‘నిప్పు-వెలుగు’-వేదాంతం శ్రీపతి శర్మ


వేదాలలో ఒక కథ ఆలోచింప చేస్తుంది. ఒక రాజ్యం లో చాలా కాలంగా వానలు కురవకుండా ప్రకృతి బాధిస్తూ ఉంటుంది. దానికి రాజు వరుణ దేవ్డికి రోజుకొక యువకుని బలిగా సమర్పించుటకు నిర్నయిస్తాడు. అలా కొందరు వరుణుని పాలు పడ్డారు. ఒక రోజు ఒక బ్రాహ్మణుని ఇంటికి రాజ భటులు వచ్చారు. అతని ఇంటిలోని ముగ్గురు కుమారులలో ఒకరిని సమర్పించమని అడిగారు. తండ్రి పెద్ద కొడుకు అంటే ఇష్టం కాబట్టి వదలని అన్నాడు. తల్లి చివరి వాడు నా వాడు అంది. మధ్యముడు మారు మాట్లాడలేదు. తల్లి దండ్రులకు నమస్కరించి భటులతో బయలుదేరాడు. దారిలో అతని మనసు జీవిత సత్యాల కోసం తపించింది. ఏది నిత్యం, ఏది శాశ్వతం, ఏది సత్యం, ఏది అసత్యం…వరుణునికి సమర్పింపబడే ముందు ఒక్క సారి ఇంద్రుని ప్రార్థించి ఈ ప్రశ్నలనే అడిగాడు. ఇంద్రుడు ప్రసన్నుడైనాడు. ఆ కుర్ర వానికి వరుణుని ప్రసన్నుని చేసుకొనే మంత్రం ఉపదేశించాడు. (‘ఇమం మే వరుణ శృథీ హవ…’-సాయం సంధ్యలో ఈ నాటికీ సూర్యోపస్థాన మంత్రం క్రింద చెప్పుకునే మంత్రం ఇది)
జీవిత సత్యాల వైపు ఆలోచన, ఆత్మ సాక్షాత్కారం వైపు నడక సాగనప్పుడు పరోక్షంగా దైవం ఒక పరిస్థితిని సృష్టించి మనిషిలోని అంతరాత్మను కదిలించి ఒక తత్వాన్ని తానే బయట పెడుతుంది.

~~~***~~~

మర్విన్ జోన్స్ అనే రచయిత ‘ నో టైం టు బి యంగ్ ‘ అనే నవల ఒకటి వ్రాశాడు.
ఇందులో కూడా ముగ్గురు పిల్లలు ఒక ఇంటిలో ఉంటారు. ప్రపంచ యుధ్ధం సమయం లో ఇంటికి ఒకరు సైన్యం లొ చేర వలసిన పరిస్థితి. ఇలాగే పెద్ద కొడుకు, చివరి కొడుకు తప్పించుకుంటారు. మధ్యముడు సైన్యం లొ చేరి చాలా ఒడి దుడుకులు సహించి చివరికి ఊరు చేరతాడు. ఆ సమయానికి ఊరంతా విచ్చల విడిగా అరాచకాలతో నిండి ఉంటుంది. ఇతను సైన్యం లో నేర్చుకున్నవన్నీ ఆ ప్రజలకు నెర్పించి అక్కడ యువతకు స్ఫూర్తినిచ్చి ఊరుని బాగు చేయటం కనిపిస్తుంది.

~~~***~~~

మడ్రాస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో స్కాలర్షిప్ మీద ఒక విద్యార్థి చదువుకుంటున్నాడు. అతనికీ, ఇద్దరు తోటి విద్యార్థులకూ కలిపి ఆ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఒక డ్రాయింగ్ ప్రాజెక్ట్ ఇచ్చాడు. అది సహచరుల సహాయం లేకపోవటం వలన ఆలస్యం అవుతున్నది. స్కాలర్షిప్ ఆపేశారు. ఆ కుర్రాడు క్లాసు బెంచీ మీద బయట పడుకున్నాడు. తీవ్రంగా ఆలొచించాడు. ఇది ఒంటరిగానే ఎందుకు చేయకూడదు? ప్రశ్నించుకున్నాడు. ఆ ఇద్దరూ వెతికి ఇవ్వవలసిన డేటా యావత్తూ తనే సంగ్రహించాడు. పగలు రాత్రి కష్ట పడ్డాడు. కావలిసిన డ్రాయింగ్ తయారు చేసి బెంచీ మీదనే నిద్ర లేకుండా కూర్చుని ఉన్నాడు. తెల్లవారు ఝామున డైరెక్టర్ గారు టెన్నిస్ ఆడటానికి వెళుతూ అతన్ని చూశాడు. డ్రాయింగ్ చూసి ఆశ్చర్యపోయాడు. దానిని భారత ప్రభుత్వానికి పంపారు.స్కాలర్షిప్ ఒకటే అక్కడ నిలబడ లేదు. దేశానికే ఒక మేధావి లేచి నిలబడ్డాడు-ఆయనే మన మాజీ రాష్ట్రపతి డాక్టర్ అవుల్ పకీర్ జైనులాబుదీన్ అబ్దుల్ కలాం!

~~~***~~~

‘అ అమ్మ కంటే ఆ ఆకలి ‘ అనేది ముందు చూసిన వారి ముందు చూపుతో ఈ దేశం నడుస్తోంది. జఠరాగ్నిని ఆగ్నేయాస్త్రం గా మలచగలిగే మహనీయుల నేల ఇది. జీవన్ మృత్యువుల మధ్య వ్రేలాడుతున్న కత్తి క్రింద నిలబడి యస్, నీవల్లనే నాకు వెలుగు…కాదు, నేనే వెలుగునని పలికిన వారి గడ్డ ఇది…
~~~***~~~

నేషన్ బిల్డింగ్ అనేది మనలో ఒక జఠరాగ్నిగా రగులుకోవాలి. ఒక తీవ్రమైన ఆకలి దహించివేయాలి. కలాం గారి మాటలలోనే మన చరిత్ర మీద సమానంగా అందరికీ అభిమానం, భవిష్యత్తు మీద సమానమైన ఆలోచన రావలసిన అవసరం ఉంది. ఒక్క సారి ఒకే లాగ అందరూ వెలగాలి…

~~~***~~~

అఘమర్షణ సూక్తం చెబుతుంది-‘అహమస్మి, జ్యోతిరహమస్మి, బ్రహ్మా అహమస్మి!’

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘నిప్పు-వెలుగు’-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: