‘ఆకాశమంత ‘-తెలుగు చలనచిత్రం, వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష


మామూలుగా బైలింగువల్ చిత్రం-‘అభియుం నానుం ‘ అనే తమిళ చిత్రం తెలుగులో ‘ఆకాశమంత-ఐ లవ్ మై డాటర్ ‘. రాధామోహన్ గారి దర్శకత్వం లో వచ్చిన చిత్రం ఇది.ఆఖరుకి ఇది పంజాబీ, హిందీ, ఆంగ్లం అన్నీ కలసిన చిత్రం.
సినిమా టైం పాస్ కి కొద్ది సేపు నవ్వుకునేందుకు బాగుంది. అలాగే ప్రకాశ్ రాజ్ గారి హిస్ట్రియానిక్స్ కూడా తగ్గట్లున్నాయి.కొన్ని సన్నివేశాలు బాగానే చిత్రీకరించారు.
కథ అంటూ ఏమీ లేకపోవటమే దర్శకుడు ఎంచుకున్న ఒక ముఖ్యమైన పని! ఈ రోజు ఒరవడిలాగా నరేటివ్ పధ్ధతిని తీసుకునారు.ప్రకాశ్ రాజ్ తన కూతురు పరవళ్లు తొక్కి తన దారిన తను ఒక పంజాబీ యువకుని పెళ్లి చేసుకోవటాన్ని జగపతిబాబుకు చెబుతాడు.
అక్కడితో అయిపోయింది. లైట్ గా అన్నీ చూపిద్దమనే ఆలోచన మంచిదే కానీ చిత్రీకరణలో పాత్రల వెనుక ఉన్న చిత్రీకరణ తెర ముందుకు రావాలి-దీనిని ‘ ఎస్టాబ్లిష్ చేయటం ‘ అంటారు. ఎంత సేపూ తండ్రి పాత్ర తప్ప ఇంకేమీ చిత్రీకరణ లోకి రాలేదు. ఇదీ సమస్య. విసువల్ మీడియం కీ, రేడియో నాటకానికీ తేడా ఉండాలి కదా?
ఒక పాట సాహిత్యం బాగుంది. విద్యాసాగర్ సంగీతం మామూలుగా ఉంది.

 రెండు భాగాలు ఎంచుకుని-మొదటిది ప్రకాశ్ రాజ్ ఇంటిలోనిది, త్రిష చిన్నప్పుడిది అయితే రెండవది ఢిల్లీలో సర్దార్జీతో ప్రేమ వ్యవహారం. ఈ రెండవది కూడా మొదటి రంగంలో ఉన్న ఇతివృత్తంలోనే కలిపేయటం దర్శకుడు చేసిన పొరపాటు. సామాన్యంగా తెర మీద కనిపించిన దృశ్యాలను ఇంటరెస్ట్ ఉండేటట్లుగా ఎడిటింగ్ చేసినా అది సరిపొలేదు. సీనుకీ సీనుకీ కష్ట పడ్డారు కానీ సమగ్రమైన నరేషన్ ను పూర్తిగా విస్మరించటం జరిగింది…

సినిమాటోగ్రఫీలో క్రాస్ కటింగ్ అనే ఒక పధ్ధతి ఉంటుంది.క్రాస్ కటింగులో ప్రేక్షకుడు ఒకే సారి రెండు సమానాంతర ఇతివృత్తాలను చూసి ఒక సస్పెన్స్ లోకి వెళ్ల గలుగుతాడు. అలాగే రివర్స్ ఏంగల్ షాట్ మరో పధ్ధతి.ఇది ఎక్కువగా సంవాదం జరుగుతున్నప్పుడు వాడతారు. ఇందులో ఒక పాత్రలోపల జరుగుతున్న అంతర్మథనాన్ని చూపగలం. దీనికి ఎంతో ఆస్కారం ఉన్నప్పటికీ ఇది వాడకపోవటం కొద్దిగా నిరాశ కలిగించింది.

ఫలితంగా అంత అనుబంధం ఉన్న కూతురు తండ్రికి చెప్పకుండా తల్లికే తన ప్రేమ వ్యవహారం ఎందుకు చెప్పిందీ అన్నది ఏదో సస్పెన్స్ గా అనుకున్నా చివరికి కూడా సమాధానం రాదు. హాస్యాస్పదంగా ఉండిపోయింది.

నేషనల్ ఇంటగ్రేషన్ అనేది మంచిదే! క్రాస్ కల్చర్ జీవితాలు కూడా మంచివే! కానీ ఇలాంటి చిత్రాల వలన అయితే మంచి విషయాలు కూడా పలుచగా కనిపిస్తాయి.

దర్శకుడు ఎంతో హోం వర్క్ చేయాలి…

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “‘ఆకాశమంత ‘-తెలుగు చలనచిత్రం, వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష

  1. >> “కథ అంటూ ఏమీ లేకపోవటమే దర్శకుడు ఎంచుకున్న ఒక ముఖ్యమైన పని”

    ఇలాంటివెన్నో ఈ సమీక్షలో. సినిమా అంత గందరగోళంగానూ ఉంది మీ సమీక్ష. హడావిడిగా రాసేసినట్లున్నారు 🙂

    క్రాస్ కటింగ్ అనేది సినిమాటోగ్రఫీకి సంబంధించింది కాదు, కూర్పుకి సంబంధించింది. అలాగే రివర్స్ యాంగిల్ షాట్ కి, రియాక్షన్ షాట్ కి మధ్య తేడా ఉంది. గమనించండి.

    1. సినిమా అయితే సమీక్ష లాగా గందరగోళంగానే ఉందంటారా?

      కూర్పుకు సంబంధించిన విషయం కరెక్టే. నేనూ అదే చెబుతున్నాను. అలవాటుగా సినిమాటోగ్రఫీ అని వ్రాసి యున్నాను. కాకపోతే రియేక్షన్ షాట్ గురించి నేను ప్రస్తావించలేదు.

      శ్రీపతి

  2. నేను ఈ సినిమా తమిళ్ లో చూశాను. నాకు నచ్చింది. Father of the bride సినిమాకు భారతీయ వర్షన్ అనిపించింది. This is a needed film. మానవ సంబంధాల్లో తండ్రీకూతుళ్ళ పార్శ్వాన్ని చూపెట్టిన అతికొద్ది సినిమాలో (నువ్వే-నువ్వే) ఇదొకటి.

  3. ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ ని చూస్తుంటే స్టీవ్ మార్టినే గుర్తొచ్చాడు నాక్కూడా! కానీ ఎంతసేపూ ప్రకాష్ రాజు (తండ్రి)వైపు నుంచే కానీ అంతగా ప్రేమించి ఒక రకమైన పొసెసివ్ నెస్ తో ఉన్న తండ్రి పట్ల కూతురికి ఉండే భావాలను, ప్రేమను దర్శకుడు సరిగ్గా ఎస్టాబ్లిష్ చెయ్యలేదనిపించింది. సినిమా బాగానే ఉంది కానీ ఏదో మిస్సింగ్ అనిపించింది నాక్కూడా! .

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: