‘మామూలు మనిషి’-వేదాంతం శ్రీపతి శర్మ


 

మరో సారి మనం సర్వీసెస్ గురించి చర్చించాలి. ఇప్పటికి ఈ బ్లాగులో రెండు మూడు సార్లు నేను ఈ విషయాన్ని చర్చించాను. ఎకనమిక్ టైంస్ లో ఈ మాటే ముందుకొచ్చింది.

ఈ రోజు వార్తలలో మన ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి షాక్ కనిపించటం లేదని ఆర్. బీ. ఐ వారు కొద్దిగా భుజాలు ఎగురవేశారు.

మంచిదే. మన సర్వీసెస్ ఇప్పటికీ  మన జి.డి.పీ కి 50% కాంట్రిబ్యూషన్ చూపుతున్నది. గత నెలలో కొన్ని నిత్య వాడుకల వస్తువుల వ్యాపారం, రవాణా (ముఖ్యం గా రైల్వే)డిసెంబర్ మీద వృధ్ధి చెందాయి.

నిజానికి ప్రభుత్వం తన విధానాలను ఊరకే జెండా ఎగురవేసి చూపుకోనక్కరలేదు! భారతీయ పౌరునికి డబ్బు విషయం లో ఎలా ప్రవర్తించాలో చాలా బాగా తెలుసును. సేవింగ్స్ ఎందుకు చేస్తాడు? పరిస్థితులు బాగా లేనప్పుడు అవసరమైనవే కొంటాడు. పెటుబడులు లేవనుకుంటే భయపడనక్కరలేదు. సేవింగ్స్ రేటు బాగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇది వ్యవస్థకు పనికి వచ్చేదే. ఇక్కడ మరో తిరకాసు ఉంది. మన దేశం లో ఎంతో క్రమశిక్షణతోనూ, ఓర్పుతోనూ మసలే గట్టి మధ్యతరగతి వర్గం ఉన్నది. దీని మీదనే మన వ్యవస్థ లివరేజ్ ఆధారపడి ఉంది.

ఒక వెల్ఫేర్ స్టేట్ లో ఆరోగ్యం, బోధన అనేవి ప్రభుత్వం చేపట్టవలసినవైతే చాలా ఎక్కువ మూల్యం చెల్లించి మన వాళ్లు ఈ రంగాన్ని పోషిస్తున్నారు. తరువాత ఇతర దేశాలలో లాగా కాకుండా నిరుద్యోగానికి ఇక్కడ సంక్షేమ పథకం ఏదీ ఉండదు.

వ్యవస్థ బాగుందీ అంటే ప్రజల పాళ్లు వ్యావహారిక స్పందన వలన కానీ ప్రభుత్వం ఏదో చేసేసిందని కాదు! బంజారా హిల్స్ లోని పెద్ద పెద్ద షాపులలో వాళ్లు విస్తు పోతున్నారు. ఏమండీ, 50%,60%, ఆఖరుకి 75% డిస్కవుంట్ ఇచ్చినా అమ్మకాలు లేవు. ఇదేమిటీ? అంటున్నారు.

ఎందుకు కొనాలి? మన దేశం ప్రస్తుత వాతావరణం సింప్లిసిటీకీ,ఆస్టెరిటీకీ అణువుగా ఉంది. మన శ్రమ అంతా సేద్యం లోనూ, భూమితోనూ ముడిబడి ఉంది. ఈ కార్పొరేట్ కృత్రిమ వ్యవస్థ అనవసరాలను అవసరాలుగా మార్చి ఒక దిక్కుమాలిన కన్స్యూమర్ మార్కెట్ ను సృష్టించి అలా చెలామణి అయిపోతుంది. కొంత ప్రలోభపడినా భారతీయులు త్వరగానే తెలుసుకున్నారు.

ప్రపంచ ఆర్థిక మాంద్యం వలన ఏర్పడుతున్న పరిణామాలలో కొన్ని పాఠాలు ప్రభుత్వం నేర్చుకోవాలి.

1. ఎంతసేపూ ప్రజలను దబ్బు దాచుకుని మార్కెట్ లో పెట్టండీ అని చావ గొట్టటం కాదు. ప్రభుత్వం నాన్-ప్లాన్ వ్యయం ఎందుకు తగ్గించలేకపోతోందో వివీరణ ఇవ్వాలి. ప్రజలు బాధ్యతగా ఉన్నరని స్టేటిస్టిక్స్ చెబుతున్నాయి. ప్రభుత్వం బాధ్యత వహించి ఈ బంగళాలూ, కార్లు, డ్రైవర్లూ, తోటమాలులు, ఒకటా రెండా…పీకేసి ఈ దొరబాఉలను, నాయకులను ఎందుకు నిలదీయదు? వాటి స్థానం లో భూమిని లీస్ కు ఇచ్చి జి.డి.పికి ఎందుకు తోడ్పడకూడదు? నన్ను కాకుండా లెక్క వేసుకో!
2. వ్యవసాయ రంగం నుంచి చేయవలసిన ఎగుమతులు ఊపు అందుకునేటట్లు విధానాలు కొద్దిగా సవరించగలిగితే ఈ ఆర్థిక మాంద్యం లో ఉత్తరోత్తర లాభసాటి పరిణామాలు ఉండగలవు.
3. ఈ రోజు మన దేశంలో నల్ల డబ్బు ఎంత ఉందో నాకు ఎవరైనా సాధికారంగా చెప్పగలరా? కొద్దొ సంవత్సరాల క్రితం చ్దంబరం గారు వాలంటరీ డిస్క్లోసర్ అంటూ లేచారు. కొంత లాభం కనిపించింది. అక్కడే వదిలేశారు.
4. పనీ పాటా లేకుండా ఈ రాజా మహారాజాలు ఇంకా చాలా మంది వాళ్ల ఆస్తులను పట్టుకుని మఱ్రి ఊడలను పట్టుకుని వ్రేలాడుతున్నట్లు వ్రేలాడుతున్నారు. విళ్లందరినీ లైను లో పెట్టి ఒక సారి సంగతి తేల్చుకోవాలి.
5. ఉత్పత్తికి పనికి రాని ఏ ప్రక్రియ అయినా సంపదనైనా ఒక పనికి వచ్చే ప్రక్రియలోకి దింపవలసిన అవసరం ఉంది.
6. మచ్చుకు ఇదే అవకాశమని అన్ని ప్రభుత్వ రంగ దొరబాబుల ఇళ్లను
,నాయకుల కొంపలనూ పూర్తిగా సౌదా చేసి చూడాలి.

ఇవన్నీ ఆవేశం లో చెబుతున్న మాటలు కావు. ఈ రోజు సగటు భారతీయుడు దేశం పట్ల, సమాజం పట్ల, ఆర్థిక సమస్యల పట్ల ఎంతో బాధ్యతతో ఉన్నాడు, ప్రవర్తిస్తున్నాడు. పరిణామాలు కూడా దానికి నిదర్శనం.

అలా లేనిది ఈ వ్యవస్థను తర తరాలుగా వాడుకుంటున్న ఈ నాయకులు, ప్రభుత్వం లో పాతుకుపోయి ఒక సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్న ఈ దొరబాబులు!

వీరిద్దరి మధ్య మరో నిజం దాగి ఉంది. సగటు భారతీయుడు ఎందుకో మామూలు మనిషిని మామూలుగానైనా గౌరవించడు. వాడికి ఒక టాగ్ ఉంటేనే వాడిని గుర్తిస్తాడు.

ఎన్ని కష్టాలొచ్చినా ముళ్లలోనూ మామూళ్లలోనూ ఈ మామూలు మనిషి మూలుగుతూనే ఉంటాడు…

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

4 thoughts on “‘మామూలు మనిషి’-వేదాంతం శ్రీపతి శర్మ

  1. . మచ్చుకు ఇదే అవకాశమని అన్ని ప్రభుత్వ రంగ దొరబాబుల ఇల్లను,నాయకుల కొంపలనూ పూర్తిగా సౌదా చేసి చూడాలి.
    ఇది అమలుజరిగేపనంటారా

  2. మంచి టపా. సగటు మనిషి బాధ్యతగా వుంటున్నాడనేది సరైన పాయంటు. ఇక్కడ విశేషమేమంటే ప్రతి సగటువాడు దెబ్బతిన్న తన ఆర్థిక వనరులు, బయట ద్రవ్యోల్పణం కారణంగా తన ఇల్లు చక్కబెట్టుకునే వుద్దేశ్యంలో బాధ్యతగా వుంటున్నాడు. నాయకులూ తమ తమ ఇళ్ళను చక్కబెట్టుకునే వుద్దేశ్యంలో బాధ్యతా రాహిత్యంగా వున్నారు. ఆర్.బీ.ఐ రెపోరేట్లు తగ్గించేసి ఇహ చూస్కోండి బ్యాంకులు డబ్బులు కుమ్మరిస్తాయి.. అందరు అప్పులు తీసుకొని తెగ ఖర్చు పెట్టేస్తారు అని ఆలోచించడం మన ఆర్థక నిపుణుల అమాయకత్వం. మాంద్యంలో సగటు మనిషి అప్పులు తీర్చుకోడనికి ప్రయత్నిస్తాడుకానీ అప్పులు పెంచుకోడానికి కాదు. ఇంతకన్నా మీరన్నట్టు ఎక్స్‌పోర్ట్ అవకాశాలు పెంచడం ఇప్పుడు తక్షణ కర్తవ్యం…!!

  3. ఔను నిజమే!సగటు మనిషిని ఒక టాగ్ లేకుండా ఎవరూ గుర్తించకపొయినా, సగటు మనిషి తన సగటు తనాన్ని మూలుగుతూనో, మునుగుతూనో, సగర్వముగానే చెప్పుకుంటున్నాడు. అందుచేతనే, ఎప్పుడూ కూడా పర్సు నిండుగా వున్నప్పుడు సూపర్ మార్కెట్లో ఒక సోకైన వస్తువు కొన్నా, రోజువారి వస్తువులు హోల్ సేల్ మార్కెట్లోనే కొంటున్నాడు.అదీ విషయం! బాగుంది! బాగా చెప్పుతున్నారు. కాకపోతే…మూడే మూడు చోట్ల అప్పుతచ్చులు…మరేం ఫర్వాలేదు లెండి!

అరిపిరాలకు స్పందించండి స్పందనను రద్దుచేయి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: