05.04.2009 నుంచి 11.04.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


rp

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు

అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు!

ఈ వారం గ్రహస్థితి ఇలా ఉన్నది: రవి శుక్రులు మీనంలోనూ, బుధుడు మీన మేష రాశులలోనూ, కుజుడు కుంభంలోనూ, గురు రాహువులు మకరంలోనూ, శని సింహంలోనూ, కేతువు కర్కాటకం లొనూ, చంద్రుడు కర్కాటక, సింహ, కన్య, తుల రాశులలోనూ సంచరిస్తారు.
ఈ వారం చిత్రమైన యోగాలతో ప్రారంభమవుతున్నది. రాజకీయ రంగంలో గుణగణాల పరీక్షలు ముందుకు రానున్నాయి. పెద్దల మాటలకు గౌరవం లభించనున్నది. స్త్రీ పురుష విభేదాలు తలెత్తనున్నాయి.మందుల విషయంలో సమస్యలుండవచ్చును. నమ్మిన బంటులను విస్మరిస్తే దీర్ఘకాలీన పరిణామాలు ఉండవచ్చు. వ్యాపారాలు ఒక మాదిరిగా మెరుగుపడతాయి. నిరుద్యోగులకు ఇది మంచి వారం.
 

మేష రాశి: డబ్బు చేతికి అందుతుంది. కొంత కాలం దాచండి. పాత సమస్యలు పరిష్కారమవుతాయి. వృధా ఖర్చులు, వృధాగా ఆలోచించటం రెండూ మంచివి కావు. తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. నిగ్రహం ఆచరించాలి. విష్ణు సహస్రనామం చదవండి.

వృషభ రాశి: శత్రువులపై విజయం సాధిస్తారు. వారాంతంలో కొత్త పనులు చేపడతారు. స్త్రీలు మరియు చక్కెర జబ్బులున్నవారు జాగ్రత్త వహించాలి.దుర్గా సప్తశ్లోకీ చదవండి.

మిథున రాశి: కొన్ని లెక్కలు మరల చూసుకోవలసిన అవసరం ఉన్నది.మిత్రుల వలన మంచి సహాయం పొందుతారు.వృత్తిలొ రాణిస్తారు. కంటిలోని నలుసులాగా మిమ్మలను బాధిస్తున్న విషయం మాయమవుతుంది. లక్ష్మీ అష్టోత్తరం చదువుకోండి.

కర్కాటక రాశి: సత్కర్మలను ఆచరిస్తారు. మీ మొండి వైఖరి కొందరను ఇబ్బంది పెడుతుంది. చాలా కాలంగా మీరు ఒకే పంథాలో ఆలోచిస్తూ సాగిపోతున్నారు. దాని పరిణామాలను ఈ వారం చూడబోతున్నారు. కుటుంబంలో కలహం ఉండవచ్చును. జాగ్రత్త వహించండి. శివునికి అభిషేకం చేయించండి.

సింహ రాశి: భూమి, స్థిరాస్తుల విషయంలో కొత్త విషయాలు ఇవతలకి వస్తాయి. చర్మం విషయంలో జాగ్రత్త వహించాలి.ఎవరినో ఒక మాడల్ గా ఎంచుకుని వెళ్లటం మంచిది కాదు. అందరినీ దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకోవాలి. భార్యా భర్తల మధ్య రుగ్మతలు తప్పవు. సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించండి.

కన్య రాశి:బంధువులు మీ నుంచి చాలా ఆశిస్తున్నారు. మీరు విస్మరిస్తున్నారు. వారు మిమ్మలను తిన్నగా అడిగేందుకు మీ దగ్గరకే రానున్నారు! ఆదాయం పెంచుకునేందుకు మంచి అవకాశాలు కూడా ద్గ్గరకు రానున్నాయి. గతంలో మీరు చేసిన శ్రమకు మంచి ఫలితాలు ఉన్నాయి. సంఘంలో గౌరవం పెరుగుతుంది. చండీ ధ్వజ స్తోత్రం చదవండి. రాజయోగం ఫలిస్తుంది.

తుల రాశి:కొన్ని అనవసరమైన ఖర్చులు చేస్తారు. అయినా ఆదాయం బాగానే ఉంటుంది. కొన్ని విషయాలు చాలా కాలంగా ఆలోచనల దగ్గరే ఉండి పోయాయి. ఆచరణలోనికి తేక పోతే ఉపయోగం లేదు. త్వర పడవలసిన అవసరం ఉన్నది. జీర్ణకోశ వ్యాధుల విషయంలో జాగ్రత్త వహించాలి. విష్ణు సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి:మీ ఆలొచనలు క్రాస్ రోడ్డులలో ఉన్నాయి. మీ ఆలోచనలు ఒక వైపు, పరిణామాలు మరొక వైపు ఉన్నాయి.ప్రస్తుతం రెండూ కలవనట్లు ఉంటాయి. కాలక్రమంలో అవే కలుస్తాయి. విచారించకండి. నిరుద్యోగులకు మంచి అవకాశాలున్నాయి. శ్రీసూక్తం చదవండి.

ధను రాశి: ఉద్యోగంలో మార్పులు ఉన్నాయి.స్త్రీలతో జాగ్రత్తగా మసలుకోవాలి.ప్రయణాలు లాభిస్తాయి. సూక్ష్మంగా పరిశీలించే మీ గుణం అందరినీ ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంది. కల్తీ సరుకు కొనే అవకాశం ఉంది. జాగ్రత్త వహించండి. ఆదిత్య హృదయం చదవండి.

మకర రాశి: చర్మానికి గల మచ్చలు మాసిపోగలవు. మీ సహచరులు మీ గుణాలను, ప్రతిభను గుర్తిస్తారు. పై అధికారులు మరి కొన్ని బాధ్యతలు అప్పగిస్తారు. జీవిత భాగస్వామికి మార్పు అవసరం. ఆలోచించండి. వారాంతంలో మంచి వార్త వింటారు. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

కుంభ రాశి: పెట్టుబడులు నిదానంగా లాభించే వారం. తీర్థ యాత్రలు జరపాలని కోరుకుంటారు. బాధ్యతలని విస్మరించటం మంచిది కాదు. మాటలు తగ్గించుకోవాలి. వైదిక సంప్రదాయాన్ని ఆచరించండి. ఈ వారం ఒక లావా దేవీలకు సంబంధించిన విషయం ముందుకు రావచ్చు. వచ్చే వారం చూద్దాం! దుర్గా సప్తశ్లోకీ చదవండి.

మీన రాశి:గర్భవతులైన స్త్రీలు జాగ్రత్త వహించాలి. ఊహించని పరిణామాలు ఉండవచ్చును.పరీక్షలు చేయించుకోండి.ఉద్యోగస్తులకు మంచి వారం. ఇంటిలోని పెద్దవారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. అధికంగా వ్యయ విలాసాలకు పోకండి. నాగ పూజ జరపండి.

ఈ వారం మంచి మాట:
శ్లో: యశ్చ రామం న పశ్యేత్తు యం రామో న పశ్యతి
      నిందిత: సర్వలోకేషు స్వాత్మాప్యేనం విగర్హతే

(వాల్మీకి రామాయణం అయోధ్య కాండ,17.14)

ఎవరైతే శ్రీరాముని చూడరో, ఎవరినైతే శ్రీరాముడు చూడలేదో వారు అన్ని లోకములలో నిందితులని అనిపించుకునే వారు. వారి అంతరాత్మ కూడా వారిని ధిక్కరించేది!

మంగళం కోశలేంద్రాయ మహనీయ గుణాత్మనే
చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం

సమస్త సన్మంగళాని భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “05.04.2009 నుంచి 11.04.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: