‘మనం-మన దేశం ‘(3)-వేదాంతం శ్రీపతి శర్మ


ఈ రోజు (09.04.2009) ఎకనమిక్ టైంస్ లో మంచి సమయానికి మంచి వ్యాసం చదవటం జరిగింది. ఇది అరుణ్ మైరా అనే ఆయన వ్రాశారు.’ ఎన్నికలు, రాజకీయాలు, డబ్బు, ఆలోచనలు ‘-ఇది ఈ వ్యాసం పేరు. ముఖ్యంగా మధ్య తరగతి మన ఎన్నికల పట్ల చూపుతున్న బాధను ఆయన వ్యక్తం చేశారు. చదువుకున్న వాడు ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయలేకపోవటం పట్ల పలు చోట్ల బాధ వ్యక్తమవుతున్నది. చంద్రబాబు నాయుడు గారు ఒక పారిశ్రామిక సమావేశంలో ఆయన 2004 లో ఎన్నికలు ఓడిపోవటానికి కారణం మేధావుల మాటలు ఎక్కువగా వినటం అన్నారుట!
కావచ్చు. ఎన్నికలలో నిలబడ్డ అభ్యర్థుల గురించి ఆలోచిస్తే దేశం భవిష్యత్తు కేవలం ఎన్నికలనే కొక్కానికి తగిలించి వదిలేస్తే మంచిది కాదేమో అని కొందరు అభిప్రాయపడుతున్నారు…
దాదాపు 36 దేశాలలో ప్రభుత్వాలను, ప్రజాస్వామ్యాలను పరీక్షించి

పేటర్న్స్ ఆఫ్ డెమోక్రసీ-గవర్నమెంట్ ఫారంస్ ఎండ్ పర్ఫార్మెన్స్ ఇన్ 36 కంట్రీస్ అనే పుస్తకం అరెండ్ లిజ్ పార్ట్ అనే ఆయన వ్రాసి యున్నారు. అందులో ఆయన రెండు స్ట్రాండుల గురించి చెప్పారు-మొదటిది మజోరిటేరియన్ స్ట్రాండ్:ఇది ఎన్నికలు, అసెంబ్లీలు వగైరాలతో నిర్మింపబడే రాజ్యం. రెండవది కన్సెన్సువల్ స్ట్రాండ్: అనగా అసెంబ్లీలలో, ఇతరత్ర ఒక నిరంతర సంవాదం ద్వారా ఒక ఏకాభిప్రాయంతో విషయాలను ముందుకు తీసుకొని పోవటం. ఈ రెండవ ప్రక్రియలోంచి ప్రవహించే ప్రజాస్వామ్యాలు ఎంతో మెరుగ్గా ఉంటాయనేది వారు చెబుతున్న విషయం…

మన ప్రజాస్వామ్యం మొదటి దాని మీద నడుస్తున్నది. కాకపోతే ప్రజాస్వామ్యానికి మనం కట్టుబది యున్న విషయం గర్వింప దగ్గది. మరి ఏకాభిప్రాయం, సరైన చర్చలు భవనాల లోపల, మీడియాలోనూ సరిగ్గా జరగక పోవటం విచారకరం. చదువుకున్న వారి ప్రభావం దేశం మీద ఈ ప్రక్రియలో ఎంత ఉంది? దీని మీద చర్చ చాలా చాలా చాలా…అవసరం! అన్ని చోట్లా అవసరం!.

~~~***~~~

చదువుకున్న వాడు ఈ గందరగోలం నుంచి తప్పుకోవాలా?
లేదు. మరి కాస్త ముందుకు రావాలి. మీరు గమనించండి. ఈ ఎన్నికలలో పలు చోట్ల స్వతంత్ర అభ్యర్థులు నిలబడుతున్నారు-డబ్బులు తీసుకుని ఏదో ఒక పార్టీని ముందుకు తోసేందుకు కాదు. ముఖ్యంగా మహారాష్ట్రలో చదువుకుని వివిధ వృత్తులలో ఉన్న వారు ముందుకు వచ్చారు. కారణం ఈ పోటీలో గెలిచిపోవాలని కాదు. మేము ఉన్నాము అని ‘ నిలబడి ‘ చెప్పేందుకు!

‘ మెజారిటేరియన్ ‘ పధ్ధతికీ, ‘ కన్సెన్సువల్ ‘ పధ్ధతికీ మధ్య ఒక వారధి రావాలి. కనీసం కొంత మట్టి త్రవ్వి ఒక దారి తయారు చేయాలి. అది కుళ్లు రాజకీయం-దాని జోలికి పోకూదదు అనే ఆలోచన మానుకోవాలి. అలా వదిలెస్తే ఎంత కాలం మనలను మింగుతూ వుంటుంది?

~~~***~~~

కాకపోతే ఇది సమయం, ఇప్పుడు రైటు అనేది ఉండదు. ఒక ప్రవాహం లో మనం ఉన్నప్పుడు దానిలో ఎవరు కొట్టుకు పోయారు అనేది కనపడకపోవచ్చు. ప్రవాహాన్ని ఆపలేకపోవచ్చు. కానీ అందులోనుంచి జాలువారి నేలమట్టం మీదకు వచ్చి నిలచిన నీటిని ప్రభావితం చేయవచ్చేమో!

శరీరంలో చెడు రక్తం మార్చాలంటే రక్తమంతా ఒక్క సారిగా తీయలేము. ఒక ప్రక్క నుంచి తీసేస్తూ మరో ప్రక్క నుంచి కొత్త రక్తం ఎక్కిస్తూ పోవాలి. రెండూ ఎక్కడో అక్కడ కలవాలిసిందే!

గీతల సామెతను వాడుకోవాలి.

~~~***~~~

చిన్నప్పుడు ఒక పరుగు పందెం చూసి ఆలోచించే వాడిని. అది నాలుగు వందల మీటర్ల పందెం. ఆరుగురు పరుగు తీస్తుంటే ముగ్గురు దూసుకుని పోయి ఒకటి, రెండు, మూడు స్థానాలను అప్పటికే సంపాదించేశారు. వెనుక ఎంతో సేపు అయినాక ఇద్దరు మెల్లగా వస్తున్నారు. వాళ్లు ఎందుకు హాయిగా మధ్యలో ఆగిపోయి ప్రక్కనున్న గడ్డి మీదకు ఒరిగిపోకూడదు? శ్రమెందుకు? అనుకుటున్న లోపల వారి వెనుక చివరి వ్యక్తి ఇంకా వస్తూ కనిపించాడు. అతను కూడా పూర్తి చేసుకుని కొందరు చప్పట్లు కొదుతుండగా బయటకు వచ్చాడు.అతని దగ్గరకు వెళ్లి కూర్చుని నేనౌకున్నట్లు ఎందుకు చేయలేదు అని అడిగాను.
అతను మంచి నీళ్లు త్రాగుతూ నవ్వాడు.
‘ పోటీలు అందుకే నిర్వహిస్తారు. నీలో ఒక ఉద్యమం ఉంటుంది. నీకు అది తెలియదు. ఒక్క రోజులో ఏదీ గెలవరు. కావచ్చు. నువ్వు ఏ రోజూ గెలవలేక పోవచ్చు. నీలో స్ఫూర్తి, నీలోని ఒక ఉద్యమం, ఒక శక్తి ఎప్పుడూ గెలుస్తూనే ఉంటుంది. ‘
నేను లేచి నిలబడ్డాను. అతను నా భుజం మీద చేయి వేసి నడుచు కుంటూ మైదానం వైపుకు తీసుకుని వచ్చాడు.’ ఈ గీత మీద నిలబడాలి. దటీస్ లైఫ్! ‘, అన్నాడు.

~~~***~~~

ఎన్నో విషయాలలో నాకు ఆ మాటలు ఇప్పటికీ గుర్తుకొస్తాయి. ఈ రోజు ఒక్క సారి చూసుకుంటాను. నేను ఆ గీత మీద నిలబడ్డానా? లేదు. నేను ఆ గీత మీదనే జీవిస్తున్నాను!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: