15.03.2009 నుంచి 21.03.2009 వరకు రాశి ఫలితాలు-వేదాంతం శ్రీపతి శర్మ


 

 

 

 

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్తకళ్యాణగుణాభిరామ:
   సీతాముఖాంభోరుహచంచరీక: నిరంతరం మంగళమాతనోతు

15.03.2009 నుంచి 21.03.2009 వరకు రాశి ఫలితాలు ఇలా ఉన్నాయి: ఈ వారం గ్రహస్థితి-ఈ వారం గురు రాహువులు మకరంలోనూ, బుధ కుజులు కుంభంలోనూ, రవి శుక్రులు మీనంలోనూ, శని సింహంలోనూ, కేతువు కర్కాటకంలోనూ, చంద్రుడు తుల, వృశ్చిక, ధను, మకర రాశులలో సంచరిస్తారు.

ఎవరి పనులు వాళ్లు చేసుకుంటే మంచి ఫలితాలు ఇచ్చు వారం. ముఖ్యంగా రాజకీయాల లోని వారు ఒకరి మీద ఒకరు బురద చల్లుకోవటం మానేసి వారు వారి విధానాల గురించి మాట్లాడటం మంచిది. తప్పుడు మాటల వలన హాస్యాస్పదమైన పరిస్థితులు సంభవించవచ్చును. బాధ్యతలను విస్మరించటం వలన చాలా మంది కొన్ని ఇబ్బందులకు గురి కాగలరు. బాంకింగు రంగంలో ఒక కీలకమైన సమచారం అందగలదు. భూ వివాదం ఒకటి కలవర పెట్టగలదు. ఇంటిలో భార్యా భర్తలిద్దరూ కలసి ఏదైనా శుభకార్యం చేపడితే అద్భుతమైన ఫలితాలు ఇవ్వగలదు!
 
మేష రాశి: పాత బకాయిలు వసూలు కాగలవు. మీ జీవిత భాగస్వామి మీద మరింత గౌరవం పెరుగుతుంది.ఒక ప్రయాణం తలపెడతారు. దంతాల విషయంలో జాగ్రత్త వహించాలి. ఆదిత్య హృదయం చదవండి.

వృషభ రాశి: వారాంతంలో మంచి యోగం ఉన్నది. మిత్రులు సహాయం అందిస్తారు. నూతన వాహన యోగం ఈ వారం ఫలిస్తున్నది. తెలుపు రంగు ఆకర్షిస్తుంది. శత్రువులు మిత్రులవుతారు. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

మిథున రాశి: కళాకారులకు మంచి వారం. కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. గొంతు నొప్పులు బాధిస్తాయి. బాధ్యతలు చేపడతారు. శుక్రవారం కొద్దిగా మౌనం పాటించండి.పెద్దల మాటలు బాధించగలవు. శ్రీసూక్తం చదవండి.

కర్కాటక రాశి: అవసరాన్ని మించి శ్రమించటం మంచిది కాదు. ఇంటిలోని పనులు నిదానంగా సాగుతాయి. ఉత్సాహం ఎక్కువగా ఉన్నప్పటికీ శరీరం ఒప్పుకోదు. ఒక లేఖ మంచి వార్త తెలుపగలదు. జీవిత భాగస్వామితో సహకరించండి. సుబ్రహ్మణ్య కవచం చదవండి.

సింహ రాశి: ఒక మంచి సలహా పొంది ఆచరణలో పెడతారు. ఆరోగ్యం మెరుగు పడుతుంది. ప్రయాణాలలో జాగ్రత్త వహించాలి. ఇంటిలో ఎలుకల వలన ఇబ్బందులున్నాయి. జాగ్రత్త పడండి. దీర్ఘకాలీనమైన పెట్టుబడులు ఈ వారం వద్దు. దుర్గా సప్తశ్లోకీ పఠించండి.

కన్య రాశి: మీ దృక్పథానికి వ్యతిరేకంగా ప్రవర్తించవలసిన అవకాశం ముందుకు వస్తుంది. ఆలోచనలో పడతారు. కీర్తి గౌరవాలు పెరుగుతాయి. వారాంతంలో ప్రజల దృష్టికి వచ్చే ఒక కార్యక్రమం ప్రారంభిస్తారు. కాలం అన్ని పనులూ మీ ప్రమేయం లేకుండా చేయించుకు పోతుంది. శ్రీసూక్తం చదవండి.

తుల రాశి: వారం మధ్యలో అనవసరంగా నిరాశ పడతారు. అధికంగా ఆలోచించటం మానేయండి. అన్నీ మంచికే జరుగుతాయి! మీ చుట్టు ప్రక్కల అన్నీ పరస్పరం విరోధంగా ఉన్న విషయాలు తలెత్తుతాయి. మీకు వాటితో సంబంధం లేదు…కలుగ చేసుకోకండి. స్త్రీలు ఆరోగ్యం పట్ల శ్రధ్ధ వహించాలి.

వృశ్చిక రాశి: పిల్లలు మాట వినకపోతే విచారించకండి. వారి స్వేఛ్చ ప్రస్తుతానికి మంచిదే! మీరు ఇంటి పట్ల ఉండటం చాలా అవసరం. అది చాలు! పోటీలకు పోకండి. అక్కడే పోట్లాటలుంటాయి. మంగళ వారం మంచి ఆదాయం ఉంది. శివునికి అభిషేకం చేయించండి.

ధను రాశి: మీకు నష్టం చేయగోరే వారు వాళ్లల్లో వాళ్లు కొట్టుకుని నశించిపోగలరు. మీ ఎత్తుగడకు ఇది మంచి సమయం. కాలం వృధా చేయకండి. ఉద్యోగంలో మార్పు ఉండవచ్చును. అవసరాన్ని పరిశీలించి దేనికైనా సమాధానం ఇవ్వగలరు. మీ వాహనాన్ని గమనించి నడపండి. హనుమాన్ చాలీసా చదవండి.

మకర రాశి: బంధువుల సందర్శనం తరువాత మరల పనిలోకి దిగాలి. మీరు చేపట్టిన కార్యం నెరవేరుతుంది. మీ ఇంటిలో దొంగతనాలు చేయాలని ఒకరిద్దరు గట్టిగా సంకల్పించి యున్నారు! మీరు ఏమి చేయదలచారో మీ ఇష్టం! సుబ్రహ్మణ్య కవచం చదవండి.

కుంభ రాశి: ఆశయాలకు భిన్నంగా పరిస్థితులు కనిపిస్తాయి. మౌనం పాటించండి. వారాంతంలో ఖర్చులు పెరుగుతాయి. ఇంటిలోని వారి మాటల కంటే బయట వారి మాటలు వినాలనిపిస్తుంది. అది మంచిది కాదు. ఏది ఎలా ఉన్నా అదృష్టం మీ వైపు ఉన్నది. విష్ణు సహస్రనామం పఠించండి.

మీన రాశి: కలల నుంచి బయటకు రావాలి. వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. అందరూ ఒక లాగ ఉండరు. ఒక పాత మిత్రుడు కలుస్తాడు. స్త్రీలు గర్భం విషయంలో జాగ్రత్త వహించాలి. ప్రలోభాలకు లొంగ కూడదు. మంచి సంగీతం వినండి.

ఈ వారం మంచి మాట-

తన్మే మన: శివసంకల్పమస్తు! (యజుర్వేదం)

నా హృదయం లోని సంకల్పం శివుని సంకల్పం అగుగాక!

ఓం శాంతి: శాంతి: శాంతి:

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “15.03.2009 నుంచి 21.03.2009 వరకు రాశి ఫలితాలు-వేదాంతం శ్రీపతి శర్మ

సూర్యుడుకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: