బ్లాగర్లకు ఉగాది పురస్కారం-వేదాంతం శ్రీపతి శర్మ


ఉగాది సందర్భంగా ఒక చిన్న సభ జరుగుతోంది.లోపలికి తొంగి చూశాను. ఎవరో చేయి పట్టుకుని లాగేశారు. వెళ్లి కుర్చీలో పడ్డాను.
‘ ఇదేంటి సార్?’
‘ ఎందుకు తొంగి చూశారు?’
‘ అరే! ఏమిటో తెలుసుకుందామనుకున్నాను. అదీ తప్పేనా?’
‘ తప్పు కాదు. కరెక్ట్ పని. మనిషికి జిఙ్ఞాస ఉండాలి. సాహితీ సభలకు జనం రాకపోవటం విచారకరం.కాకపోతే క్రికెట్ మాచుల లాగా ఛియర్ గర్ల్స్ ను ఏర్పాటు చేయలేకపోవటం వలన కనిపించిన వాళ్లని ఇలా లాగేసుకుంటున్నాము!’
‘ బాగుంది. కానీ కాస్త నెమదిగా లాగండి. నేనసలే ఫెదర్ వెయిట్! చేతిలోకి చేయి ఊడి రాగలదు! ఇంతకీ ఇక్కడ ఏమి జరుగుతున్నది సార్?’
‘ సింపుల్! ఈ మధ్య తెలుగులో చాలా మంది బ్లాగులను తయారు చేసి వ్రాస్తున్నారు. అసలు బ్లాగు నడపటానికి ఉండవలసిన గుణం ఏంటీ అని చర్చించుకుంటున్నాము. మీరూ పాల్గొనాలి.’
‘ అది కుదరదు….’, అంటుండగానే మైకు ముందరకు ఒక పెద్ద మనిషి వచ్చి నిలబడ్డాడు. అందులోకి గాలి ఊది పని చేస్తున్నదో లేదో పరీక్ష చేశాడు.
‘ బ్లాగాసురులందరికీ ఈ మైకాసురుని ఉగాది శుభాకాంక్షలూ!’
అందరూ చప్పట్లు కొట్టారు.
‘ కొంతమంది చిన్నప్పుడు పాకకుండానే లేచి నిలబడి నడక ప్రారంభిస్తారు. కొందరు జీవితమంతా పాకుతూనే ఉంటారు. కొందరు పాకులాడుతూనే ఉంటారు. కొందరు ఏదో పీక్కుంటూ ఉంటారు! ముందుగా పాకుదాం అనే బ్లాగు నడుపుతున్న సహజ కవి ణెలగంధం నాగరాజు గారు మన ముందు కొద్ది సేపు పాకుతారు…’
చప్పట్ల మాటున నాగరాజుగారు పాములు పట్టే వాడి నడకలో నడుచుకుంటూ వచ్చారు. నాగస్వరం వినిపించింది.
‘ గోకిచూడందే గోల్డయినా తెలియదు…’, ఆయన చెప్పాడు, ‘పాకిచూడందే పామయినా తెలియదు!’ చప్పట్లు మ్రోగాయి.
‘ నేను పాకుతూ పాకుతూ పాకాన బడ్డాను.
  నేను డవున్ టు అర్త్!
  నేను నిజం చెప్పను. నిజాన్నే అల్లుకుంటాను.
  నా నాలుక మీద విషం ఉంటే ఉండనీ!
  శివునికి లేదా గొంతు నిండా విషం?
  ఆయన మెడ చుట్టూ నన్నెందుకు ధరించాడు?
  అందరిలో విషం సహజం ఓ సహజకవీంద్రా!
  నా పుట్టలొ పాలు పోస్తారు కానీ
  నేను కనిపించగానె ఎందుకు చంపుతారు జనం?
  నేను మాట్లాడితే విషమన్నారు అందరూ!
  నేను వ్రాస్తే తప్పన్నారు రచయితలు…
  అందుకే దాక్కున్నా ఈ పుట్ట లాంటి బ్లాగులో!
  లోపలికి వస్తే రండి. రాకపోతే పొండి!
  నేను ఈ పుట్టలో చిరంజీవిని!
  నన్ను నమ్మండి. నేను కాటు వేయను!
  ఘాటుగా వ్రాస్తాను. అంతే!
  శలవు!’

ఆయన మరల అలానే నడుచుకుంటూ వెళ్లిపోయాడు. మైకాసురుడు ముందుకు వచ్చాడు.

‘ సహజకవి గారు చక్కగా పాకారు. మంచి విషయాలు చెప్పారు. ఇప్పుడు నూకాలమ్మను నేనే అనే చిత్రమైన బ్లాగు నడుపుతున్న శ్రీమతి జిళ్లేళ్ల పొలేరమ్మ గారు ఇదిగో ముందుకు వస్తున్నారు…’

చప్పట్లు మ్రోగాయి. ఎక్కువగా స్త్రీలు చప్పట్లు కొదుతున్నారు. ఆవిడ అందరి మధ్యలోంచీ చప్పట్లు కొట్టకుండా ఎవరైనా ఉన్నారా అని చూసుకుంటున్నట్లు మైకు ముందుకు వచ్చారు. ఒక కాగితం తీసి ఒక చేత్తోనే మడత విదిలించి తీసింది.

‘ ఉగాది ఎందుకు వచ్చింది?’ గట్టిగా అన్నారావిడ.అందరం చేతులు కట్టుకున్నాం.
‘ ఆ? ఎందుకొచ్చింది ఉగాది?
  నా చేత పచ్చడి నూరించేందుకా?
  నేను పెట్టిన పచ్చడిని తిట్టి నా మీద నవ్వేందుకా?
  ఈ సంవత్సరం కూడా నా వయసు పెరగలేదని చెప్పేందుకు అడ్డంగా…
  ఎందుకొచ్చింది ఈ ఉగాది?
  మరో సారి స్త్రీ ఇంటిలోనే ఉండి వంట చేయాలనా?
  పురుషుని విరోధించమనా?
  సర్వం ధరించింది స్త్రీ. వెళ్లిపోయింది సర్వధారి…
  ఏమి ఉధ్ధరించింది సర్వధారి?
  అందుకే విరోధిని తెచ్చింది స్త్రీ!
  ఇక విరోధం తప్పదు.
  ఓ అబలా, నీవు కావు బాలవు!
  నీవు కావు బేలవు.నీవు శక్తివి. లే!’
ఎవరో లేచి కూర్చున్నారు!
  ‘ బాగు బాగు అనే బ్లాగులో పురుషుల నూకలు చెల్లించే నూకాలమ్మను నేను.ధైర్యంగా నాకు లంకె వెయ్యండి.స్త్రీలందరూ రండి. నాతో చేతులు కలపండి.’
చప్పట్ల చాటున నవ్వుతూ ఆవిద వెళ్లి కూర్చున్నారు. మైకాసురుడు మరల సద్దుకున్నాడు.
‘ పోలేరమ్మ గారు విరోధం అన్నారు. అయితే రాజకీయ విమర్శకులు, నా రాజ్యం అనే

పేరుతో బ్లాగు నడుపుతున్న చక్రవర్తుల భిక్షపతి గారు ముందుకు వస్తున్నారు.’
 ఆయన అందరికీ అరచేయి చూపిస్తూ నా గీతలను మీరే చూడండి అంటూ ముందుకు వచ్చారు.
‘ మిత్రులందరికీ నా యొక్క.. ఈ ఉగాది యొక్క మరి శుభాకాంక్షలు!
ఎన్నికలు వస్తున్నాయి మరి వస్తున్నాయి.
ఏమి తెచ్చాయి ఈ ఎన్నికలు?
తెచ్చాయి మరి తెచ్చాయి ఒక రకమైన ఉగాది పచ్చడి!
ఉప్పొక పార్టీ, చేదొక పార్టీ, వగరొక పార్టీ,పులుపొక పార్టీ, ఇలా అన్ని రుచుల పార్టీలూ కలసి వచ్చాయి మరి వచ్చాయి.
ఒక్క సారి తిన్నాము గదా మరి పచ్చడి?
అందరికీ వేయాలి మరి వోటు…
ఎలా మరి ఈ బేలట్?
కరెక్ట్. పచ్చడిలాగా అందరికీ నా వోటు.
నా రాజ్యం బ్లాగులో కూడా ఉగాది యొక్క పచ్చడే! రండి నా బ్లాగులోకి. ఇది మీకు యొక్క రోజూ ఉగాదే!
ఉంటాను. అందరికీ నా యొక్క నమస్కారం మరి!’

~~~***~~~

ఇంతకీ ఒక బ్లాగు నడపటానికి ఏమి కావాలి? అని నన్ను చేయి పట్టి లాగిన వాడిని అడిగాను.
‘ మంచి ప్రశ్న సార్. మీకు శరీరంలో ఏ భాగంలో నెప్పి పుడుతూ ఉంటుంది?’
‘ ఆ అప్పుడప్పుడు కడుపులో ‘
‘ ఇంకా?’
‘ చెప్పలేను. ప్రతి రోజూ ఏదో ఒక భాగంలో ఏదో ఒక నొప్పి పుడుతూనే ఉంటుంది.’
‘ అద్దీ!. ఆ ఫారం తీసుకుని మీ ఇ-మెయిల్ అదీ నింపి బ్లాగు తయారు చేసేయండి. ఆ అర్హత చాలు!’
‘ ఇదేంటయ్యా? ఈ నొప్పులకు, బ్లాగులకు ఏమిటి సంబంధం?’
‘ దటీస్ బ్లాగీశ్వర రావు! మీకున్నది నొప్పి కాదు. పైత్యం! ద ఓన్లీ క్వాలిఫికేషన్ రిక్వైర్డ్!’
‘ ఓహో! కాగితం ఇలా ఇయ్యి. ఇంతకీ బ్లాగు పేరేమి పెట్టను? నా పేరేమిటి పెట్టాలి?’
‘ సింపుల్. బ్లాగు పేరు పైత్యం అని పెట్టండి. రైటర్ పేరు దైత్యా అని ఉంచండి ప్రస్తుతానికి…’

~~~***~~~

(ఇది సరదాగా చెప్పినది. ఎవరినీ మనసులో పెట్టుకుని వ్రాసినది కాదని నా యొక్క సవినయమైన మనవి!

అందరికీ ఉగాది శుభాకాంక్షలు మరొక్క సారి!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “బ్లాగర్లకు ఉగాది పురస్కారం-వేదాంతం శ్రీపతి శర్మ

చిలమకూరు విజయమోహన్కు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: