‘ మనం-మన దేశం ‘(4)-వేదాంతం శ్రీపతి శర్మ


మొన్నటి 543 లోక్ సభ సభ్యులలో 135 మంది మీద క్రిమినల్ ఛార్జీలు ఉన్నట్లు అంచనా. ప్రస్తుతం బరిలో ఉన్న అభ్యర్థులలో ఎందరు గూండాలో నాలుగో క్లాసు పిల్లవాడికి కూడా తెలుసు.

ఇది పాత పాటే! కొత్త ఏమీ లేదు. అయినప్పటికీ ఎన్నికల ముఖచిత్రం మారింది అనటానికి ఒక కొత్త విషయం మన ముందు ఉన్నది.ఎన్నికల కమిషన్ ప్రకారం ఇప్పుడు 72 కోట్ల వోటర్లు ఉన్నారు.ఇందులో 25%  25 సంవత్సరాల లోపు ఉన్న వోటర్లు. 10 కోట్ల మంది మొదటి సారి వోటు వెయ్యనున్నారు…వేస్తారా?

~~~***~~~
వాషింగ్టన్ పోస్ట్ లో ఎమిలీ వాక్స్ వ్రాసిన ఒక ఆర్టికల్ లో దేశంలోని 38 కోట్ల మంది దగ్గర ఉన్న మొబైల్ ఫోన్లలో ఈ ఎన్నికల సందేశాలను ఇస్తున్న వారు మధ్య తరగతి యువత అని పేర్కొన్నారు. ఈ వర్గం అవినీతి రాజకీయాలు, మంచినీటి సమస్యలు, పేదరికం ఇలాంటివాటి నుంచి విసిగి వేసారి నట్లు కనిపిస్తున్నది. మునుపు లేనట్లుగా యువత ఈ రణ రంగంలో పాల్గొనబోతున్నదనిపిస్తున్నది.

ముంబయి లోని తాజ్ మహల్ హోటల్ సంఘటన భారతీయ యువతకు మీద తీవ్రమైన ముద్ర వెసి యుండవచ్చని పలువురి అంచనా! రాజకీయాల గురించి, మన ఆంతరంగిక వ్యవస్థల గురించి ఈ సంఘటన చాలా మందిని ఆలొచింప చెసిందనటంలో అతిసయోక్తి లేదు…

~~~***~~~

ఇంతకు క్రితం పరుగు పందెం, గీత గురించి చర్చించి యున్నాను.

‘ జాగో ‘ అనే ఒక రాజకీయ పార్టీ ఈ మధ్య తయారయినది. ఇది ఉత్తరాదిన యువత ఏర్పరచిన పార్టీ. అయితే ఇది ఏదో ఒక ప్రాంతంలోనే కాదు, చాలా రాష్ట్రాలలో కలుపుకుని 25 మంది అభ్యర్థులను నిఉలబెడుతున్నది. ఎక్కడెక్కడైతే వీరి అవసరం ఉన్నదో అక్కడక్కడ-బీహార్, రాజస్థాన్ ఇలా అక్కడ వీళ్లని నిలబెడుతున్నారు. గెలిచినా గెలవకపోయినా వాళ్ల లక్ష్యం పోటీ చేసి మీ దుర్మార్గపు రాజకీయాలకు కళ్లెం వేయాలని మేము నిలబడ్డామని చెప్పటానికి ఈ పార్టీ తయారయింది అని ఈ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ సింఘ్ చెబుతున్నారు!

~~~***~~~

శభాష్! ఈ గీత మీదకి వచ్చినందుకు అభినందిస్తున్నాను. ప్రజాస్వామ్యం ఒక ఉద్యానవనం లాంటిది. అన్ని మొక్కలకీ చోటు ఉంది. మంచివి చిన్నవైనా ఫరవాలేదు. అక్కడ ఉన్నవి గంజాయివి అని తెలియాలంటే మంచివి కనిపించాలి…

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: