చంద్రబాబు నాయుడు గారికి 2009 ఎలా ఉంది? -వేదాంతం శ్రీపతి శర్మ


చంద్రబాబు నాయుడు గారు 28 ఫిబ్రవరి 1952 11.32 కి జన్మించారని తెలుస్తున్నది. ఈ వివరాలు ఎంత కరెక్ట్ అనునది ధృవీకరించటం కష్టం. కాకపోతే గతం లో నేను చెప్పినట్టు పబ్లిక్ గా మనకి తెలిసిన సంఘటనలను జాతకం తోనూ, దశలతోనూ పొల్చుకోవటం మంచి పధ్ధతే.

జాతకం లోకి వద్దాం.

ఈయన లగ్నం (వృషభం) తిన్నగా మొండితనాన్ని సూచిస్తుంది. ఆత్మ విశ్వాసం ఎక్కువ పాళ్ళు.గురుత్వ శక్తి ఎక్కువగా పని చేస్తుంది.ప్రతి విషయం లోనూ స్వంత ఆలోచనలు, అభిప్రాయాలూ సిధ్ధంగా ఉంటాయి. విపరీతమైన కృషి చేయగల సమర్థులు.

లగ్నాధిపతి శుక్రుడు నవమం లో యుండుట చేత దైవబలం బాగున్నది. తృతీయాధిపతి చంద్రుడు ఏకాదసం లో యుండుట చేత శరీర వ్యవస్థ కొద్దిగా చిత్రం గా ఉన్నది. చతుర్థాధిపతి రవి బుధునితోనూ రాహువుతోనూ కలవటం రాజకీయ రంగం లో మంచి విజయాన్ని చూపిస్తున్నది. నాలుగులో కేతువు జీవితం లో అనుకోని మార్పులను సూచిస్తోంది. సామాన్యం గా ఇలాంటి జాతకం వారికి అనుకున్నప్పుడు మరేదో జరిగి అనుకోనప్పుడు విచిత్రమైన్ రీతిలో విజయలు కనిపిస్తూ ఉంటాయి.

పంచమాధిపతి బుధుడు దశమం లో ఉండటం రాజయోగం! కానీ ఈ గ్రహస్థితి వలన ఎక్కడ ఈయన స్వంత నిర్ణయం తీసుకోవలో ఎక్కడ ఒక సలహా కోరాలో అనె విషయం లో విచక్షణ లోపించటం వలన ఇబ్బందులు ఎదురవుతాయి…

పంచమంలో యోగకారకుడైన శని కూర్చుని ఉన్నాడు. పంచమాధిపతి అయిన బుధుడికీ, దశమాధిపతి అయిన శనికి పరివర్తన యోగం విశేషం. ఇటువంటి యొగంలో దుష్ట గ్రహం రాహువు కలవటం ఇంకొక విశేషం. వ్యాపార రంగం, రైతు రంగం (ఐ.టి రంగం, భూ వివాదాలు) – ఈ రెండిటి మధ్య విధానాలలో సమన్వయం లేకపోవటం గురించి జాతకం సూటిగా చెబుతున్నది. ఈయన సిధ్ధాంతాలు కంపర్ట్ మెంట్ల లాగా ఏ గదికి ఆ గదే అనుకోవటం వలన సమస్యలలోకి వెళుతూ ఉంతారు.

ఆరులో కుజుడు ఎవరితోనూ సంబంధం లేకుండా ఉన్నాడు. ఒక నియంతృత్వ తత్వం దీని వలన కనిపిస్తున్నది. కానీ శుక్రుని ప్రభావం చేత చదువుకున్న వారి పట్ల, పెద్దల పట్ల ఒక గౌరవం కనిపిస్తున్నది.

ద్వాదశాధిపతి కుజుడు ఆరులో ఉండటం వలన ఈయన మీద ఉన్న అభియోగాలే ఈయనకు మంచి పేరు తెచ్చి పెడతాయి! ఈయన చేయవలసిన ప్రచారం ఈయన ప్రత్యర్థులు చేస్తూ ఉంటారు. కేసులు ఈయన చరమావస్థకు తీసుకుని వెళ్లి గెలవటం వలన ప్రత్యర్థులు తొందరపాటును గుర్తించి బాధ పడవలసి వస్తుంది…

2009 ఏమంటోంది?

ఈయనకు కుజ మహర్దశలో రవి భుక్తి మార్చ్ 13 నుండి ప్రారంభమవుతున్నది. బాలకృష్ణ గారి జాతకం గురించి చెప్పినప్పుడు ఈ జాతకాన్ని కూడా పోల్చి చూడాలని చెప్పి యున్నాను. ఇక్కడ పరివర్తన యోగం, రాజయోగం రెండూ ఆయన జాతకం లొ ఉన్న గ్రహాలతో ముడి బడి ఉండటం విశేషం. బంధువుల వలన మంచి లాభం పొందటం ఇక్కడా కనిపిస్తున్నది…

ఈయనకు ఈ ఎన్నికలలో స్త్రీలు మొగ్గు చూపబోతున్నారని స్పష్టంగా కనిపిస్తున్నది.

జాతకం లో ఉన్న యోగాలకు సంబంధించిన గ్రహాలు తిరిగి అవే యోగాలనిచ్చు గోచారం లో (చంద్రుని నుంచి) రావటం చేత పరిస్థితులు అనుకూలిస్తున్నాయి అని చెప్పవచ్చును.

కానీ…

ఈ యోగాలు ఎన్నికల తేదీలను బట్టి, ఏ ప్రాంతాలలో (దిశలలో) ఏ రోజు పోలింగ్ ఉంటుందీ అనే దాని మీద ఆధారపడి ఉంటాయి!

(ఇవి రచయిత జ్యోతిష పరం గా చెబుతున్న స్వంత అభిప్రాయాలు మాత్రమే)

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: