‘ఆనంద తాండవం ‘-తెలుగు చలన చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష


 

ఇది మరో తమిళ డబ్బింగ్ చిత్రం. తిరునల్వేళి దగ్గర ఒక రిసర్వాయర్ చుట్టూ ఉన్న చక్కని వాతావరణాన్ని చిత్రీకరించారు.

తమిళ నవల ఆధారంగా తీసిన చిత్రం ఇది. గాంధీ కృష్ణ గారు ఇటీవల కొన్ని మంచి చిత్రాలు తమిళంలో తీసి ఉన్నారు. ఈ చిత్రం ఇలా ఎందుకు తీశారో అర్థం కావటం లేదు.

 యౌవనం, చిన్నతనం మధ్య పరిపక్వం కాని ఒక అమ్మాయి పాత్ర, ఆమెతో ప్రేమలో పడిన హీరో, ప్రేమ విఫలమవటం, ఆమె అమెరికా వాడితో వివాహం చేసుకోవటం, ఈయన అమెరికాకు వెళ్లి అక్కడ ఎన్.ఆర్.ఐ సంస్కృతిలో బాధలు పడటం, మరో అమ్మాయితో పరిచయం, మరల పాత అమ్మాయి రావటం, ఆమెకు అన్యాయం జరగటం, చివరకు ఆ అమ్మాయి చనిపోవటం-ఇది చిత్రం.

చివరకు కొత్త అమ్మాయి హీరోతో ‘ నేను నిన్ను కాదు, నీలోని   ప్రేమను ప్రేమించాను ‘ అనటం తో సినిమా ముగుస్తుంది.

కథ ఏదైనా కావచ్చు. సమస్య ట్రీట్మెంట్ దగ్గర వస్తుంది.

 బేలతనం వలన మోసపోయే అమ్మాయిని ప్రేమించి మోసపోయినా ఆమె పట్ల అనురాగం, ఆమె సుఖంగా ఉండాలనుకోవటం ఈ ప్రేమికుని
బాధ కావచ్చు. ఒక పాష్చాత్య సంస్కృతి లో ఉంటూ ఈ రెండవ అమ్మాయి ఆ ఉదాత్త ప్రేమను గుర్తించి ఆకర్షితురాలవ్వచ్చు. ఆ తరువాత దర్శకుడు ఏమీ చేయలేదు.ఇదీ సమస్య.

రూపకం అనేదానికి కొన్ని లక్షణాలు అవసరం. రూపొందించిన విషయంలో గర్భం- డ్రామా ఎలిమెంట్ ఎక్కడున్నది అది ఎప్పుడు ఏ విధంగా ప్రేక్షకుని ముందుకు వస్తున్నది, దాని ఉపసంహృతి ఏ విధంగా చివరకు జరుగుతున్నది అనేది ఎటువంటి రూపకానికైనా ఆలోచించటం అనివార్యం.

నటీ నటుల చేత కేవలం నటింప చేయటం సినిమా కాదు. పాత్రల ప్రయాణం కథ చాటుగా ఎలా సాగాలీ అనేది దర్శకుడు, ఎడిటర్ ఇద్దరూ ఒక సారి కష్ట పడి హోం వర్క్ చేసుకోవాలి.

రెండు పాటలు బాగున్నాయి.కాకపోతే చివరి పాట ఆ విధంగా ఒక కేబరే పాడే వారి చేత అంత ‘ తమిళంగా’ ఎందుకు పాడించారో తెలియలేదు. ఆ కంఠం స్త్రీదైనప్పిటికీ ఎక్కడో పోలేరమ్మ జాతరలో పూనకం వచ్చిన వారో లేక స్త్రీలంతా కలసి ఉద్యమానికి వెళుతున్నట్లుగానో ఉంది. చిత్రం ఏమిటంటే పాపం సాంప్రదాయ నృత్యం నేర్చుకున్న రెండవ అమ్మాయి ఈ అబ్బాయితో కలసి చేసిన పాట అది. నాకు భయం వేసింది.

కథకూ, కాన్సెప్ట్ కూ దూరం వెళ్లకుండా సింపుల్ గా తీయవలసిన చిత్రం ఇది. అమ్మాయి తన భర్త తనని మోసం చేశాడని తెలిసి కూడా హీరో తన వైపు రాకుండా తన భవిష్యత్తు చక్కదిద్దుకోవటం కోసం తన భర్త మంచివాడే, నా జోలికి ఎందుకు వస్తావు అని నటించి తన పాత్రను ఎలివేట్ చేసుకున్నట్లు చూపించినా కొంత బాగుండేది.

ఎవరు ఆనందించారో, ఎవరు తాండవం చేశారో ఎవరికీ తెలియదు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: