మనం, మన దేశం (1)-వేదాంతం శ్రీపతి శర్మ


 

 కాలేజీలో ఉన్నప్పుడు ఒక రోజు బస్సు దిగి ఇంటికి నడక ప్రారంభించాను.ఒక కిలోమీటర్ నడవాల్సి ఉంటుంది.ఆ రోకులలో భుజాన ఒక సంచీ తగిలించుకుని ఆలోచించుకుంటూ ఎంత దూరనైనా నడిచేయటం అడియేనుకు అలవాటు. ఎందుకో ఒక్క సారిగా అరుపులు, కేకలు వినిపించాయి. జనం పరుగులు తీస్తున్నారు. పోలీసులు అందరినీ ఇళ్లకి వెళ్లిపొమ్మని చెబుతున్నారు. త్వరగా కదలకపోతే లాఠీలతో కొడతామన్నారు. పరుగెడుతున్న ఒకరిని అడిగాను, ‘ఏమైనదీ ‘ అని. అతను ఊళ్లో కర్ఫ్యూ పెట్టారు, ఇక్కడ పెట్టలేదు కానీ ఎందుకైనా మంచిదని వెళ్లిపొమ్మంటున్నారు అన్నాడు. దానికి కొట్టటం ఎందుకు? అప్పటికే ఒకరిద్దరిని ఇళ్లకు కూరగాయలు తీసుకుని వెళుతున్న వారిని లాఠీలతో చిన్నగా కాళ్ల మీద కొట్టటం కూడా నాకు కనిపించింది. పరుగులు పెట్టి నేను కూడా తొందరగా వెళ్లిపోవాలనుకున్నాను. కానీ నేను నడవ వలసినది చాలా ఉంది. దారిలో కొన్ని సందులు కూడా ఉన్నాయి. మా కాలనీ కొద్దిగా దూరం. అలానే పేవ్ మెంట్ మీద ఆగిపోయి నిలబడ్డాను!

కాన్స్టెబల్ ఒకడు దగ్గరగా వచ్చాడు.
‘ పోవా?’
‘ ఆ లాఠీ ఎందుకు? పోక? ఏమి చేస్తాను?’
‘ అరె? పిచ్చోడి లెక్కున్నావు?’
‘ ఇక్కడ కర్ఫ్యూ లేదు. ఎందుకు గొడవ చేస్తావు? మామూలుగా చెప్పలేవా? ఎందుకు కొడుతున్నావు జనాలని?’
అతను దగ్గరగా వచ్చాడు. లాఠీ ఎత్తబోయాడు. నేను కదలలేదు. చూస్తున్నను. ఎస్. ఐ వచ్చాడు.
‘ అరె, ఉండు. ఎవరు బై, కాలేజా? ‘
‘ ఎవరైతే కొడతారు? ఎవరైతే కొట్టరు?’
‘…’
ఇద్దరూ కిందా మీదా చూశారు.
‘ చూడూ, పరిస్థితి బాగాలేదు, ఎల్లిపో. కొట్టడం కొట్టకపోవటం ఇవన్నీ వద్దు. సప్పుడు సేయకు. మా పని చేయని!’
నేను మెల్లగా మామూలుగా నడుచుకుంటూ వెళ్లిపోయాను. గొడవ అలానే ఉంది. కొద్ది దూరం వెళ్లాక ఇంకో కాన్స్టబల్ వచ్చి లాఠీ పైకి ఎత్తాడు. నా వెనుక నుంచి వీడు అరుస్తున్నాడు,’ పోనీ పోనీ, కొట్టొద్దు. పోనీ…’
అతను ఈల వేసుకుంటూ మరో వైపు వెళ్లిపోయాడు.
రోడ్డుకు అటు వైపు వెళ్లి అరిచాడు,’ పోరా బై, కొట్టటం కాదు. జల్దీ ఎల్లు. లేకపోతే పొడిచి చంపేస్తారు!’
ఆ మాట విని మరల నిలబడి పోయాను. అతను నెత్తి మీద చెయ్యి పెట్టుకుని ఖర్మ అన్నట్లు చిత్రంగా చూశాడు.
‘ నేను చావను…’, చెప్పాను,’…మామూలు మనిషిని కనీసం మామూలుఇగానైనా అందరు గౌరవించే వరకూ బ్రతికే ఉంటాను!’
అతను నవ్వుకుంటూ వెళ్లిపోయాడు. నెను నడక సాగించాను…

~~~***~~~

ఆ రాత్రి డైరీలో వ్రాసుకున్నాను. నిజాన్ని వెతకాలన్నా, న్యాయాన్ని వెతకాలన్నా రెండింటినీ కలిపే వెతకాలి.
యుధ్ధం లోకి వెళ్లినంత మాత్రాన ప్రాణాలు పోతాయనుకోవటం పొరపాటు. వెళ్లనంత మాత్రాన అవి మిగిలిపోతాయనుకోవటం పొరపాటు…
నిజాన్ని నిలబెట్టాలన్నా, న్యాయాన్ని ముందుకు తీసుకుని రావాలన్నా యుధ్ధం చేయాలి. యుధ్ధమే చేయాలి!

~~~***~~~

కొద్ది రోజుల తరువాత కాలేజీలో ఒక మిత్రుడు అడిగాడు, ‘ నీ ఆర్టికల్ హిందు లో చదివాను. నువ్వు ఏ పుస్తకాలు చదువుతావు?’
నవ్వాను.
‘ నేను చదివేవి వ్రాయబడని పుస్తకాలు. చదివే కథలు కాదు, కనిపించే కథలలో కదులుతాను…’

~~~***~~~

(తరువాయి భాగం త్వరలోనే!)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “మనం, మన దేశం (1)-వేదాంతం శ్రీపతి శర్మ

  1. >>ఆ రాత్రి డైరీలో వ్రాసుకున్నాను. నిజాన్ని వెతకాలన్నా, న్యాయాన్ని వెతకాలన్నా రెండింటినీ కలిపే వెతకాలి.
    యుధ్ధం లోకి వెళ్లినంత మాత్రాన ప్రాణాలు పోతాయనుకోవటం పొరపాటు. వెళ్లనంత మాత్రాన అవి మిగిలిపోతాయనుకోవటం పొరపాటు…
    నిజాన్ని నిలబెట్టాలన్నా, న్యాయాన్ని ముందుకు తీసుకుని రావాలన్నా యుధ్ధం చేయాలి. యుధ్ధమే చేయాలి!

    good quotation.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: