‘ఇతి వార్తా:’-వేదాంతం శ్రీపతి శర్మ


ఈ రోజు వార్తలలో నన్ను తగులుకున్నవి కొన్ని:

చాలా పెపర్లలో అడ్వాని గారు రానున్న జి-20 సమ్మిట్ లో ప్రధాని మన్ మోహన్ గారిని స్విస్ బాంకు లో ఉన్న భారతీయ ఖాతాదారుల గురించి తెలుసుకునే దిశగా కొన్ని అడుగులు వేయమని కోరటం గురించి వ్రాశారు. అలాగే బి.జే.పీ అధికారం లోకి వస్తే త్వరలోనే ఒక కమిటీ ఏర్పరచి ఈ మొత్తాన్ని మన దేశానికి తీసుకుని వస్తామని చెప్పినట్లు తెలుస్తున్నది.

కొద్ది రోజుల క్రితం ఈ బ్లాగులో నేను స్విస్ బాంకులోని వివిధ దేశాల మొత్తాల గురించి వ్రాసి యున్నాను…

బాగుంది. ఎన్నికల సమయంలో ఈ విషయాన్ని వెలుగులోకి అడ్వాని గారు తిసుకుని రావటం మంచిదే. ఇవి నిజమైన అంశాలు. కాకపోతే బి.జె.పీ అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి ప్రయత్నాలేమీ చేసినట్లు నాకైతే గుర్తు లేదు. మరి ఆ పైన ఈశ్వరేఛ్చ!

~~~***~~~

ఎకనమిక్ టైంస్ లో రూరల్ కన్స్యూమర్ బేస్ గురించి రాజేశ్ శుక్లా గారి వ్యాసం బాగుంది.ఆయన చైనాలోని గ్రామీణ వ్యవస్థలో 200 మిలియన్ ఇండ్లకు ప్రభుత్వం వారు ఇస్తున్న సబ్సిడైస్డ్ వస్తువులు-కారులు కూడా-యువత కన్సంప్షన్ లెవెల్స్ గురించి చర్చిస్తూ భారతీయ వ్యవసాయ రంగం, గ్రామీణ ప్రాంతాలలో ఉన్న యువత కన్స్యూమరిసం మీద దృష్టి సారించారు. ఇది ఈ సమయంలో ఆలోచించవలసిన విషయమే!
ప్రతి సంవత్సరం 14 మిలియన్లు లేబర్ మార్కెట్ కు చేర్చబడుతున్నారు. వ్యవస్థీకరించబడిన ఉత్పత్తిలో గ్రామీణ వర్గం శాతం 36% ఉండగా చదువుకున్న యువతలోని కేవలం 10% వొకేషనల్ విద్యలలో బోధన పొంది యుండటం చాలా నిరాశాజనకం. ముఖ్యంగా ఆర్థిక మాంద్యం నేపథ్యంలో గ్రామాలలో సర్వీసెస్ యొక్క స్వరూపం మారుతున్నదని మనం గమనించాలి. దిని వైసాల్యం పెరుగుతున్నదని నేను గతంలో చెప్పి యున్నాను. ఈ దిశగా ఎంత త్వరలో కృషి జరుగుతే అంత మంచిది. కృషియే పెట్టుబడి అన్నది మరచిపోకూడదు!

ఇదే వార్తా పత్రికలో మరో చోట సర్వీసెస్ గురించి వ్రాస్తూ ఇది ఇతర రంగాలకు స్వతంత్రంగా వ్యవహరిస్తున్నదా, ఇది నిజమా లేక కొద్ది రోజులు గడచిన తరువాత కొత్త రంగులు చూపగలదా అనే ప్రశ్న వేశారు. ఇది నిజానికి చిక్కు ప్రశ్న అయినా చక్కని ప్రశ్న. దీని మీద ఎందరో-ముఖ్యంగా రవాణా వారు, బాంకింగు వారూ, ఓ మాదిరిగా ఐ.టి వారు కూడా సుదీర్ఘంగా చర్చించ వలసిన అవసరం ఉన్నది…

~~~***~~~
 

ద హిందు గోరఖ్ పుర్ నియోజకవర్గం గురించి చక్కని వివరం ఇచ్చింది. గోరఖ్నాథ్ దేవాలయం అధిపతి చాలా సార్లు జైలుకు వెళ్లారు. ఆయనను అక్కడ దైవంగా కొలుస్తారు.మరి ఆయన బి.జె.పీ అభ్యర్థిగా నిలబడుతున్నారు. ఈయన మహమ్మదీయులకు భయాందోళనలు సృష్టించిన మహనీయుడు!
మతం పేరు మీద ఎంత కాలం మన రాజకీయాలు సాగుతాయి?  అతి పెద్ద ప్రజాస్వామ్యమైన మన దేశంలో నాయకులు మనుషుల గుండెల్లో దడలు పుట్టించి కుర్చీలలో శాశ్వతంగా పడుకుని బ్రతికేయాలనుకోవటం బాధనే కలిగించింది!

అన్ని మతాలలోనూ అరాచకాలుంటాయి. చారిత్రాత్మకమైన ఒక కళాఖండాన్ని ఒక కల్చరల్ స్పెక్ట్రం లోంచి చూడగలిగే తరం ముందుకు రావాలి. అదే భవిష్యత్తుకు పునాది.

దానికి దోహదపడే విద్యా విధానం, స్వతంత్రంగా ఆలోచించే నేపథ్యం ఇవ్వగలుగు  ఆర్థిక పరిస్థితి, మన చరిత్ర మీద సామూహికమైన అభిమానం ఒక్క రోజులో రావటం కష్టం. కానీ నాకు యువతరం మీద నమ్మకం ఉంది. అది దగ్గరలోనే ఉంది. కాకపోతే సంస్కృతికీ మతానికీ తెగని ముడి వేసుకుంటే అది ఇంకా దూరం పోతుంది…

~~~***~~~

చివరగా స్థానిక పేపర్లలో వచ్చిన వార్త-నల్లగొండ జిల్లలో ఒక స్త్రీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నది. ఈమె ఫ్లోరోసిస్ వ్యాధితో బాధ పడుతున్నట్లు చెబుతున్నారు. గెలవాలని పోటీ చేయటం లేదు, సురక్షితమైన త్రాగు నీరు లేకపోవటాన్ని వెలుగులోకి తెస్తున్నామంటున్నారు.
వీరి చేతిలో కరన్సీ నోట్లు ఉన్నాయి. వాటి మీద గాంధీ గారి బొమ్మతో పాటు ‘కరప్షన్ ‘ అని వ్రాసి ఉంది. వాటి విలువ సున్నా అని ఆ నోట్ల మీద కనిపిస్తోంది.

స్వాతంత్ర్యం వచ్చి ఇన్ని ఏండ్లు గడచినా మామూలు మనిషికి సురక్షితమైన త్రాగు నీటిని ఇవ్వలెకపోయాం మనం. సిగ్గనేది అంతర్వాహినిలా కూడా మన దగ్గర లేదు!

ఇది నిజమైన ఎన్నికల అంశం…నిజమైన పోటీలు ఇక్కడ జరగాలి!

ఈ వార్తాలాపం లో ప్రారంభంలో ఇచ్చిన అంశం-స్విస్ బాంకు వగైరాలు-ఈ చివరి వార్త ముందు తల వంచాలి. మన ప్రజాస్వామ్యం తల పైకే ఉంటుంది!

వేర్ ద మైండ్ ఈస్ వితవుట్ ఫియర్…

~~~***~~~

ఇతి వార్తా:!

~~~***~~~

 

 

 

~~~***~~~

నాశిక్ లో కాలారాం మందిరం లోని ప్రధాన అర్చకుడు బి.ఎస్.పీ అభ్యర్థిగా నిలబడుతున్నాడు. ఆ పార్టీ ఆ వర్గానికి నాలుగు సీట్లను కేటాయించి పోటీ చేస్తున్నది. కాకపోతే ఇక్కడ క్రితం సారి 2% కంటే వోట్లు ఆ పర్టీకి రాలేదు! (ఇది టైంస్ ఆఫ్ ఇండియా వార్త)

ఆ అర్చక స్వాముల వారు వారి తాతలు పూర్వం దళితులను ఆ గుడిలోనికి రానీయకపోవటం వలన ఈ రోజుకీ ఎంతో బాధ పడుతున్నందు వలన ఈ పార్టీ టికట్ మీద పోటీ చేస్తున్నట్లు చెబుతున్నారు!

అస్తు! చైనాలో ఒక స్వాసకీ మరొక శ్వాసకీ మధ్య చాలా మంది పుడుతున్నారు అన్నాడుత ఒకడు. ప్రక్కనే ఉన్న వాడు చాలా తొందరగా గాలి పీల్చటం, వదలటం చేస్తున్నాడట! ఇదేమిటి అంటే నేను ఎందరో చైనా వారిని పుట్టిస్తున్నాను అన్నాడట!

సామాజిక న్యాయం ఇదేనా? ఏమో!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: