‘విరోధి ‘ ఏమంటోంది?-వేదాంతం శ్రీపతి శర్మ


మిత్రులందరికీ విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు!

ఉగాదికి పంచాంగ శ్రవణం ద్వారా కందాయ ఫలాలు, రాశిఫలాలు మీరు తెలుసుకునే ఉంటారు.

ఈ ఉగాది రోజున ‘విరోధి ‘ అందరికీ వివిధ రంగాలవారికీ ఏమంటోందో ఒక సారి పరీక్షించి చూద్దాం.పైగా ఎన్నికల గురించి ఎన్ని చెప్పినా ఒక సారి ఉగాది సంధర్భంగా కూడా ముచ్చటించుకోవటం బాగుంటుందనిపిస్తోంది!

శుభం! ముందుకు వెళదాం…

బ్యాంకింగు రంగం వలన సమస్యలు కనిపించినా ఆర్థికంగా పెద్ద నష్టాలు ఉంటాయని అనిపించటం లేదు. సంవత్సరం మంచి యోగాలతో ప్రారంభమవుతున్నది. వ్యాపరస్తులు పెద్దగా నిరాశ చెందవలసిన పని ఏమీ లేదు.

ప్రజలలో న్యాయపరమైన ఆలోచనలు, నీతి, న్యాయం అనే అంశాల పట్ల చింత, కొంత సమాలోచన పెరిగే సూచనలున్నాయి.
కొన్ని ప్రాంతాలలో విషజ్వరాలు సోకవచ్చును.

యువతలో ఒక తేలిక స్వభావం కనిపిస్తోంది. ఊరకే ఆకాశ సౌధాలు నిర్మించటం ఒక ఒరవడిగా చెప్పవచ్చును. కనీ మంచి ఉత్సాహం అవసరమైన చోట్ల చూపగలరు.

కళాకారులకు, రచయితలకు ఇది చక్కని సంవత్సరం. స్త్రీలు చాలా రంగాలలో రాణించగలరు. ఏదో కారణం పెట్టుకుని భర్తలను సాధించటం మంచిది కాదు! రుగ్మతలను తప్పించే ప్రయత్నం మంచిది. వాటిని కెలికి తరువాత ఏదీ ఒక కొలిక్కి రాక సమస్యనౌ తీవ్రతరం చేసుకొనే ఒరవడులు కనిపిస్తున్నాయి…జాగ్రత్త వహించాలి!

 ఈ సంవత్సరం తెలుగు వారి గౌరవం పెరగనున్నది. కొందరు పెద్దలు వారి రంగాలలో కీర్తి ప్రతిష్ఠలు పొందగలరు.

ప్రజలు స్వారితమైన ధనాన్ని పెటుబడులుగా పెట్టవచ్చు. పెద్దల ఆస్తులను ససేమిరా తాకవద్దు. తిరిగి రాదు!

ఆధ్యాత్మ చింతన అందరికీ మంచి చేయగలదు.అయిన సంబంధాల వైపు ఈ సంవత్సరం చాలా మంది మొగ్గు చూపుతారు. ప్రేమ వివాహాలూ పెరుగుతాయి. ప్రేమికులకూ మంచి సంవత్సరమే! కాకపోతే తల్లి దండ్రులను ‘విరోధిస్తే ‘ ఇంతే సంగతులు!

పట్టించుకోకపోవటం వలన పెద్దవిగా మారే రోగాలు ఎక్కువ కనిపిఒస్తున్నాయి. ఆపరేషన్లు, ఒంటరి తనం వలన మానసిక సమస్యలు, కాలు జారి పడటం ఇలాంటివి హెచ్చుగా ఉన్నాయి. ప్రజలు జాగ్రత్త వహించాలి.

కాంట్రేక్టర్లకు మంచి సంవత్సరం.

చాలా మందికి పై అధికారుల వలన ఇబ్బందులున్నాయి. వాద్పవాదాలు తగ్గించుకోవాలి.

రైతులు ఎక్కువ శ్రమించవలసిన అవసరం ఉంది. సెప్టెంబర్ మాసంలో అన్ని పంటలకూ సమస్యలున్నాయి. జులై, ఆగస్ట్ మాసాలలో నిజామాబాదు, హైదరాబాదు మీదుగా వాయువ్య ఆగ్నేయ దిశగా పయనించు రేఖ మీద భూకంపం సంభవం. ప్రజలు భూమి సూక్తం చదవటం లేదా వినటం చేయవలసి యున్నది. ఆందోళన పడనవసరం లేదు. ఈశ్వరుని కృప వలన జన నష్టం లేదు!

నిరుద్యోగులకు ఇది మంచి సంవత్సరం. మంచి ఉద్యోగాలలో చేరగలరు. ఉపాధ్యాయులకు, వైద్య, విద్యా రంగాల వారికి అభివృధ్ధి బాగుంది. సర్వీసెస్ రంగంలో కొత్త ఒరవడులు కనిపిస్తాయి.

అమ్మాయిలను మోసం చేసే వారు ఎక్కువవుతారు. జాగ్రత్త వహించాలి.

మిత్రుల వలన మోసాలు, శత్రువుల వలన లాభాలు చిత్రంగా కనిపిస్తున్నాయి!

పరిశోధనల రంగం వారు మంచి ఫలితాలను చూపగలరు. సైనికిలకు కూడా మంచి సంవత్సరం.

కోర్టుకెక్కే భార్యా భర్తల సంఖ్య పెరగనున్నది. సన్యసించాలని కొందరు అనుకుంటారు!

రాష్ట్రంలోని ఉత్తర, ఈశాన్య ప్రాంతాలలో తుఫానుల వలన, అగ్ని ప్రమాదాల వలన నష్టం ఉండవచ్చును. ఓ.ఎన్.జీ.సీ వారు వారి గేస్ బావులను పరిరక్షించుకోవాలి…

 2009 జనవరి ఒకటవ తేదీన గణించిన విషయాలకు, ఎన్నికల తేదీల నిర్ణయానికి, ఈ ఉగాది కూడా నిజమేనని చెబుతున్నది…
స్త్రీలు ఇదివరకంటే ఎక్కువ సంఖ్యలో వోట్లు వేయనున్నారు. సామాజిక న్యాయం, భూ వివాదాలు, పరదేశపోరు, నిరుద్యోగం, ఆర్థికపరమైన మోసాలు, ధరలు సగటు మనిషిని వోటు విషయంలో ప్రభావితం చేయనున్నాయి.

విచఛణ, విశ్లేషణ, నిజం, అబధ్ధం-ఇవి బహుమతంలో లేవు! ఊహాజనితమైన భావోద్రేకాలు, కొత్తదనాన్ని కాంక్షించే ఒరవడులు చాప క్రింద నీటి వలే చోటు చేసుకుంటున్నాయని చెప్పవచ్చును…

~~~***~~~

మఖ, శతభిష నక్షత్రాల వారు ఆరోగ్యం విషయంలోనూ, డబ్బు విషయం లోనూ జాగ్రత్త వహించాలి. వీరికి జీవితంలో అనుకోని మార్పులు ఉన్నాయి.చిరకాలమైన కోరికలు తీరగలవు. దైవానుగ్రహం కూడా కలదు.
ఆశ్లేష, శ్రవణం – ఈ నక్షత్రాల వారు చర్మ వ్యాధుల విషయంలోనూ, రక్తపు పోటు విషయం లోనూ శ్రధ్ధ వహించాలి. అధికంగా మాట్లాడటం మంచిది కాదు. బంధువులలో గౌరవం పెరుగుతుంది. పదోన్నతి ఉన్నది.
పుబ్బ, అశ్విని నక్షత్రాల వారు కొత్త వ్యాపారం ప్రారంభించవచ్చును. ఉపాసన ద్వారా అద్భుతమైన ఫలితాలను పొందగలరు. కొత్త ప్రాంతాలను సందర్శించగలరు.
అనురాధ, మృగశిర వారికి స్థాన చలనం ఉన్నది. ఆదాయం బాగుంది. కొత్త విద్యలను అభ్యసించవచ్చును. వివాహం కాని వారికి మంచి సమయం.
రేవతి, పుష్యమి, భరణి, ధనిష్ఠ వారికి ఆస్తులు, భూములు కలసి వచ్చే కాలం. పట్టుదలల్తో కృషి చేయవలసి ఉన్నది. మోకాళ్ల నొప్పులు బాధిస్తాయి. జాగ్రత్త వహించాలి.
రోహిణి, ఉత్తర, మూల వారు స్త్రీల విషయంలో జాగ్రత్త వహించాలి. అపవాదులు ఉంటాయి. విద్యార్థులు రాణిస్తారు.
పునర్వసు, ఉత్తరాభాద్ర, ఆర్ద్ర, జ్యేష్ఠ వారు ఇంటిని చక్కబెట్టుకుంటారు. అనుభవం సంపాదిస్తారు. పీకులాటలకు వెళ్లాలనుకుంటారు. వద్దు! ప్రయాణాలూ వద్దు. ఆకస్మిక ధనలాభం కూడా ఉన్నది.
ధనిష్ఠ, విశాఖ, హస్త, కృత్తిక వారు సరిక్రొత్త ఆలోచనలకు నాంది పలుకుతారు. ఎవరికీ అర్థం కారు! ప్రజల మధ్యలోకి వస్తారు. కొద్దిగా శ్రమ పడతారు. డబ్బు బాగానే సంపాదిస్తారు. అనుకోని వాటికి కీర్తి,అనుకున్న వాటికి ఆలస్యం పొందుతారు.ఆరోగ్యాన్ని విస్మరిస్తారు.
పుష్యమి, చిత్త, పూర్వాశాధ, స్వాతి వారు రాజకీయాలలో దూసుకుని పోతారు. వీరి పలుకులు ప్రాబల్యం పొందుతాయి.ఆర్థ్కంగా బాగుంటుంది. పైల్స్ వలన ఇబ్బంది పడతారు.
పూర్వాభాద్ర, ఉత్తరాభాద్ర వారు కోర్టు వ్యవహారాలలోకి అడుగు పెడతారు. ఆలోచన చేయకుండా తీసుకున్న నిర్ణయాలకు మరి కొన్ని సమస్యలను తగిలించుకుంటారు.కానీ దైవబలం మీతో ఉంది.పూర్వం మంచితనంలో పెట్టిన పెట్టుబడి మీకు తోడవుతుంది.త్వరలోనే సమస్యలనుంచి బయట పడతారు.నిదానించండి.
~~~***~~~

అందరూ ప్రతి మాసం వారి నక్షత్రం ఉన్న రోజున శివునికి అభిషేకం చేయించుకోవటం మంచిది.

బిగ్గరగా కనీసం శుక్రవారం రోజున  శ్రీసూక్తం చదవండి.

స్రీ విష్ణు సహస్రనామం నిత్యం పారాయణ చేయండి.

మీ కులదైవాని, మీ గ్రామదేవతనీ విస్మరించకండి.

గోవులను సంరక్షించండి.

గంగను, తిరుమల స్వామిపుష్కరిణిని,నిరంతరం స్మరించండి.

~~~***~~~

అందరికీ మరల విరోధినామ సంవత్సర శుభాకాంక్షలు!

సర్వే జనా: సుఖినో భవంతు!

ఓం శాంతి: శాంతి: శాంతి:

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘విరోధి ‘ ఏమంటోంది?-వేదాంతం శ్రీపతి శర్మ

  1. అలాగే కానివ్వండి మాకు ఎప్పుడైతే తప్పుతుంది శ్రమ (రైతులకు)
    మీక్కూడా మా మన నూతన సంవత్సర శుభాకాంక్షలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: