మనం-మన దేశం (6)-‘ఎన్నికలు’-వేదాంతం శ్రీపతి శర్మ


క్రిందటి వ్యాసంలో ఒక పట్టిక ఇచ్చి యున్నాను. ఇది 1951 నుంచి జరిగిన ఎన్నికల వివరాలను చూపిస్తున్నది. అక్షరాస్యత పెరగటం, వోటర్ల సంఖ్య జనాభా తో పాటు పెరగటం సామాన్యమే. కాకపోతే కొన్ని చిత్రమైనవి పరిశీలించవలసి యున్నది. 1977-ఎమర్జన్సీ ప్రభావం తరువాత ఎన్నికలు, 1984 లో ఇందిరా గాంధీ గారి హత్య తరువాత జరిగిన ఎన్నికలు, 1989 లో బోఫోర్స్, ధరలు విపరీతంగా పెరగటం తరువాత ఎన్నికలు కొద్ది సేపు ప్రక్కన పెడదాము. మిగతా సంవత్సరాలలో చూస్తే 1971 లో వోటర్ టర్న్ అవుట్ తగ్గినది (61 నుంచి 55).1980 లో 77 మీద తగ్గినది (60 నుంచి దాదాపు 57).1989 లో 1985 మీద తగ్గినది (72 నుంచి 62). 1991 లో మరల తగ్గినది (62 నుంచి 57).1996లో సామాన్యంగా పెరిగి 1998 లో మరల 62 కు చేరుకుంది.1999 లో 60 ఉంది. మరల 2004 లో కొద్దిగా తగ్గి 58 కు చేరుకుంది.

దీని భావమేమి? ఒక సిధ్ధాంతం ప్రకారం అక్షరాస్యత పెరగటం, వోటర్ల సంఖ్య పెరగటం వలన ముందుగా కనపడుతున్న వ్యవస్థ పట్ల ఒక డైవర్షన్ వస్తుంది.

1984-85 ఎన్నికల నుంచి 1989 ఎన్నికల లోపు 10 కోట్ల వోటర్లు పెరిగారు. అలాగే అక్షరాస్యత కూడా దాదాపు గణనీయంగా పెరిగింది. వోటర్ల టర్న్ అవుట్ తగ్గినది.
ఇదే సమయంలో ప్లూరలిసం-బహు పార్టీల వ్యవహారం ముందుకు వచ్చింది. గతం లో ఎన్నడూ లేనట్టుగా అయిదు పార్టీలు ముందుకు వచ్చి బి.జె.పి సపోర్ట్ తో జె. డి. ప్రభుత్వం ఏర్పాటు చేసింది. అనగా అప్పటికి మన అక్షరాస్యత 50 శాతానికి-అంటే మన ప్రజాస్వామ్యం ఒక ఇంటర్వల్ పరిస్థితికి వచ్చినట్లు చూడవచ్చు…

~~~***~~~

 
(To be continued)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: