‘ మాయలాంతరు ‘-డా: వి. చంద్రశేఖర రావు గారి పుస్తక పరిచయం-వేదాంతం శ్రీపతి శర్మ


‘ మాయలాంతరు ‘ డా: వి. చంద్రశేఖర రావు గారి 21 చక్కని కథల సమాహారం.
కథలు చదువుతునప్పుడు ఒక నేపథ్యం ముందుకు వస్తుంది. ఆ నేపథ్యంలోంచి రచయిత మనలని ఎక్కడికి తీసుకుని వెళుతున్నాడో ఊహించటం కష్టం. అక్కడికి వెళ్లి తిరిగి ఆ నేపథ్యంలోకి వచ్చాక కథకుని మర్మం అర్థమవుతుంది. శీర్షిక-మాయలాంతరు-ఈ పేరుతో ఒక కథ ఇందులో ఉంటుంది. కాకపోతే ఈ శీర్షిక ఎంతో ఆలోచించి పెట్టిన శీర్షిక. ఎందు చేతనంటే కథలన్నీ ఒకరు ఒక లాంతరు పట్టుకుని పాఠకుని తిసుకుని వెళుతున్నట్లు ఉంటాయి. కొద్దిగా మాయగానే ఉంటుంది…

సామాన్యంగా ఆలోచిస్తే కథలు పలు రకాలు. ఒక కథ చదవగానే ఒక ఆలోచన మిగిలిపోతుంది. ఒకటి కొద్దిగా లోతుకు వెళ్లి ఒక భావన-ఏదో రగిలినట్లు లోపల ఉండిపోతుంది. కొన్ని కథలు ఒక అనుభవాన్ని ఇచ్చి ఆ అనుభవంలోంచి ఒక రైలు ఒక టనెల్ లోంచి తీసుకుని వెళ్లినట్లు అగుపిస్తాయి. ఒక్కో కథ కొద్దిగా పైకి ఎదుగుతుంది-ఇది చదివినప్పుడల్లా ఒక సరిక్రొత్త అనుభవాన్నికి పాఠకుడు గురి అవుతాడు.

ఈ సంకలనంలో అన్ని రకాలకు దగ్గరగా వచ్చిన ఆలోచనా విధానం కనిపిస్తుంది.

చంద్రశేఖర రావు గారు పాత్రలను ఎక్కడినుంచో కొని తీసుకుని రారు. కాగితం తెరవగానే ఇదిగో ఇక్కడే ఉంది ఈ పాత్ర అన్నట్లు అతి తక్కువ పదజాలంతో పాత్రను చూపిస్తారు. ఇది కష్ట సాధ్యం.
పాత్రల చిత్రీకరణలో రచయిత వాడుకునే శైలి సంవాద శైలి. నాలుగు లైన్లు దాటగానే మనకు సంవాదం ప్రవేశిస్తుంది. దీనిలో నేర్పరితనం ఏమిటంటే పాత్రకు మనం చాలా దగ్గరగా త్వరగా వచ్చేస్తాం. అలాగే కథలోకి సునాయాసంగా దూసుకొని పోతాం.

కథాంశం యొక్క ట్రీట్మెంట్ దగ్గరకు వస్తే రచయిత ఎంచుకునే మార్గం ఎక్కువగా ఒక జరిగిన కథను రిపోర్ట్ చేస్తున్న పధ్ధతి.

ఒక మంచి కథకి రెండు భాషలుంటాయి-ఒకటి రచయిత ఎంచుకుని మనచేత చదివించుతున భాష. రెండు-ఆ కథలో జరుగుతున్న సంఘటనల మీదుగా సాగిపోతున్న ఒక అంతర్లీనమైన భాష.
ఇది సామాన్యంగా సగటు జీవితాల లోతులలోకి వెళ్లందే అందని భాష. కారణం ఏమిటంటే సంఘటనలను ఒక మాలికలాగా సమకూర్చుకోవటం అనేది రచయితలకు అనుభవం తో కానీ రాదు!
చంద్రశేఖర రావు గారి కథలలో అన్నీ సంఘటనలే!
ఆయన సమాజాన్ని ప్రశ్నించకుండానే పలు చోట్ల ప్రశ్నిస్తూ అలా వెళ్లిపోతూ ఉంటారు.

వృత్తి వైద్య వృత్తి, రచన ఆయన ప్రవృత్తి. ఉద్యోగం రైల్వేవారిది. అంటే చంద్రశేఖర రావు గారు రచనల ద్వారా సమాజానికి శల్య చికిత్స చెస్తూ ఒక భావుకునిలా గమ్యాన్ని తాత్వికంగా ఎంచుకుని జీవన యానాన్ని అలా సాగిస్తూ ఉంటారు. గుండెకు హాతుకుపోయే కథల సంకలనాలు, నవలలు ఆయనవి చాలా ఉన్నాయి. అందులో ‘ మాయలాంతరు ‘ ఒకటి.

ఈ పుస్తకం పలు ప్రచురణా సంస్థలలోనూ, రాష్ట్రం లోని అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలోనూ లభ్యమవుతుంది. 254 పుటలు గల ఈ పుస్తకం ధర యాభై రూపాయలు మాత్రమే.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘ మాయలాంతరు ‘-డా: వి. చంద్రశేఖర రావు గారి పుస్తక పరిచయం-వేదాంతం శ్రీపతి శర్మ

  1. చంద్రశేఖర్రావు గారు చదువుకున్నది వైద్య విద్య అయినా, రైల్వేలో చేసే పని అది కాదనుకుంటా. ఏదేమైనా ఎనభైలు తొంభైలలో విలక్షణమైన గళాన్ని వినిపించి తెలుగు కథకి ఒక కొత్త రూపమిచ్చిన రచయిత. మాయలాంతరులోని కథలు ఈయన రచనాప్రక్రియకి మంచి ఉదాహరణలు. ఈయన కథ ఒకటి కథ – ఢిల్లీ వారు ఎంపిక చేసిన దశాబ్దబు గొప్ప భారతీయ కథల జాబితాలో చేరింది.
    మంచి రచయితని పరిచయం చేసినందుకు ధన్యవాదాలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: