ఓ’స్కార్ ‘-వేదాంతం శ్రీపతి శర్మ


 

 

స్లం డాగ్ అనుకున్నంత పనీ చేసింది! ఓ-‘ స్కార్ ‘ కాదు చాలా తెచ్చింది. తెచ్చుకున్న వాటికి అందరికీ అభినందనలు కూడా తెలుపుదాం. తప్పు లేదు. ఎవరి శ్రమ వారిది. ఐ-న్యూస్ లో రచయిత కస్తూరి మురళీకృష్ణ గారు బాధ పడుతూ ఒక్క ప్రక్క పాపం చాలా వ్యాఖ్యానిస్తూ ఉన్నారు. ఒక ప్రక్క ఆ సినిమా తాలూకు క్లిప్పింగులు అలా సాగిపోతూనే ఉన్నాయి. అవార్డులు వస్తే ఇది మన మీద ఒక ‘క్రూయల్ జోక్ ‘ కాగలదని కూడా ఆయన అనేశారు. అది అలా కొనసాగిపోతూనే ఉంది.ఏదో జరిగినంత మాత్రాన నిజం చెప్పకుండా ఉండటం సరైనది కాదు. నిజం చెప్పాలి. ముఖ్యంగా రచయితలకు అంతరార్థం ముందు స్ఫురించటం వలన ముందుగా, తొందరగా బాధ పడతారు. ఏమిటి నీ గోల అని అనుకుంటారు…ఇదా నీ బాధ అనే లోపు అంతా అయిపోతుంది! ఆర్థర్ స్కోపెణవర్ ఒక మాట అన్నాడు. సత్యమనేది మూడు దశల మీదుగా ప్రయాణిస్తుంది. మొదటిది దానిని అందరూ నవ్వుల పాలు చేస్తారు. రెండు, దానిని విపరీతంగా ఖండిస్తారు. మూడు, ఇది వాస్తవానికి స్వయంప్రకాశమై వెలుగుతోందని ఒప్పుకుంటారు. ఈ అవార్డులు వెలుగుతున్నాయి-నిజం కూడా వెనుక తదుపరి చరిత్రలో వెలుగుతుంది!

~~~***~~~

అదలా ఉంచుదాం. రైల్ లోంచి  కరంచంద్-కర్మసిధ్ధుడు తోసేయబడ్డాడు. సత్యాగ్రహం అనేది పుట్టింది…

కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆంగ్లేయుడు ఒక మాట అన్నాడు. ముంబయి లోని పాల కంటే లండన్ లోని డ్రైనేజ్ నీరు ఉత్తమమైనది అని! ఈ మాట కురియన్ గారి గుండెకు బాణంలా గుచ్చుకుంది. గుజరాత్ లో ఆయన సాధించినది అందరికీ తెలిసినదే!

~~~***~~~

స్వాతంత్ర్యం రాక ముందు మకాలే (లార్డ్ అని నేను అనను. వీళ్లెవరు?)
భారత దేశపు నలు మూలలా తిరిగి ఒక నివేదికను సమర్పించాడు. అందులో ఉన్న మొదటి మాట-ఈ దేశంలో పేదరికం ఉండవచ్చు
 కానీ గరీబులు ఎవరూ లేరు!వీరి ఆత్మాభిమానం ఎనలేనిది. వీరి ఆత్మాభిమానాన్ని దెబ్బ తీయాలీ అంటే వీరికి స్వంతం కాని భాష-ఆంగ్లం లో శిక్షణ
 ఇచ్చి అది రాని వారు తక్కువగా చూడ బడేటట్లు చేయాలి….ఆ పథకం లో ప్రవేశ పెట్టిన ఈ విద్యా వ్యవస్థ ఈ నాటికీ
 ఆంగ్లేయుల విజయపు బావుటా ఎగురవేస్తూనే ఉంది.

ముసుగులో గుద్దులాటలు మాని గడచిన చరిత్ర లోంచి ఇవతలకి వచ్చి డాబా మెట్లు ఎక్కి నిజమైన ఆకాశం లోకి ఒక సారి చూద్దాం.చూడలేకపోవటం బానిసత్వం! హృదయ విదారకం!

~~~***~~~

పడ్డ వాడు చెడ్డ వాడు కాడు. వాళ్లను, వాళ్ల సినిమాలను ప్రక్కన పెడదాం. శేక్స్పియర్ ఆఫ్ ఇండియా అని కాళిదాసును అనటం కాదు. మన దేశాన్ని మనం పునర్నిర్మిద్దాం. మన అద్వితీయమైన, అజరామరమైన సంస్కృతి నుంచి ఒక అవార్డును మనం ప్రకటించి వాళ్లకి ఇద్దాం…

~~~***~~~

మరో తరంలోనైనా ఇది జరిగితే నేను ఎక్కడున్నా
 మన జెండాకు వందనం చేసుకుంటాను. మన యువకులు సిధ్ధమా?

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

8 thoughts on “ఓ’స్కార్ ‘-వేదాంతం శ్రీపతి శర్మ

 1. కుల రాజకీయాలు నిర్మూలించబడిన మరుక్షణం మీరు కోరుకున్నది సాధ్యమే
  రిజర్వేసన్లు ఎత్తివేసిన నాడు మీరన్నది సాధ్యమే
  వ్యక్తిగత పొగడ్తల కోసం సినిమా తీసేవారు అలాగే వారి భట్రాజు గణాలు పోయినప్పుడు మీరన్నది సాధ్యమే
  ఏదేమైనా … ఆ గమ్యానికి రహదారి వెయ్యాల్సిన భాద్యత నేటి తరానిది అంటే మాది, ముందు తరం వారి సలహాలు సూచనలు సహకారాలు ఉంటే ఎంత దూరమైనా దూసుకుపోతాం

 2. ఇలాంటి సినిమాలు కావాలని భారతీయులని అవమానించడానికే తీస్తారేమోనని నా అనుమానం.
  పదేళ్ళ కిందట ఫైర్ సినిమా చూసాను. అందులోనూ అంతే. మనం టాయిలెట్లలో జంతువుల్లా కూర్చుంటామట.
  అప్పుడే నిర్ణయించుకున్నాను. ఈ బాపతు సినిమాలు చూడను అని.

  అరింధం చౌధరి అభిప్రాయాలు కూడా చదవండి.

  ఇంత కంటే మన లగాన్, చక్ దే ఇండియా, స్వదేశ్ మొదలైనవి ఉత్తమమైనవని నా అభిప్రాయం.
  ఆఖరుకి యండమూరి చిరంజీవి ల చాలెంజ్ కూడా ఈ సినిమా కంటే బెటరు.

 3. మీ శైలి బాగుంది.
  మనకున్న సంస్కృతిక వారసత్వ సంపదని ఆస్వాదిస్తూ వైభవోపేతంగా చూసుకోవడమే గాక, ఒకనాడు సకలప్రపంచానికి మార్గదర్శకమైన ఆలోచనలకీ సిద్ధాంతాలకీ పురిటి గడ్డయిన భారత దేశాన్ని మళ్ళీ నిర్మించుకుందాం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: