స్విస్ బాంకులో మన దేశానికి ఎంత ఉంది?-వేదాంతం శ్రీపతిశర్మ


 

భారత దేశపు ఋణభారం కంటే పదమూడింతలు డబ్బు ఎక్కడున్నదో ఒక సారి చూద్దాం-ఇది భారతీయుల స్విస్ బాంకు ఖాతాలలో ఉన్నది! ఇది మామూలు మనుషులను దోచుకుని అక్కడ కూడ బెట్టిన 1500 బిలియన్ డాలర్లు! వీళ్లు ఎవరు? చాలా సింపుల్! మన ‘ నాయకులు ‘,ఐ.ఏ.ఎస్, ఐ.పి.ఎస్, ఐ.ఆర్. ఎ.ఎస్ ఇలా ఎందరో చరితార్థులు. కొద్ది రోజుల క్రితం ఈ బ్లాగులో నేను వీళ్లందరినీ ఒక సారి రోడ్డు మీదకు తెచ్చి ఒక దులుపు దులపాలని చెప్పి యున్నాను. విచిత్రంగా స్విస్ బాంకు వారు చక్కని వివరాలు మంకు ఇస్తున్నారు… దీనితో మన దేశంలోని 45 కోట్ల మంది పేద ప్రజలకు చెరో లక్ష రూపాయలు ఇవ్వ వచ్చును! ప్రపంచంలో అన్ని దేశాలకంటే భారత దేశం స్విస్ బాంకు ఖాతాలలో దాచుకున్న విషయంలో (దోచుకున్నది) అగ్ర స్థానంలో ఉన్నది. సొమ్ము ఎంత ఉందీ అంటే మిగతా దేశాలన్నిటి మొత్తం కలుపుకుని చూసినా దానికంటే మన దేశం మొత్తం ఎక్కువ ఉన్నది! ఆ గవర్నమెంటు వారు ఈ మధ్య ఏమంటున్నారంటే ఒక వేళ ఒక దేశం ప్రభుత్వం కోరితే పేర్లు బయట పెడతామంటున్నారు. మన ప్రభుత్వం ఎప్పుడు కోరాలి?

టాప్ అయిదు దేశాల ఖాతా క్రింద ఇస్తున్నాను-

ఇండియా-1456 బిలియన్ డాలర్లు
రషియా-470
బ్రిటన్-390
యుక్రైన్-100
చైనా-96

ఈ విషయం లో టేక్స్ జస్టిస్ నెట్వర్క్ వారు చాలా వివరాలు ఇస్తున్నారు. ప్రపంచంలోని డబ్బు అంతా లెక్క కడితే అందులోని 57% కేవలం 1% దగ్గర ఉన్నది.
పేదరికంతో అలమటించే దేశాల నుంచే ఈ డబ్బు ఈ విధంగా స్విస్ బాంకులకు చేరిపోయింది!ఇందులోని చాలా భాగం ఆ దేశం యొక్క టాక్స్ రూపంలో చెల్లించబడుతున్నది!

స్విట్జర్లాండుకు ఏటా 80000 మంది వెళ్లి వస్తూ ఉంటారు. ఇందులో 25000 మంది ఏడాదిలో ఎన్నో సార్లు తిరిగి వస్తారు. ఏమిటి పని?
 

 ఆర్థిక విధానాల మీద దిక్కుమాలిన కబుర్లు చెప్పమన్నా, ఇంకం టాక్సులు పెంచేసి మామూలు మనుషులకు సందేశాలు చెప్పమన్నా,ఆక్స్ఫర్డ్ లెక్కలు వేసేసి ఇంటలెక్చువల్ అని అపించేసుకోమన్నా మనం సిధ్ధం. మాకక్కరలేదు మీ బుధ్ధిజీవుల గొప్పలు, అవార్డులు. ధైర్యంగా స్విస్ బాంకు వారిని అన్ని పేర్లూ, పూర్తి లెక్కలూ ఎందుకు బయట పెట్టించలేరు? నల్ల డబ్బు దోచుకున్నదే కాదు. దాని వలన మామూలు మనిషికి పడు భారం ఎంత దారుణం? మరి ప్రపంచ ఆర్థిక మాంద్యం భారం మామూలు మనిషే ఎందుకు మోయాలి? దొరబాబులను ఒక సారి రోడ్డు మీదకు లాగండి!

~~~***~~~

గతంలో ఒక పాష్చాత్య సందర్శకుడు భారతీయులను ముక్కు మీద కోపం ఉన్న వారు కానీ చాలా నీతిమంతులు అని వర్ణించాడు.

~~~***~~~

రోజులు మారాయి. అవినీతిని చూసి ఎవరికీ కోపం రాదు. తన దాకా వస్తే కానీ ఏ సమస్య గురించి పట్టదు. మరి మనలో నీతిమంతులు ఎంతమంది?

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “స్విస్ బాంకులో మన దేశానికి ఎంత ఉంది?-వేదాంతం శ్రీపతిశర్మ

  1. శ్రీపతి శర్మ గారు, మీ టపా చదివిన తరువాత నాకు ఒక్క విషయం అర్థమైంది.
    ” నాకు స్విట్జర్లాండు ఇష్టం ” అని పేపర్లలో . టి.వి లలో ఇంటర్వూలు వినేటప్పుడు, చదివేటప్పుడు అక్కడ అంత ఇదిగా ఏముందో అర్థము అయ్యేది కాదు. ఇప్పుడు స్పష్టమైంది.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: