మనం-మన దేశం(7)..’ఎన్నికలు ‘-వేదాంతం శ్రీపతి శర్మ


1991లో వోటర్ల సంఖ్య మారలేదు. కారణం ఏమిటంటే కొన్ని చోట్ల పోలింగు జరగలేదు.అక్షరాస్యత 52.21 ఉన్నది. అదే సంవత్సరంలో జనగణన కూడా జరిగినది. ఈ అక్షరాస్యత మొదటి సారి వెర్నాకులర్ భాషలు-అంటే ప్రాంతీయ (ట్రైబల్ కూడా)భాషలను లెక్కలోకి తీసుకుని చెప్పిన గణనాంకం.కొన్ని చోట్ల పోలింగు జరగనందున వోటర్ టర్న్ అవుట్ తగ్గినట్లు కనిపిస్తుంది.ఈ ప్రాంతాలలో 1992 లో ఎన్నికలు జరిగాయి.సంకీర్ణ ప్రభుత్వాలకు గట్టి పునాది ఈ ఎన్నికలే వేయించాయని చెప్పవచ్చును.ఒక విధంగా ఆలోచిస్తే రాజకీయాలలో కేవలం వోటింగు ద్వారా పాల్గొనటం తగ్గింది. పార్టీల పరంపర పెరిగి కూటముల ఏర్పాటుకు రంగం సిధ్ధమైనది. ఈ నేపథ్యంలో ఎవరు ఒక కూటమిని సమర్థవంతంగా ముందుకు తీసుకుని వెళతారో వారికి అధికారం అందటం జరిగంది.

1996 లో వోటర్ల సంఖ్య 9 కోట్లకు పైగా-దాదాపు 10 కోట్లు పెరిగినా వోటర్ టర్న్ అవుట్ పెరగలేదు. సూటిగా చెప్పాలంటే ప్రజలలో ఒక పార్టీకి మొగ్గు చూపే వ్యవహారం లేక పోయినప్పటికీ ఆ మధ్యనే ప్రభుత్వాలు రావటం, పోవటం, పార్టీలను కొనుక్కోవటం వంటివి విరివిగా జరుగుతున్నందుకు పోలింగు ప్రక్రియ పట్ల ఒక చిరాకు భావం ఏర్పడటం జరిగి యుండవచ్చును. కాకపోతే 1991-92 నుంచి 1999 తో పోల్చటం ఒక పధ్ధతి.వోటర్ల సంఖ్యలో 10 కోట్ల పెరుగుదల, వోటర్ల టర్న్ అవుట్ లో 5% పెరుగుదల ఆలోచించవలసిన విషయాలు. ఫలితాలు మనకు తెలిసినవే. ఒక పార్టీకి మొగ్గు చూపటం అవసరం లేదనుకుంటూనే పోలింగు ప్రక్రియలో విరివిగా జనం పాల్గొనటం గణనీయం.ఇది ప్రస్తుతం మన దేశం లో ఉన్న రాజకీయ పరిస్థితి.ఇది మంచి పరిణామం. ఎన్ని విభేదాలున్నప్పటికీ ప్రక్రియలో పాల్గొనటం అనేది ఉత్తరోత్తర మంచి పరిణామాలకే దారి తీస్తుంది. ఎన్. డి. ఏ పాలనలో ఎన్నడూ లేనంతగా పార్టీలు కూటమి లో ఉన్నాయి. 2004 లో అక్షరాస్యత 64% కనిపిస్తున్నది. రెండు ప్రధాన పార్టీలకు తేడా పెద్దగా లేకపోయినా కూటముల పునర్వ్యవస్థ యు.పి.ఏ ను ముందుకు తీసుకుని వచ్చింది.వోటర్ల సంఖ్య 6 కోట్లు పెరిగినా వోటర్ టర్న్ అవుట్ పెరగలేదు. కారణం- ప్రజలలో ప్రభుత్వం ఎవరిదైనా గవర్నెన్స్ లో మార్పు ఉండదు అనే ధోరణి కనిపించింది.
కాంగ్రెస్ కు వచ్చిన వోట్ల శాతం 1999 లో 28 నుంచి 26 శాతానికి తగ్గినా సీత్ల విషయం లో 114 నుంచి 145 కు చేరుకుంది.సి.పి.ఎం 3 సీత్లు తక్కువ పోటీ చేసి 10 సీట్లు ఎక్కువ గెలుచుకుంది!
ఇదేంటి? స్టిక్లర్ చేపల సిధ్ధాంతం ఇక్కడ పని చేస్తుంది.పోలింగు బూతుకు వెళ్లే జనం పెరగకపోయినా, అసలు రంగంలో ఉన్న వోటర్ల జనం పెరిగినప్పుడు నిశ్చితమైన పోలింగు జరగటం సంభవం. అదే వోటర్ల సంఖ్య పెరగకుండా కేవలం వోటర్ల టర్న్ అవుట్ పెరిగితే బహు పక్ష పోలింగు సంభవం. 

గత మూడు ఎన్నికలలో వోటర్ల సంఖ్య పెరుగుతోంది కానీ వోటర్ల టర్న్ అవుట్ గణనీయంగా పెరగటం లేదు.2004 లో ఇది తగ్గినది కూడా!
2009 లో వోటర్ల సంఖ్య 10 కోట్లు పెరిగితే టర్న్ అవుట్ ఖచ్చితంగా 6 నుంచి 9% శాతం పెరగవచ్చని అంచనా. దీనికి కారణం యువత జనాభా తో పాటు అక్షరాస్యత 10 శాతానికి కి పైగా పెరగటం.
అందు చేత 1996 లోని పోకడలు, 1999 లోని పోకడలు కలసిన ఫలితాలు 2009 లో ఉండవ్చ్చని మంకి ఈ గణితం చెబుతున్నది.

~~~***~~~

(To be continued)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “మనం-మన దేశం(7)..’ఎన్నికలు ‘-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: