదు! వీరి పెద్దల ఆలోచనా విధానాల నుంచి ఎంత దూరంగా ఆలోచిస్తారు? ఇది జరగనిది. మన విద్యా విధానం దీనిని పట్టించుకోలేదు. ఎంత నేర్చినా, ఎంత చూసినా భారతీయుడు ఐడెంటిటీ సమస్యలోంచి ఇవతలకి రాడు. దానికి ఎంతో ప్రతిభ ఉండాలి, కొంత త్యాగం కావాలి.సగటు భారతీయుడు ప్రప్రథమంగా తనకి తాను ఒక మామూలు మనిషినని ఒప్పుకోవాలి. దీనికి ఇంకా చాలా సమయం ఉంది…

ప్రస్తుతం గణితం ప్రకారం అంకె మారింది. సంఖ్య పెరిగింది. అంతే! దాని ప్రభావమే ఫలితాలలో కనిపిస్తుంది.

కొంత మంది చేసిన సర్వే ప్రకారం యువత మీద తాజ్ మహల్ హోటల్ ఉదంతం గట్టి ముద్ర వేసినట్లు కనిపిస్తున్నది. దీనిని దాటి నిరుద్యోగం నివురు గప్పిన నిప్పులా ఉంది. ప్రభుత్వం కొన్ని రంగాలను-మౌలికమైన పరిశ్రమల రంగాలను చాలా ఏండ్లుగా మార్కెట్ వంక పెట్టుకుని విస్మరించటం జరిగింది. దీని పర్యవసానం ఇప్పుడు కనిపించవచ్చును. 1989 లో అందరూ బోఫోర్స్ అనుకున్నారు. కానీ చివరికి తేలింది ధరల ప్రభావం అన్నారు. స్త్రీలలో లా అండ్ ఆర్డర్ పరిస్థితి పట్ల చాలా చోట్ల అసంతృప్తి కనిపిస్తోంది…

ఇది పట్టణాల వ్యవహారమే కానీ పల్లెల్లో మరో తరహా ఉంది. ఇక్కడ స్థానిక సమస్యల ప్రభావం ఎక్కువే కాకుండా డిలిమిటేషన్ వలన మారిన అభ్యర్థుల జాబితాలు, సీట్ల సద్దుబాటు వ్యవహారం వలన, ఆంతరంగిక అసంతృప్తి వలన వోటింగు పోకడ మారవచ్చును.

ఈ అంశాల వలన కొత్త దళాలు లాభం పొందనున్నాయి అనటంలో పెద్దగా ఆలోచించనక్కరలేదు. బేలట్ పేపర్ మీద అటువంటి వ్యవస్థ ముందుగానే తయారయి ఉన్నది.

ఆఖరుకి ఫలితాల జాబితాలో అన్ని పార్టీలు ప్రాంతీయ పార్టీల జాబితాలోకి వస్తాయేమోననే అనుమానం గట్టి పడుతున్నది…

ఈ టపా కంటే మునుపు 1951 నుంచి 2004 వరకు ఎన్నికల గణాంకాలు ఇచ్చి యున్నాను. అయితే ఇవి జరిగి పోయినవి. వాటి మీద కేవలం గణితం బట్టి ఒక విశ్లేషణ చూశాం. ఇంకా చిత్రమైన విషయం ఏమిటంటే ప్లూరలిసం అనేది ఏ సంవత్సరాలలొ జరిగింది, అలా ఎందుకు జరిగంది అనేది 1951 నుంచి ఎంచుకుని గ్రహాల పరిస్థితిని పరిశీలించి చూడ వచ్చును. ఆ విశ్లేషణలో చిత్ర విచిత్రాలు ముందుకు రాబోతున్నాయి…

~~~***~~~

(To be continued)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “మనం-మన దేశం(8)-ఎన్నికలు 2009

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: