29.03.2009 నుంచి 04.04.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
     సమస్తకళ్యాణగుణాభిరామ:
     సీతాముఖాంభోరుహచంచరీక:
     నిరంతరం మంగళమాతనోతు

ఈ వారం గురు రాహువులు మకరంలోనూ, కుజుడు కుంభంలొనూ ,రవి బుధ శుక్రులు మీనంలోనూ, శని సింహంలోనూ, కేత్వు కర్కాటకంలోనూ, చంద్రుడు మేష, వృషభ, మిథున కర్కాటక రాశులలోనూ సంచరిస్తారు.

ప్రజలలో ద్వంద్వ వైఖరులు, వృత్తులలోనూ, ప్రవృత్తులలోనూ నిలకడ లేని పోకడలు, బంధువర్గంతో వైరాలు కనిపిస్తున్నాయి. మేధావీ వర్గానికి ఇది మంచి వారం. కొందరు పెద్దలు జైలు పాలు కాగలరు. విద్యార్థులు ధైర్యంగా ముందుకు సాగిపోవాలి.

మేష రాశి: ఆలోచనలు ఆవేశాన్ని పెంచుతాయి. నిజానిజాలకు దూరమవుతారు. తొందరపాటు తగదు. మానసిక శ్రమ నుంచి మార్పు తెచ్చుకుని మసలుకోవాలి. శ్రీసూక్తం చదవండి.వారాంతంలో ప్రయాణం ఉండవచ్చును.

వృషభ రాశి: అన్ని విషయాలలో మంచి వారం. డబ్బు సకాలంలో చేతికి అందుతుంది. మిత్రులలో కావలసిన వారెవరు అనేది ఒక సారి ఆలోచించాలి. ఈ వారం హోటల్ లో తినటం మంచిది కాదు. విష్ణు సహస్రనామం చదవండి.

మిథున రాశి: ఆదాయం వ్యయం సమంగా ఉంటాయి.పదోన్నతి కలదు. రాజకీయాలలో ఉన్న వారికి మంచి వారం. కొందరు వ్యక్తులు కలసి రావచ్చు. జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. లలితా సహస్రనామం పారాయణ చేయండి.

కర్కాటక రాశి: సత్కర్మల ఆచరణ వలన మంచి ఫలితాలు పొందుతారు. కల్పనా శక్తి, ఉపాసన ద్వారా కార్యాలను నెరవేర్చుకుంటారు. దైవ చింతన పెరుగుతుంది. సంఘానికి దూరంగా వెళ్లాలనుకుంటారు. కుటుంబ సభ్యులను విస్మరించకండి. మంచి సంగీతం వినండి.

సింహ రాశి: మంచి రోజులు ముందున్నాయి. ఈ వారం గడవనిచ్చి నిర్ణయాలు తీసుకోండి. స్త్రీలు ఆరోగ్యం కాపాడుకోవాలి. బంధువుల కలయిక ఉండవ్చ్చును. చిన్న చిన్న పనులకు సమయం ఎక్కువ కేటాయించి పెద్దవాటి పైన శ్రధ్ధ చూపరు. ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: గతంలో చేసిన మంచి పనులకు మంచి ఫలితాలు పొందగలరు. సంఘంలో గౌరవం పెరుగుతుంది. కొత్త పనులు చేతికి అందుతాయి కానీ ఓపిక, తీరిక లేవనిపిస్తాయి. సంకల్పం ఉంటే అవే దొరుకుతాయి. ముందుకు వెళ్లండి. కులదైవానికి సంబంధించిన ఉపాసన చేపట్టండి.

తుల రాశి: వారం మధ్యలో మంచి జరుగుతుంది. స్త్రీల పట్ల జాగ్రత్తగా వ్యవహరించండి. పై అధికారి మారనున్నాడు. ఇంటిలో మరమ్మత్తులు చేపడతారు. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఆధ్యాత్మిక పరమైన విషయాలలో ఆసక్తి కలుగుతుంది. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

వృశ్చిక రాశి:వివాహ ప్రయత్నాలు లాభిస్తాయి. వివాహ సంబంధాలు దగ్గరగా ఉన్న మిత్రవర్గంలోనే ఉన్నాయని తెలుసుకుంటారు.ఉబ్బసం ఉన్న వారు జాగ్రత్త వహించాలి. వారాంతంలో మంచి ఆదాయం కనిపిస్తున్నది. శివునికి అభిషేకం చేయించండి

ధను రాశి:సంతానం అభివృధ్ధిలోకి వస్తుంది. ఆలోచనలు కలసి వస్తాయి. రాజకీయాలలో ఉన్న వారు ఆలోచించి అడుగు ముందుకు వేయాలి. స్వంత మనుషులలో విభేదాలు ఉన్నాయి. వారాంతంలో కొద్దిగా శ్రమ ఉన్నది. హనుమాన్ చాలీసా చదవండి.

మకర రాశి: మొక్కులు తీర్చుకోవాలనిపిస్తుంది. కానీ ఆలోచిస్తూ ఉంటారు. దైవం విషయంలో శుభస్య శీఘ్రం అనుకోండి. అదే జరిగిపోతుంది. ఆరోగ్యం మెరుగవుతుంది.

పాత కలహాలు తొలగిపోతాయి. విద్యార్థులకు అదృష్టం బాగుంటుంది. సుబ్రహ్మణ్య కవచం చదువుకోండి.

 కుంభ రాశి: స్త్రీలకు మంచి లాభాలున్నాయి. విదేశాల నుంచి మంచి సమాచారం అందుతుంది. ఇంటిలోని సోదరుల గురించి మంచి వార్తలు వింటారు. ఈ గురువారం ఏ పని ప్రారంభించినా బాగుంటుంది. శ్రీసూక్తం చదవండి.

మీన రాశి: ఈ వారం మీ వ్యక్తిత్వం, మీ స్వాతంత్ర్యం, సృజనాత్మకత వెలుగులోకి వస్తాయి. కార్యాలయంలో మీరు ఇచ్చిన జాబితాకు పై స్థాయిలో చక్కని స్పందన లభిస్తుంది. మీరు ముందుకు రావటం లేదు కానీ మీలో చాలా దాగి ఉంది. అది ఆగిపోకుండా శ్రమించండి. కళ్ల విషయంలో జాగ్రత్త వహించండి. మహాసౌరం వినండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: న హీదృశం సంవననం త్రిషు లోకేషు విద్యతే
దయా మైత్రీచ భూతేషు దానం చ మధురాచ వాక్
(మహాభారతం-ఆదిపర్వం)
అన్ని ప్రాణుల పట్ల దయ, మైత్రి, దానం, అందరి పట్ల మధురమైన మాటను ఉపయోగించుట – ముల్లోకాలలో వీటికి సమానమైన వశీకరణ లేదు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “29.03.2009 నుంచి 04.04.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

    1. ఋగ్వేదం లోనిది మహాసౌరం. ఇది సూర్య నమస్కార పధ్ధతిలో ఉంటుంది. సూర్యనమస్కారాలు ఒక విధానంలో ఆచరిస్తారు. ఆచరించునపుడు ఈ మహాసౌర మంత్ర పాఠాన్ని స్వరంతో ఉచ్చరించాలి. సూర్యనమస్కారాలతో కాకుండా ఉదయం మామూలుగా స్వరంతో చదువ వచ్చును (గురువు ఉపదేశం పొంది అభ్యసించాలి). కుదరని వారు టి.టి.డి వారి ఋగ్వేదం ఆడియో కాసెట్ ద్వారా వినవచ్చును. విను వారు శుచిగా ఉండాలి (స్త్రీ పురుషులిరువురూ కూడా).

      శ్రీపతి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: