‘మనం, మన దేశం’ (2)-వేదాంతం శ్రీపతి శర్మ


వేదా: శాస్త్రాణి విఙ్ఞానమేతత్ సర్వం జనార్దనాత్…

అన్ని రంగాలలో మన మేధా సంపత్తి అసామాన్యమైనది. అతి ప్రాచీనమైనది.ఆటవికంగా ఇతర దేశాలు బ్రతుకుతున్న కాలంలోనే ఒక సమగ్రమైన సంస్కృతిని, ఒక జీవన విధానాన్ని మన ద్రష్టలు అందరికీ చూపించి యున్నారు.

ఎంత కాలం గడచినా ఈ రోజు కూడా యావత్ ప్రపంచం మన మేధా సంపత్తికే తల వంచి నమస్కారం చేస్తున్నది. ఒబామా గారు కూడా డా: మన్ మోహన్ సింఘ్ గారి మేధస్సును జి-20 సమ్మిట్ లో కొనియాడారు!

ఈ మేధస్సు ఒక శక్తివంతమైన రాజ్యంలోకి పరిణమించాలని చాలా కాలంగా మనం కోరుకుంటున్నాము. కారణాలను తరువాత విశ్లేషిద్దాం. ప్రస్తుతం శ్రీరామనవమి సందర్భంగా ఒక విషయాన్ని ప్రస్తావిస్తున్నాను-

మానవ చరిత్రలో తొలి పుస్తకం వాల్మీకి రామాయణం. అయోధ్యకాండ లోని నూరవ సర్గను ‘కచ్చిత్ సర్గ ‘ అని పిలుస్తారు. కారణం ఏమిటంటే శ్రీరాముడు భరతుని కొన్ని ప్రశ్నలు అడుగుతాడు. ఆ ప్రశ్నల చాటున రాజనీతి, రాజధర్మం యావత్తూ మనకి కనిపిస్తుంది.కొన్ని ఇక్కడ ఉదహరించాలనిపిస్తున్నది…

1. వినయసంపన్నులు,బహుశృతులు,ఎవరిలోనూ దోషములెంచని వారు,శాస్త్రోక్త ధర్మములందు నిరంతరం దృష్టి ఉంచే వారు,ఆ పురోహితులను పరిపూర్ణంగా సత్కరించినావా?
2. దేవతలను, పితరులను, భృత్యులను, గురుజనులను, పితృ సమానులైన పెద్దలను, వైద్యులను, బ్రాహ్మణులను సన్మ్మానిస్తున్నవా?
3. రాజనీతిలో పండితులైన సుధన్వుని ఆదరిస్తున్నావా?
4. నీకు సమానులైన శూరవీరులను, శాస్త్రఙ్ఞులను,సుయోగ్యులను మంత్రులుగా చేసినావా?
5. రాజుల విజయానికి మూల కారణం చక్కని సలహాలను పాటించుట!ఇది ఆ సలహాలిచ్చు వారు రహస్యంగా ఉంచినప్పుడే సంభవం!
6. నీవు సమయం కానప్పుడు నిద్రించుటలేదు కదా? సరైన సమయానికి నిద్ర లేస్తున్నావు కదా? రాత్రి ముందు అర్థసిధ్ధి ఉపాయముల గురించి ఆలోచిస్తున్నావా?
7. చిన్న సాధనంతో ఎక్కువ ఫలితాన్ని పొందే పనులలో ఆలస్యం చేయటం లేదు కదా?
8. నీ పనులు పూర్తి అయిన తరువాతనే ఇతర రాజులకు తెలుస్తున్నాయి కదా?
9. వేయి మూర్ఖులకు బదులు ఒక్క తెలివి గలవాడిని ఎంచుకున్నావా? ఎందుచేతనంటే అర్థసంకటంలో ఆ ఒక్కరి వలననే ఉపయోగం!
10. ఎవరి కౌశల్యం ప్రకారం వారిని నియమించావా లేదా?
11. 11. లంచం తిసుకోని వారిని, బహు కాలంగా నీతిమంతులైన వారిని, బాహ్యాంతరములలో నీతిమంతులని, పవిత్రులని, అటువంటి మంత్రులనే నియమించావు కదా?
12. నీ ప్రజలు కఠోర దండన వలన నీ మంత్రులను తిరస్కరించటం లేఉ కదా?
13. కామలోలులైన పురుషుడిని స్త్రీలు తిరస్కరించినట్లు ఎక్కువ పన్ను వసూలు చేసే రాజును ప్రజలు తిరస్కరిస్తారు!
14. రాజ్యాన్ని పొందాలని పన్నాగాలను పన్నేవారిని రాజు సంహరించకపోతే వారి ద్వారా రాజు సంహరింపబడతాడు.
15.ఎల్లప్పుడు సంతుష్టుడుగా ఉండే వారిని సేనాపతిగా నియమించావా?
16. నీ సైనికుల శౌర్య పరాక్రమాలను తగు రీతిలో సన్మానిస్తున్నావా?
17. వారి జీతాలు సకాలానికి ఇస్తున్నావా?
18. నీ మంత్రులు నీకోసం ప్రాణాలు ఇచ్చేవారిగా ఉన్నారా?
19. నీ రాజదూతలు నీ దేశం వారేనా?
20. శత్రు పక్షంలోని 18, నీ దేశంలోని 15 చోట్ల చెరో ముగ్గురు గుప్తచరులను నియమించావా?
21.   21.రాజ్యం నుంచి పంపేసిన శత్రువులు తిరిగి వచ్చినప్పుడు వారిని దుర్బలులు అనుకోకూడదు.
22. నాస్తికులతో నువ్వు సంచరించుటలేదు కదా? వారు బుధ్ధిని పరమార్థం వైపు నుంచి తప్పించుటలో కుశలులు!అఙ్ఞానులైనప్పటికీ ఙ్ఞానుల లాగా వారు ప్రవర్తిస్తారు!
23. కృషి, గోరక్ష చేత కాలం గడుపు వారు నీ ప్రీతిపాత్రులేనా? ఈ రెండిటి వలననే ఈ లోకం సుఖంగా ఉంటుంది!
24. నీ స్త్రీలు నీచేత సుఖింపబడుతున్నారా? వారికి నీ రహస్యాలు గానీ చెప్పటం లేదు కదా?
25. పరతి దినం పూర్వాహ్నం నగరవాసులను కలుస్తున్నావా?
26. నీ దగ్గర పని చేయువారు నీకు దూరంగా పారిపోవటంలెదు కదా?
27. నీ ధనాగారంలొని ధనం అపాత్రులకు వెళ్లిపోవటం లేదు కదా?
28. శ్రేష్ఠులు, నిర్దోషులు పొరపాటుగా న్యాయశాస్త్ర కోవిదుల విచారణ కాకుండా శిక్షితులవుతున్నారా? లెదు కదా?
29. నీ రాజ్యంలో లంచం తీసుకుని నిజమైన దొషులను వదలిపెట్టటం లేదు కదా?
30. నిరపరాధులను అనవసరంగా శిక్షించినపుడు వారి కన్నీరు వలన రాజపుత్రులు, పశువులు నశిస్తారు!
   31. ధర్మము చేత ర్థానికి, అర్థం చేత ధర్మానికి హాని చేయటం లెదు కదా?
32. ధర్మార్థ కామములను సరిగ్గా సేవిస్తున్నావా?
33. అన్ని వర్గాల ప్రజలు నువ్వు బాగుండాలనుకుంటున్నారా?
34. స్వాదిష్టమైన ఆహారాన్ని నువ్వొక్కడవే తినటం లెదు కదా? అలా చేసిన వారు తిన్నగా నరకానికి పోతారు!

ఇవి కాకుండా శ్రీరాముడు ఒక రాజు 14 దోషాలకు దూరంగా ఉండాలని చెబుతాడు.

(ఇవి ఏమిటి అనేది తరువాయి భాగంలో త్వరలోనే!)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: