01.03.2009 నుంచి 07.03.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


 

 

శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్త కళ్యాణగుణాభిరామ:
   సీతాముఖాంభోరుహ చంచరీక: నిరంతరం మంగళమాతనోతు!

01.03.2009 నుంచి 07.03.2009 వరకు రాశి ఫలాలు:

ఈ వారం రవి కుంభం లోనూ, బుధుడు మకర కుంభాలలోనూ, గురు కుజ రాహువులు మకరం లోనూ, శుక్రుడు మీనంలోనూ, శని సింహంలోనూ, కేతువు కర్కాటకంలోనూ, చంద్రుడు మేష, వృషభ మిథున రాశులలోనూ సంచరిస్తారు.

కుంటుతున్న వ్యాపారాలు కొద్దిగా మెరుగు పడే వారం. స్త్రీలకు విశేష ఫలితాలు ఉందగలవు. కొన్ని సమస్యలు చర్చల ద్వారా పరిష్కరించుకొనవచ్చును. డబ్బు చేతికి వచ్చినా కొత్త ఋణాలు చేస్తారు. వృధ్ధులు ప్రయాణాలు తగ్గించి ఆరోగ్యం చూసుకోవటం మంచిది.విదేశ వ్యవహారాలు కలవర పెడతాయి.

మేష రాశి: అన్ని విధాలా మంచి వారం. వారం మధ్యలో పైకం చేతికి అందగలదు.జీవిత భాగస్వామి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవలసిన అవసరం ఉంది. చిన్నారుల పురోగతి బాగుంటుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

వృషభ రాశి:కొత్త పనులు చేపదతారు. కార్యాలయం లో మార్పులు, మాట పట్టింపులు ఉండగలవు. బంధువుల నుండి శుభ వార్తలు వినగలరు. వారాంతం లో నిర్ణయం తీసుకోవలసిన విషయాలు చర్చల ద్వారా ముందుకు వస్తాయి. శివునికి అభిషేకం చేయించండి.

మిథున రాశి:ఈ వారం నూతన ఉత్సాహం తో ముందుకు వెళతారు. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కాగలవు. అజీర్ణం కొదిగా బాధిస్తుంది. ఇంటిలోని పనివాళ్లతో జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్య కవచం పఠించండి.

కర్కాటక రాశి: లోకమంతా తాత్వికంగా కనిపిస్తుంది. అంతా తాత్కాలికమైనా బాధ్యతలు నిర్వహించే తీరు శాస్వతమైనది అని గ్రహించాలి. విమర్శలకు గురి కాగలరు. సూర్యోపాసన చేయండి.

సింహ రాశి: వ్యాపారం బాగుంటుంది. గతంలో చేసిన మంచి పనులకు ఈ వారం మంచి ఫలితం కనపడుతుంది. ప్రయాణాలు వద్దు. ఓర్పుతో వ్యవహరిస్తే మరిన్ని సత్ఫలితాలు పొందగలరు. సోమవారం రోజున శివాలయం సందర్శించండి.

కన్య రాశి: దైవానుగ్రహం పొందుతారు. మనసును ఎన్నో ఆలోచనలు కదిలిస్తున్నాయి. ముఖ్యమైనవి ఎంచుకోండి. సమయం వృధా కాకుండా చూసుకోండి. మీ నుంచి అందరికీ ఎన్నో ఆశలు! జాగ్రత్తగా వ్యవహరించండి. హనుమాన్ చాలీసా చదవండి.

తుల రాశి: మీరు ఉత్సాహం ఎందుకు చూపటం లేదో ఇతరులకు అర్థం కాదు. కాకపోతే మీ ఆలోచనా విధానం కొంత మారే సూచనలున్నాయి. బంధు వర్గం లోని స్త్రీలతో కొన్ని చర్చిస్తారు. మీ లాగే అందరూ ఎందుకు ఆలోచించాలి అనిపిస్తుంది. శుక్రవారం మంచి వార్త వింటారు. లలితా సహస్రనామం చదవండి.

వృశ్చిక రాశి:అనవసరమైన ఆశలు వద్దు. ఈ వారం గడచిన తరువాత పెట్టుబడుల గురించి యోచించండి. మీ సహాయంతో మిత్రులు లాభం పొందుతారు. స్త్రీలతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త వహించాలి. విద్యార్థులు మరింత శ్రధ్ధ చూపాలి. శ్రీ సూక్తం పారాయణ చేయండి.

ధను రాశి: మంచి ఫలితాలు ఇచ్చు వారం. ఇంటిలో అందరికీ ఏదో సేవ చేసి చూపిస్తారు! వివాహం కాని వారికి వివాహం నిర్ణయం అవుతుంది. కార్యాలయాలలో పనులు మందగిస్తాయి. పెద్ద వారిని సేవించుకుంటారు. ఆదిత్య హృదయం చదవండి.

మకర రాశి: బంధువులు తలుపు తడతారు. మీ ఇంటి విషయంలో మంచి వార్త వింటారు. వారంతంలో ప్రయాణం తప్పదు. పాత వస్తువులు అమ్మేసి కొత్తవి కొంటారు. ఆదాయం బాగుంటుంది. కీళ్ల నొప్పులున్న వారు జాగ్రత్త వహించాలి. శివునికి అభిషేకం చేయించండి.

కుంభ రాశి: మీ ప్రతిభ ప్రజలలోకి వస్తుంది. ప్రయోగాలకు, సంప్రదాయ పరమైన వాటికీ మధ్య ఊగిసలాడతారు. ఈ కాలంలో సంప్రదాయమే ప్రయోగంలా కనిపించగలదు! ఆలోచించండి. కాగితాల మీద సంతకాలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు చదవండి. దుర్గా సప్తశ్లోకీ చదవండి.

మీన రాశి: ఊరకే పొగిడే మిత్రులతో సమయం వృధా చేయటం వలన ఉపయోగం ఏమీ లేదు. భూ వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. స్థాన చలనం ఉందగలదు. పెద్దల వద్ద సలహాలు అడగండి. పాటించండి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

ఈ వారం మంచి మాట:

శ్లో: సర్పాన్ కుశాగ్రాణి యథోదపానం ఙ్ఞాత్వా మనుష్యా: పరివర్జయంతి
     అఙ్ఞానత: తత్ర పతంతి కేచిత్ ఙ్ఞానే ఫలం పశ్య యథా విశిష్టం
(మహాభారతం)    
తెలియక సర్పములకు, నూతులకు (బావులకు), కంటకములకు గురియై కష్టములను అనుభవింతురు. తెలివిగల మానవులు తప్పుకొని ఆ అనర్థమును వారించుకొందురు.

ఓం శాంతి: శాంతి: శాంతి:

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “01.03.2009 నుంచి 07.03.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: