‘గోరంత దీపం’-వేదాంతం శ్రీపతి శర్మ


 

 

 

చాలా కాలం క్రితం ఒక పల్లెటూళ్లో పెళ్లికని వెళ్లాను. మమ్మల్ని సామర్లకోట స్టేషన్లో దింపుకునేందుకు ఒక పెద్దమనిషిని పెళ్లివారు పంపారు. (మేము మగపెళ్లివారం అని గుర్తు చేశారు!). కాకపోతే ఆ వ్యక్తి అసలు అందరికీ ఆయనొక్కడే పెళ్లి కొడుకు అని నిరూపించాడు. సామర్లకోట నుంచి ఆ పల్లెటూరు వెళ్లే వరకు అయ్యే ఖర్చులన్నీ మా చేత పెట్టించాడు! కావాలని ఏరి కోరి ఆయనను మా కోసం పంపారని అర్థమయ్యింది. అది అలా ఉంచండి.ఆటోలో దారిలో ఒక చోట ఒక చిన్న బానరు చూశాను-‘ఇరాక్ మీద అమెరికా దాడి-ఒక చర్చా. వింతగా తోచింది. ఇక్కడెవరురా ఈ చర్చ జరుపుతున్నదీ అని ఆశ్చర్యమేసింది. విడిదిలో దిగి ఆ పెళ్లి మరునాడు తెల్లవారు మూడు గంటలకు కావటం చేత తిరిగి దారిలోని ఆ పల్లెటూరు వైపు ప్రయాణం కట్టాను.

ఆ బానరు మీద వివరాలు చూసి ఆ పల్లెటూరులోని ఒక చిన్న బడి వైపు నడిచాను. ఆ బడిలో ఒక చిన్న గ్రంథాలయం అది. అది మన అగ్గిపెట్టె అపార్టుమెంట్లలో ఉండే బెడ్ రూము పక్కన స్టడీ రూము అంత ఉంది. అంతే. కింద ఒక జంపకాన పరచారు. నలుగురున్నారు. నలుగురిలో ఒకరు మాట్లాడుతున్నారు. ముగ్గురు కూర్చున్నారు. ఆ ముగ్గురిలో ఒకరు పాయింటులు వ్రాసుకుంటున్నాడు!
నేనూ దూరి గోడకి ఆనుకుని కూర్చున్నాను. నన్ను వింతగా చూసినా అంతగా పట్టించుకోలేదు.సభలోని వారంతా మాట్లాడారు. సభాధ్యక్షుల వారు నన్ను పరిచయం చేసుకుని మాట్లాడదలచుకుంటే మాట్లాడండీ అన్నారు. చేయి అడ్డం పెట్టి వినటానికే వచ్చాను అన్నాను.
సభ అయిపోయింది. ఇవతలకు వచ్చి పరిచయం చేసుకున్నాను. వాళ్లు సంతోషించారు. ఇలా అప్పుడప్పుడు చర్చలు జరిపి ఆ పాయింట్లను తుని నుంచి వచ్చే ఒక పత్రికకు పంపుతామన్నారు…

~~~***~~~

‘ లీవ్స్ ఆఫ్ గ్రాస్ ‘ అనే వాల్ట్ విట్మన్ పుస్తకం గుర్తుకొచ్చింది. ఉన్నంత సేపు నిక్కపొడుచుకుని ఉంటుంది ఆ మొక్క. రథాలెన్నో దాని మీదుగా వెళ్లిపోతాయంటాడాయన!

మనకు కలిగిన ఆలోచనని, ఒక నిజాన్ని చెప్పటానికి మనం ఒక ఎడిటరో, ఒక రచయితో , ఒక విలేఖరో కానక్కరలేదు. ప్రజాస్వామ్యం సజీవంగా ఉన్నదని చెప్పటానికి ఈ ఉదాహరణ చాలు.

పల్లెల్లో దినపత్రికలు చదివి చక్కని విశ్లేషణలు చేసే వారు ఎందరో ఉన్నారు. సమాచారం ఎంత అవసరమో దానిని విశ్లేషించి ఇది తప్పు ఇది రైటు అని చెప్పుకోవటం అంతే అవసరం. ఈ సమాచారం నాకొద్దు అనుకోవటం కూడా కనిపిస్తున్నది. కొంత మందికి బుర్ర పాడవుతున్నది అనే భయం కూడా ఉంది. ఇది సమాచార యుగం. చేయగలిగినది ఏమి లేదు. తలుపులు తెరచి పెట్టే ఉంచాలి. అయినా లోపల ఎంతో భద్రతగా ఉండాలి. ఇటు తిప్పి చెప్పాలంటే భద్రంగా ఉన్నామని అనుకోవాలంటే తలుపులు మూయటం కాదు-తెరచి ఉంచాలి! ఎంత విచిత్రం. ఇదే ప్రపంచం. ఇండస్ట్రియల్ రెవెల్యూషన్ నుంచి ఇంటర్నెట్ రెవెల్యూషన్ కి వచ్చి చాలా కాలం అయింది. చాలా చోట్ల ‘నాలడ్జ్ మేనేజ్మెంట్ ‘ ఒక కీలకమైన అంశంగా చెబుతున్నారు. అతిగా అన్నీ తెలుసుకోవటం ఇబ్బందే. పిల్లల విషయంలో మరీ ఇబ్బందిగా ఉంటోంది.

ఈ నేపథ్యంలో కబుర్లు అవసరం.కాకమ్మ కబుర్లు ఇంకా అవసరం. దీని వలన ఎక్కడో చేరుకుని పేరుకొని పోయిన చెత్త తేలికగా అవతలకు వెళ్లిపోతుంది. ఇది లేక సైకోసొమేటిక్ వ్యాధులతో బాధ పడే వారు కోకొల్లలు…

టి.వీలో వచ్చే చెత్త చర్చల గురించి ఈ మధ్య రేరాజ్ గారు అయన బ్లాగులోని ఒక టపాలో వ్రాశారు. నిజానికి అవసరమైనది కాకుండా చాలా సేపు ఎలా చర్చించుకోవాలో ఈ కార్యక్రమాల ద్వారా నేర్చుకోవచ్చును. మీరు చెత్త కుండీలో ఏదైనా విలువైన వస్తువును పారేసుకుంటే కంగారు పడనక్కరలేదు. మీరు ఒక సారి కుండీ దగ్గరకెళ్లి చూడండి. అందులో ఏమీ ఉండదు. మి వస్తువు ఒక వేళ ఉంటే దొరికిపోతుంది. అసలు చెత్త అంతా చెత్త కుండీ చుట్టుతా ఉంటుంది!

ఈ టి.వీ చానెళ్లలోని చర్చలూ అంతే!పాయింటుకు ఎవరూ రారు. ఆ ప్రయోక్తకు ఏది విషయం అని తెలిసినప్పుడు కదా?…

చక్కని చర్చ అనేది ఒక లాన్ టెన్నిస్ ఆట లాంటిది. ఒక మంచి సర్వీస్, ఒక మంచి వాలీ, మరొక మంచి వాలీ…ఇలా సాగిపోతే బాగుంటుంది. స్qఆష్ ఆటలాగా గోడకి ఒక బంతిని కొట్టి మరల దానినే బాదుతూ ఉంటే సమస్యగానే ఉంటుంది…

పిల్లలను ప్రశ్నలు అడిగించే అలవాటు-పేపరు చదివించో లేక టి.వీలోని ఏదైనా విషయం గురించో నేర్పటం లాభదాయకమని పలువురూ అభిప్రాయపడుతున్నారు. వాళ్ల స్కూలు అన్ని చోట్లా కనెక్ట్ అవటం అవసరం! తల్లి దండ్రులు దీనికి సిధ్ధం గా ఉండటం అవసరం. వాళ్ల మనస్సులో తెలియకుండా నాటుకున్న ముద్రలను తీయాలంటే ఈ కబుర్లు మనకు పెద్దలు ఇచ్చిన గొప్ప వారసత్వం! ముందు పెద్దలు అసలు మాట్లాడుకుంటున్నారా?

ఏమో!

~~~***~~~

మాట్లాడేందుకు సిగ్గుగా ఉంటోందా? ధైర్యం చాలటం లేదా? ఎవరైనా తప్పు పడతారని ఇబ్బందా?

గడ్డి మొక్కను తలచుకోండి. పిల్లలకు నాటక రంగాన్ని పరిచయం చేయండి.

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘గోరంత దీపం’-వేదాంతం శ్రీపతి శర్మ

  1. అయ్యా! మీ వ్యాసం చదువుతూ వుంటే చిన్నప్పుడు నేను చదివిన హైకూ ఒకటి గుర్తుకు వచ్చింది. అది నాకు నచ్చింది. ఇక్కడ అందిస్తున్నాను. రచయిత పేరు కల్లురి భస్కర్ అనుకుంటాను.యధాతధంగా వ్రాయడానికి అన్ని పదాలూ గుర్తు లేవు.ఒరిజినల్ నా దగ్గర లేదు.
    “గాలి జోరుకి
    అరటి చెట్లు అల్లలలాడుతున్నాయ్!
    గడ్డిపోచ మాత్రం తన కత్తి ఝళిపిస్తూనేవుంది!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: