ఇతి వార్తా:-వేదాంతం శ్రీపతి శర్మ


ఎకనమిక్ టైంస్ కాస్ట్ ఆడిట్ కమిటీ గురించి చెప్పింది.

నిజానికి కాస్ట్ ఆడిట్ మన దగ్గర ఎవరూ పట్టించుకోని కాన్సెప్ట్. దీనిని అనివార్యంగా పెట్టి కంపెనీ రిటర్నులలో ఒక ముఖ్యమైన రిటర్నుగా పెడితే చాలా మేలు జరుగుతుంది. సత్యం వ్యవహారంలో బాంకు స్టేట్మెంట్లను చూడకుండానే, రికన్సిలియేషన్ చేయకుండానే ప్రతి సంవత్సరం ఆ అంతర్జాతీయ

 ఆడిట్ సంస్థ లెక్కలను ధృవీకరించటం జరిగిందా అనే ప్రశ్న కూడా వేసుకోవాలి.
పర్యావరణ ఆడిట్, సాఫ్ట్ ఆడిట్ (అన్నీ కంప్యూటరైస్డ్ చేసినప్పుడు ఇది కూడా అవసరం) ఇలాంటివి అభివృధ్ధిలోకి రావాలి. సి & ఏ. జి కూడా
కొద్దిగా నడుము బిగించవలసిన అవసరం ఉన్నది.
~~~***~~~

ఇండియన్ ఎక్స్ ప్రెస్ సజద్ లోణె ఎన్నికలలో పాల్గొనటం గురించి చెప్పింది.

ఒక కోణంలో చూస్తే ఇది కొత్త పరిణామం. చాలా కాలంగా సంఘర్షణలు అర్థం కాకుండా అలా సాగిపోతూ ఉన్నాయి. ఎవరు తీవ్రవాదులో, ఎవరు ఒక విషయం మీద పోరాడుతున్నారో తెలియకుండా సమస్యలు ఎక్కడికక్కడే స్తంభించి యుండటం మనం గమనిస్తున్నాము. ఇలా ఎన్నికలలో పాల్గొని ముందుకు రావటం వలన లోణె గారికే కాదు. కశ్మీర్ లోయ కు రాజకీయంగా సత్పరిణామాలే ఉండవచ్చును.
~~~***~~~

‘ద హిందు’ సిఖ్ఖుల ప్రొటెస్ట్ గురించి చెప్పింది.

దైనిక్ జాగరణ్ పాత్రికేయుడు జర్నైల్ సింఘ్ విసిరిన షూ ఎంతో కాలంగా రగులుతున్న కడుపు మంటకు తార్కాణం. మన వ్యవస్థలు ఎంత దుర్భరమైన స్థితిలో ఉన్నాయో తలచుకుంటే బాధగానే ఉంటుంది. సి.బి.ఐ లాంటి సంస్థలు ఎంత నమ్మదగ్గవో అందరికీ తెలుసు. గృహ మంత్రి గారు కూడా విషయం ఒప్పుకుని స్పందించారు. ఈ విషయం లో చిదంబరం గారిని మెచ్చుకోవాలి. కొద్ది రోజుల క్రితం సి.ఎస్.టి ని నిర్మూలించినప్పుడు (ఆయన ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు) ఆయన ఈ విషయమై పార్లమెంటులో ఏ చర్చా జరగకపోవటం విచారకరమని ఒప్పుకున్నారు. నిజమే! మన దేశంలో ప్రధానమైన వాటి మీద సరైన చర్చలు జరగవు!
మెజారిటేరియన్ పోకడలో ప్రజాస్వామ్యం సాగిపోవటం – పార్టీలు, వ్యవస్థలు నిలచిపోతాయి, నిజానిజాలు కనుమరుగైపోతాయి-ఇదే నిజమని చెప్పి ఇది నిజం కాకూడదు అని చెప్పేందుకే ఈ షూ ఇలా ఒక మంత్రిగారి మీద పడింది…
ఆయన పాపం తప్పుకున్నారు. టైట్లర్ కూడా తప్పుకున్నాడు. ఈ వ్యవస్థ తప్పు. ఇది తప్పించుకోకూడదు…
~~~***~~~

టైంస్ ఆఫ్ ఇండియా పాకిస్తాన్ విదేశీ మంత్రి  ఖురేషి ఐ.ఎస్.ఐ ని

బాగు చేస్తామన్న వార్తను చెప్పింది.
ఈ మధ్య కాలంలో నాకు బాగా నచ్చిన వ్యక్తి ఈ ఖురేషీ! లేని ధైర్యాన్ని తెచ్చుకుని గుండె నిబ్బరం చూపిస్తూ మధ్య మధ్యలో గుటకలు మింగుతూ అదీ ఇదీ అంటూ ఉంటాడు ఈయన. నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా!-ఐ.ఎస్. ఐ ని మీరేమిటి బాగు చేసేది? మీ దేశంలో ఇప్పుడు ఎవరు ఉండబోతున్నారో ఎవరు చెప్పాలి? తాలిబన్, అమెరికా, ఇంకా మరి ఎవరో! ఏ లోకంలో ఉన్నాడో సద్దాం హుసేన్!

~~~***~~~

అన్ని పేపర్లూ రాహుల్ గాంధీ ప్రధాన మంత్రి అయ్యే లక్షణాలు కలవాడని ప్రియాంకా పేర్కొనటాన్ని మంచి ప్రాముఖ్యతనిచ్చి ప్రచురించాయి!
బావుందమ్మా! మనం చెప్పేది ‘ ఆం ఆద్మీ ‘ కథలు. కావలసినది మటుకు-నా వాళ్లు, నా గోల-ఇంతేలే!
ఎవరు ఆం ఆద్మీ? మీరు కాదు ఈ ఆం ఆద్మీకి అన్నీ ఇచ్చేది. మన ప్రజాస్వామ్యం ఒక ఆం ఆద్మీ ప్రధాని అయినప్పుడు చేసుకోవలసినది నిజమైన పండుగ!-అది కూడా పార్లమెంటరీ పార్టీకి నాయకునిగా ఎన్నుకోబడి రాష్ట్రపతికి లేఖ సమర్పించి ప్రభుత్వాన్ని తయారు చేయమని ఆహ్వానం పొందువాడు అలా పదవిని అలంకరించాలి…

రాజీవ్ గాంధీ హత్య జరిగినప్పుడు ఎన్నికలను పోస్ట్ పోన్ చేయవలసిన అవసరం ఏమీ లేదు. ఆయన పదవిలోనూ లేడు. ప్రభుత్వ యంత్రాంగానికీ ఏ అవరోధం జరగలేదు. ఆయనను మామూలు మనిషిగా-ఆం ఆద్మీగా మరి శేషన్ గారు ఎందుకు పక్కన పెట్టలేదు?
1947 లో స్వాతంత్ర్యం వచ్చింది మన బ్యూరొక్రెసీకి, కొన్ని శతాబ్దాల స్వాతంత్ర్యం వచ్చింది ఒక కుటుంబానికీ, భజన వ్యవస్థకీ, ఈ మూడిటికీ ప్రాచుర్యం ఇచ్చే ఫోర్త్ ఎస్టేట్-ప్రెస్సు వారికీ!
రేపు రాహుల్ అంటాడు-సోదరి ప్రియాంక ఇందిర బామ్మ వారసురాలు అని! మన పత్రికలు హెడ్ లైన్లలో పెడతాయి!
మామూలు మనిషికి స్వాతంత్ర్యం రాలేదు. వాడి పేరును మటుకు స్వతంత్రంగా వాడుకునే వారి స్వాతంత్ర్యం పెరుగుతూనే ఉంది!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “ఇతి వార్తా:-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: