‘ వేట ‘- వేదాంతం శ్రీపతి శర్మ


 

 

నేషనల్ జాగ్రఫిక్ చానెల్ లో ఒక కార్యక్రమం చాలా సార్లు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ చానెల్ లోనూ అలాగే డిస్కవరీ చానెల్ లోనూ వచ్చే కార్యక్రమాలకు ఛాయా గ్రహణం తో పాటుగా వ్యాఖ్యానం చాలా బాగుంటుంది.

నేషనల్ జాగ్రఫిక్ చానెల్ లో ఒక కార్యక్రమం చాలా సార్లు గుర్తుకు వస్తూ ఉంటుంది. ఈ చానెల్ నాకు గుర్తుకొచ్చే కార్యక్రమం ఏమిటంటే ఒక ఆడ పులి తన పిల్లలకు ఆహారం కోసం వేటాడే అవకాశానికోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చాలా సేపు చూసిన తరువాత చివరికి ఒక జింక వెంట పరిగెడుతుంది. చాలా సేపు చేసింగ్ అయిన తరువాత ఆ జింక ఎన్నో సార్లు డాడ్జింగ్ చేసి ఏడిపించాక చివరికి అది దొరికిపోయింది.

అయితే ఒక చిన్న టాక్టికల్ పొరపాటు వలన అంతా తారు మారైనది. జింక మీద పంజాలు గెట్టిగా పడ్డప్పటికీ దానిని మెడ దగ్గర పట్టుకుని లాగే లోపు దాని విలక్షణమైన కొమ్ములు పులి కడుపులోకి దిగిపోయాయి. రక్తం కారిఫొయింది. పులి నేలకి ఒరిగినా పంజాలు అలానే ఉన్నాయి. కళ్ల మీద కెమెరా ఫోకస్ అయింది. అవి మూత పడుతున్నాయి. పులి పిల్లలు దూరం నుంచి ఆందోళనగా చూస్తున్నాయి.

వాటినే చూస్తూ ఆ పులి కళ్లు మూసేసింది. జింక తప్పుకుని పారిపోయింది. పిల్లలు అక్కడికి చేరి గుమి గూడి వాటి భాషలో దూరంగా నిలబడి చూస్తున్న జింక మీద అరుస్తున్నట్లు కనిపిస్తుంది…వ్యాఖ్యాత ఒక మాట అంటాడు-ఇదే ఇక్కడ జీవితం. కొద్ది సేపు జింక మీద జాలి, వెంటనే ఈ పిల్లల మీద జాలి…చిన్న పొరపాటు వలన ‘ హంటర్ ‘ ‘ హంటెడ్ ‘ గా మారుతుంది!

~~~***~~~

తీవ్రవాదం, ఆయుధాల వ్యాపారం, ఇన్సర్జెన్సీలు, ఇవన్నీ ఒక పేరలల్ ఆర్థిక వ్యవస్థతో నడుస్తూ ఉంటాయి. వీటికి కూడా లిక్విడిటీ అవసరం. ఏదైనా ప్రక్రియలో భాగమే. రిసెషన్ వలన సప్లై ఆగిఫొయి అన్నీ బిగుసుకున్నట్లు ఈ వ్యవస్థ నడిచే ఆర్థిక వనరులు కూడా బిగిసాయి. శ్రీలంకలో ఎల్.టి.టి.ఈ ఈ ఆయుధాల సప్లై కి పెద్ద పీట. ఈ మధ్యనే కుళాయి ధార తగ్గి రోడ్డున పడ్డారు. ఆ దేశం ప్రభుత్వం అవకాశాన్ని ఒక విధంగా సద్వినియోగం చేసుకుంది. దవూద్ ఇబ్రహీం, తాలిబాన్ ల వ్యవస్థకు కూడా అలజడి ప్రారంభమైనట్లు తెలుస్తోంది. కిర్ఘిస్తాన్ అఫ్ఘనిస్తాన్ కు ఒక కీలకమైన పేసేజ్ ను మూసేసింది. అమెరికా బేస్ ను తొలగించింది.

తర తరాలుగా ఈ వ్యవస్థను నమ్ముకున్న పాకిస్తాను దగ్గర నుంచి అను శక్తిని కాజేసే ప్రయత్నం తాలిబాన్ చేస్తున్నట్లుంది. వీళ్లను అడ్డం పెట్టుకుని చేస్తున్న వేట తీరు మారింది…

ఈ పరిస్థితి నా దృష్టిలో వ్యవస్థ చెదిరిన పరిస్థితి. ఏ అరాచకమైనా ఒక వ్యవస్థ రూపంలోకి మారి ముదిరినప్పుడు ఏదో ఒక రోజు వ్యవస్థతో పాటు చీల్చుకును బయటకు రాక తప్పదు.

ఈ వేటలో పాకిస్తాన్ ను మన వైపు వీరు ఎంత దూరం తరుముతారో చూడాలి. 9/11 సమయం లో ప్రపంచ దేశాలన్నీ కలసి అమెరికాకు మద్దతుగా నిలచి పాకిస్తాన్ ను కీలకమైన భౌగోళిక క్షేత్రంగా ఎంచుకుని అఫ్ఘనిస్తాన్ మీద హడావుడి చేశాయి. ఇప్పుడు ఈ ఆర్థిక పరిస్థితులలో అంత ఉబలాటం ఎవరికీ లేదేమో! అయినా భారత దేశం కీలకమైన పాత్ర పోషించవలసిన అవసరం ఉంది. ఎంత సేపూ ఇదిగో చూడండి ఏమి చేస్తున్నారో అంటూ అన్ని దేశాలకూ చెప్పటం తో సరిపోతోంది.

ఈ వ్యవస్థ చిట్లటం, దాని పర్యవసానాలు ప్రతిబింబించటం అన్నీ ఈ భూ ఖండం మీదనే జరుగబోతున్నట్లు సూచనలున్నాయి. పాకిస్తాన్ చేతిలో ఏమీ లేదు…మన దగ్గర స్టేత్స్మెన్లూ లేరు.

ఇది ఆలోచించవలసిన అంశం!

~~~***~~~

వేట సాగుతూనే ఉంటుంది, వేటు పడుతూనే ఉంటుంది. ప్రస్తుతం పాకిస్తాన్ నీతిమాలిన శాసనం వలన,ఈ దుర్మార్గుల వలన ప్రాణాలు కోల్పోయిన వారిని తలచుకుంటే మటుకు ఎంతో బాధగానే ఉంటుంది.

రాజులు భవనాలలో కూర్చుని పులిజూదం ఆడుకుంటే సరిపోదు. అప్పుడప్పుడు అలా వెళ్లి జనబాహుల్యం లోకి వచ్చి భయ పెడుతున్న క్రూర జంతువులను వేటాడాలి. ఎవరూ రారులే అని చరిత్రలో కళ్లు మూసుకుని పడుకున్న వారెవరూ బాగు పడలేదు.

 ~~~***~~~

The art of life is not only to eat but also to avoid getting eaten…

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘ వేట ‘- వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: