బీర్ బల్, వంకాయ,హిల్లెరీ క్లింటన్!-వేదాంతం శ్రీపతి శర్మ


బీర్బల్ గురించి చిన్నప్పుడు ఒక కథ చదివాను. అక్బర్, బీర్బల్ కలసి ఒక పొలంలో నడుచుకుంటూ వెళుతున్నారు.అక్బర్ వంగ తోట వైపు చూసి ” ఆహా, ఈ వంకాయ బలే ఉంది బీర్బల్, అసలు ఆ రంగు విలక్షణంగా ఉంటుంది. వన్లాయ అంటే వంకాయే కదా?”, అన్నాడు. బీర్బల్ ” బలే సెలవిచ్చారు. నిజమే. నేనూ ఎన్నడూ గుర్తించలేదు జాహాపనా, నిజంగా వంకాయ చాలా గొప్పది. చిత్రంగా ఉంటుంది”, అన్నాడు.
ఇద్దరూ కొంత దూరం నడిచాక అక్బర్ మరో వైపు చూసి, ” బీర్బల్, నాకెందుకో ఇంకో ఆలోచన వస్తున్నది. అసలు ఈ వంకాయకు ఒక ఆకారం, ఒక తిన్ననైన రంగు ఉండవు. ఈ వంకాయ చిత్రమైనది కాదు బీర్బల్, అసలు ఏ కోవకూ చెందనిది. వంకాయ లాభం లేదు బీర్బల్!”, అన్నాడు.
బీర్బల్,” నిజమే జాహాపనా! నేను కూడా తొందరలో ఏదో అనుకున్నాను కానండీ, ఏముందండీ వంకాయలోనూ? అందరూ అలా అనుకుంటారు గానీ…వంకాయ అసలు ఆరోగ్యానికి కూడా అంత మంచిది కాదని హకీం చెప్పాడు!”, అన్నాడు.
అక్బర్ నవాడు.” ఇదేంటి బీర్బల్, ఇంతాక అలా అన్నావు, ఇప్పుడు ఇల్లా అంటున్నావు?, ఇదేమీ బాగాలేదు”, అన్నాడు.
బీర్బళ్ ” ఏముంది జహాపనా, నాకు మీతో చాలా పనుంచ్ది. వంకాయ ఏముంది, బాగుంటే బాగుంది, లేకపోతే లేదు! ”

~~~***~~~

హిలరీ క్లింటన్ గారు చైనా, జపాన్ దేశాలు పర్యటించారు. చైనా వారితో మానవ హక్కుల ఉల్లంఘనల గురించి మాట్లాడండీ అని చాలా మంది గట్టిగా అరిచారు. మామూలుగానైతే అక్కడికి వెళ్లిన ప్రతి అమెరికా తరఫు మనిషీ ముందుగా ఆ పనే చేస్తాడు. అదే జరుగుతుంది అనుకున్నారు. అదేమీ జరగలేదు. ఆవిడ అక్కడ కూర్చుని దాదాపు వాళ్ల గెడ్డాలు పట్టుకుని వ్యాపార సంబంధ విషయాలలో సహాయాన్ని కోరి ఇవతలకి వచ్చింది. ఇవతలకు వచ్చాక పాత్రికేయులు ” మానవ హక్కులు? “, అన్నారు. ఆవిడ ” మానవ హక్కులు ఎల్ల వేళలా
అమెరికా ఎజెండాలో ఉంటూనే ఉంటాయి” అని జెండా ఎగురవేసింది…
నిజమే! అలా పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే వాళ్లు అటు వేలు చూపించి ” ద్వారము తెరచియే ఉన్నది” అని చెప్పే వారు. ఎవరి అవసరాలు వారివి.

~~~***~~~

అదలా ఉంచండి. వాషింగ్టన్ పోస్ట్ లో ఒక చక్కని
వార్త వచ్చింది. అంతర్జాతీయ న్యాయమూర్తుల, న్యాయవాదుల సంఘం అమెరికాతో పాటు బ్రిటన్ తదితర దేశాలను తీవ్రవాద పోరాటం ముసుగులో జరుగుతున్న శారీరిక హింసలు, వివిధ పధ్ధతులను ఎత్తి చూపి తీవ్రమైన మానవ హక్కుల ఉల్లంఘనలు 2001 వ సంవత్సరం నుంచి జరుగుతున్నాయని చెబుతున్నది. అంతర్జాతీయ జ్యూరిస్టుల కమిషన్ లో సభ్యుడైన ఆర్థర్ చస్కల్సన్ (పూర్వం దక్షిణాఫ్రికా ప్రధాన న్యాయమూర్తి)మూడేళ్లుగా జరిపిన ఈ అధ్యయనం మీద వ్యాఖ్యానిస్తూ తీవ్రవాదం మీద తొందరపాటు చర్యలను చేపట్టటం వలన సరిక్రొత్త సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు.
గువాంతనామో (క్యూబా) లో అమెరికా నడుపుతున్న మిలిటరీ బేస్ లో జరిగే ఇంటరగేషన్ పధ్ధతుల లాంటివి మంచివి కావని ఎం.15 తరఫున రిమింగ్టన్ అనే ఆమె పేర్కొన్నది. ఇటువంటి చర్యల వలన ఆత్మాహుతి దళాలు ఎక్కువగా తయారయ్యా రని తీర్మానించింది.
తీవ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు ఎటువంటి చర్యలు తీసుకోవాలీ అనే అంశం మీద మంచి చర్చలు జరుప వలసిన అవసరం ఉన్నది.
కాకపోతే అమెరికా తన ముక్కు వంకర ముందుగా సరి చేసుకోవాలి.ఎంతసేపూ క్రింద పడ్డా ఇంకొకరి మీద చేయి పెట్టటం కాదు!

~~~***~~~

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “బీర్ బల్, వంకాయ,హిల్లెరీ క్లింటన్!-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: