చిరంజీవి గారికి 2009లో ఎలా ఉంది?


చిరంజీవి గారు 22 ఆగస్ట్ ఉదయం 10.10 గంటలకు నర్సాపురం లో జన్మించినట్లు తెలుస్తున్నది.
చిత్త నక్షత్రం, కన్య రాశి, తుల లగ్నం ,శుభ యోగం.

ఈ వివరాలు సరైనవి అయితే ఒక విశ్లేషణ చేసి చూద్దాం:

మంచి ఆదర్శాలు, ముందుకు దూసుకుపోయే గుణం, ఆకట్టుకునే కళ్లు చెప్పదగిన లక్షణాలు.

ఊపిరితిత్తుల సమస్యలు ఉండవచ్చు. జాగ్రత్త వహించాలి.
మానవ సంబంధాలలో మంచి అవగాహన, న్యాయం కోసం పోరాడే గుణం, కొద్దిగా ముందుచూపు…ఇలాంటివి బాగున్నాయి. చాలా సార్లు సహజమైన తర్కానికి దూరంగా ఆలోచనలు సాగిపోతాయి!

యోగకారకుడైన శని లగ్నంలో ఉచ్చ రాశిలో ఉండటం విశేషం. మంచి ఆత్మ విశ్వాసం కనబరుస్తారు.కొన్ని అవకాశాలు జారవిడుచుకోవటం కనిపిస్తున్నది.

చిన్నతనంలో ఆరోగ్యం కొద్దిగా ఇబ్బంది పెట్టిందేమో అనిపిస్తున్నది.

రెండులో రాహువు ఉన్నప్పిటికీ గురు దృష్టి వలన సమస్య అంతగా లేదు. తృతీయాధిపతి దశమంలో ఉండుట చేత సోదరులందరి వలనా లబ్ధి పొందే జాతకం. వారు కూడా అభివృధ్ధి చెందగలరు (గురువు కర్కాటకంలో ఉచ్చ రాశిలో ఉన్నాడు)

శని చతుర్థాధిపతి కావటం వలన ప్రజల మధ్య మాట్లాడేటప్పుడు కొద్దిగా సమస్యలను ఎదుర్కొంటున్నట్లు తెలుస్తున్నది. అలాగే శని పంచమాధిపతి కూడా అయి లగ్నంలో ఉండటం వలన ప్రజలు ఈయన దగ్గర న్యాయం కోరుతున్నారని తెలుస్తున్నది. ఈయన న్యాయం ఇవ్వగలడని కూడా చెప్పవచ్చును!

తాత్వికపరమైన, మతపరమైన విషయాలలో శ్రధ్ధ కొద్దిగా తగ్గినట్లు చెప్పవచ్చును.

నవమాధిపతి ఏకాదశంలో మిత్ర రాశిలో ఉండటం ఈయనకు అద్భుతమైన యోగం-ఎంతో పవర్, పేరు, మంచి మిత్రుల వలన లాభం ఇలాంటివి ఉన్నాయి. కాకపోతే స్వస్థానంలో ఉన్న రవి, మిత్ర రాశిలో ఉన్న కుజుడు బుధునితో కలవటం వలన వేధ సమయంలో మిత్రులు- వారు మోసం చేసే అవ్కశాలు ఉన్నాయి…

చదువుకున్న వారి పట్ల గౌరవం, వారి శ్రేయస్సు కోసం శ్రమించటం కూడా కనిపిస్తున్నాయి. సుఖమయమైన దీర్ఘాయుష్షు ఉన్నది. చేపట్టిన కార్యాలలో ఊహించని విధంగా మంచి ఫలితం దొరకగలదు. ఈయనను నిలబెట్టేది ఈయన క్లీన్ ఇమేజ్! జాతకంలో ఆదర్శాలను పణంగా ఏ రోజూ పెట్టరని తెలుస్తున్నది. ఇది చెప్పుకోదగ్గ విషయమే!

ఈయన కనిపించేదానికి భిన్నంగా ఒంటరితనాన్ని కోరుకునే వ్యక్తి!

~~~***~~~

ఇదంతా ఒకెత్తు. దశదిశలను చూద్దాం.

1977లో గురు మహర్దశ ప్రారంభమినది. గురువు ఈ లగ్నానికి మిత్ర గ్రహం కాకపోయినా దశమాంలో ఉచ్చ రాశిలో యుండుట చేత ఈయన వృత్తి పునాదులను నాటుకున్నది-ఉగ్రం గల పాత్రలు, అలాగే విలన్ పాత్రలు పోషించారు. ఇదేంటి? గురువు కదా ఇలా ఎందుకు జరిగింది అంటే అదే జ్యోతిషం లోని విచిత్రం. గురువు అందరికీ శుభ గ్రహమే! దశమం కర్మ స్థానం. అది ముందుకు పనికొచ్చే కర్మయే ఆ గ్రహం యొక్క అనుకూలత, ప్రతికూలతను బట్టి చేయిస్తుంది…
1979 నుంచి జనవరి 1982 వరకు కొన్ని అనుకోని సంఘటనలు జరిగి ఉండవచ్చును. అలాగే ఆంతరంగిక ఆలోచనా విధానాలలో ఒక సంచలనమైన మార్పు కూడా ఏర్పడి ఉండవచ్చును.ఈయనలోని అసలు హీరో శని. గురువు కాదు. శనియే రాజకీయాలలో కూడా సత్ఫలితాలను ఇవ్వబోతున్నాడు!
1982 నుంచి డిసెంబర్ 1988 వరకు ఎదురు లేని వ్యవహారం. కానీ గురు మహర్దశలోని చివరి భాగం-కుజ, రాహు భుక్తులలో సినిమాలు రాణించకపోవటం కనిపిస్తున్నది.
మే నెల 1993 నుంచి శని మహర్దశ ప్రారంభమైనది. ఈ సమయంలో రాజకీయాలలోకి వెళ్లాలనే ఆలోచన వచ్చి కూడా ఉండవచ్చును. ఆహ్వానాలు కూడా వచ్చి యుండవచ్చును. కాకపోతే అప్పటి గోచారం లో రాహు, గురువుల స్థితులు దోహద పడలేదు.

ప్రస్తుతం రాహు మహర్దశలో ఈయన రాజకీయాలలోకి ప్రవేశించారు. ఈ ప్రవేశం అందుచేత కొన్ని అవాంఛిత సంఘటనలతో జరిగినది. జాతకంలోని యొగాలతో పార్టీ పెట్టిన ముహూర్తాన్ని జక్స్టపోస్ చేసి పెట్టలేదనిపిస్తున్నది. జాతకుని లగ్నానికీ, ముహూతంలోని లగ్నానికీ సామాన్యంగా ఇటువంటప్పుడు వేధ అనేది ఉండకూడదు.

ప్రస్తుతం శని మహర్దశలోని రాహువు భుక్తిలోని శుక్రుని ప్రత్యంతర్దశలో బుధుని సబ్ పీరియడ్ లో ఎన్నికలు జరుగబోతున్నాయి. కానీ 28 ఏప్రిల్ 2009 తరువాత జరిగే ఎన్నికల తేదీలు లాభసాటిగా ఉండగలవు…

గోచారం చూస్తే గురువు పంచమంలో నీచ అయి రాహువుతో అవయోగంలో ఉన్నాడు. శని ద్వాదశంలో ఏలినాటి శని ప్రారంభంలో ఉన్నాడు. కేతువు ఏకాదశంలో ఉన్నాడు. శని మహర్దశ (శని ఉచ్చ రాశిలో ఉన్నా యోగకారకుడై ఉన్నా అతని మహర్దశలో ఉన్నా ఏలినాటి శని అనుకోని యోగం ఇవ్వగలదు!)

ఇదీ పరిస్థితి.

ఈయనకు కాలసర్ప దోషం ఉన్నది. ఇది శ్రీకాళహస్తిలో నివారణ ఇప్పటి వరకూ చేయించకపోతే ఇప్పుడైనా చేయించుకుంటే ఇది యోగంగా మారగలదు. సామాన్యంగా రాహువు లేదా కేతువు దశలో ఈ నివారణ చేయించటం జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు నడుస్తున్నది రాహువు భుక్తి.

మరో సారి పునరావలోకనం చెస్తే చిరంజీవి గారికి ఆయన ప్రాంతంలో, అనుకోని విధంగా ఉత్తరాంధ్రలో మంచి లాభాలు కనిపిస్తున్నాయి. నేను మునుపు చెప్పినట్లు ఎన్నికల తేదీలు తుది నిర్ణయం చెప్పగలవు!

కొద్దిగా జాగ్రత్తగా పరిశీలిస్తే ఎక్కువ మంది పోటీలలో ఉన్న చోట్ల ఈయనకు విజయం కనిపిస్తున్నది. ఇతరులు సీట్ల అద్జస్ట్మెంట్లు చేసుకోకపోతే గెలుపు ఈయనది. ఎన్నికల తరువాత ఎవరు ఎవరిని సపోర్ట్ చేస్తారో తేల్చుకోలేకపోతే కూడా గెలుపు ఈయనదే!

చిరంజీవి గారు దుర్గా సప్తశతి పారాయణ చేస్తూ నీలం రంగు స్కార్ఫ్ ధరిస్తే మరో సారి పొలిటికల్ తెర మీద జెండా ఎగురవేయ గలరు!

(ఇవి రచయిత జ్యోతిషపరంగా చెప్పిన వ్యక్తిగతమైన అభిప్రాయాలు మాత్రమేనని అందరికీ సవినయంగా మనవి!)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “చిరంజీవి గారికి 2009లో ఎలా ఉంది?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: