సంఘం-వేదాంతం శ్రీపతి శర్మ


చిన్నప్పుడు చదివిన ఒక కథ చాలా సార్లు గుర్తుకొస్తూ ఉంటుంది. ఒక వ్యక్తి గుర్రాలను పెంచి పోషిస్తూ ఉంటాడు. వాటికి అతను ఇవ్వగల శిక్షణ ఎవరూ ఇవ్వలేరని ప్రసిధ్ధి. ఆయన ఆ గుర్రాలలో ఎంతో ప్రీతిగా పెంచి తయారు చేసిన ఒక తెల్ల గుర్రాన్ని ఎందరో కొనుక్కుని వెళ్లటానికి ప్రయత్నించి విఫలులైనారు. ఆ మాట విన్న ఒక దొంగ ఒక పన్నాగం పన్నాడు. ఈయన సూర్యోదయం ముందరే గుర్రానికి మేత వేసి శిక్షణ కోసం తీసుకుని వెళుతుండగా ఆ దొంగ ఒక గ్రుడ్డివాని వేషంలో దారిలో కాపు కాసి భిక్ష అడుగుతాడు. గుర్రం మీదనుంచి ఆయన ఒక నాణెం విసురుతాడు. అది అందుకోలేక బాధ పడినట్లు నటిస్తాడు. అయ్యో అనుకుని ఆయన గుర్రం మీద నుంచి దిగి నాణాన్ని మరల తీయబోయే లోపల దొంగ గుర్రం మీదకు ఎక్కి దానిని అదుపులోకి తీసుకుని నవ్వుతాడు. ఈయన బిత్తరపోయి చూసే లోపల దానిని స్వారీ చేస్తూ అటూ ఇటూ తిరిగి ఆ దొంగ డాబుసరిగా మరల ప్రక్కకు వస్తాడు.
‘ నేను ఎవరినో అర్థమైనది కదా?’
‘ అర్థమైనది..’, అంటాడు ఆయన, ‘ గురాన్ని దొంగిలిస్తే దొంగిలించావు కానీ ఈ విధంగా దొంగిలించావని ఎవరికీ చెప్పకు.’
‘ ఎందుకు? నీ మీద జనం నవ్వకూడదనా?’
‘ కాదు. రేపు నిజంగా అడుక్కునే వారికి ఎవరూ ఒక్క నాణెం కూడా వెయ్యరు!’
~~~***~~~
తిరుపతిలో సార్, జేబు ఎవరో దొంగిలించారని అడుగడుగునా అంటూ ఉంటారు. నిజంగా అలాంటి సమస్యలోకి వెళ్లిన వారిని ఎవరు ఆదుకుంటారు?
~~~***~~~
మా కాలనీలో ఒకాయన ఉండే వాడు. ఒంటరిగా ఉండే వాడు. ఏడాది తిరగ్గానే ఇల్లు గలాయన ఇంటికి వెళ్లి సార్, ఇదిగోండి మీ అద్దె. అయితే ఏడాది అయిపోయింది కాబట్టి ఇదిగోండి మరో రెండు వందలు అని చెప్పి ఈయనే రెండు వందలు పెంచి చేతిలో పెట్టే వాడు. మా ఇంటిలో అద్దెకు ఉన్న వ్యక్తి దేవుడు అని ఆయన అందరిఖి చెప్పే వాడు. అంతే! ఇల్లు గల వారందరూ ఏడాదికి ఒక సారి అద్దె రెండు వందలు పెంచటం పరిపాటిగా చేసుకున్నారు. ఇవ్వలేని వాడు తల దించుకున్నాడు. మరో చోటు వెతుక్కున్నాడు.
~~~***~~~
ఆ మధ్య కూరగాయల మార్కెట్లో నిలబడి ఒక రకం కూరగాయ పావుకిలో ఎంత అని అడిగాను. ఎనిమిది అన్నాడు. నేను ఆరు అన్నాను. అతను ఏమీ మాట్లాడలేదు. అదే కూరగాయలోని మరో రకం తీసి ఇది వస్తుంది అన్నాడు. నా ప్రక్కన నిలబడ్డ ఒక పెద్దాయనకు కోపం వచ్చింది. ‘ ఆయన అడిగింది ఈ కూరగాయ ఆరురూపాయలౌ పావు కు అమ్ముతావా లెదా అని. ఇస్తే ఇయ్యి, లేకపోతే లెదు. నీకు, నీ ఫేస్కీ ఇది చాలు అన్నట్లు అది చూపిస్తావేమిటి? వొళ్ళు పొగరా?’ అన్నాడు…
నేను ఆయనని ఆపాను. రోజులు మారాయి. బజారులో కస్టమర్ భాగస్వామిగా ఉండటం ఒప్పుకోలేని ఈ మనుషులే వెంటపడిపోయి ఎందుకు అది కొనడీ ఇది కొనండీ అని విసిగిస్తారు? కూరగాయలన్నిటినీ కుక్కలు తినేందుకు ఎందుకు విసిరేస్తారు?
~~~***~~~
సంఘం-నా ప్రవర్తన మన సంఘానికి ఎటువంటి పరిణామం తెస్తుంది? ఒక ప్రశ్న అడగాలి, అడుక్కోవాలి. కొన్ని వస్తువులను, ఒక దగుల్బాజీ ధరను, వ్యాపారాన్నీ ఉమ్మడిగా బహిష్కరించే వ్యావహారిక స్పందన మీద ఒక నిజమైన ప్రజాస్వామ్యం ఆధారపడి ఉంటుంది.
~~~***~~~
నాకెందుకు?-ఇది సంఘం కాదు. వోటు వెయ్యని వాడికి దేశం గురించి, విధానాల గురించి, రాజకీయాల గురించి మాట్లాడే హక్కు లేదు.
~~~***~~~
వేదం చెబుతుంది- సమానీవ ఆకూతి: సమానా హృదయానివ:
సమానమస్తు వో మనో యథావ: సుస్సహసతి-
~~~***~~~
సరైన మాటకు సమానమైన స్పందన ఒక సరైన సంఘానికి నాంది…విభిన్నమైన ఆలోచనలు ముందుకు రావటం తొలి మెట్టు-ఆనో భద్రా: క్రతవో యంతు విశ్వత:
~~~***~~~
ఆలోచన నాకెందుకు? ఓకే! అడవిలోకి పోండి!
~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “సంఘం-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: