ఆన్ అకౌంట్ బడ్జట్-ఏ దారిలో?-వేదాంతం శ్రీపతి శర్మ


ఆన్ అకౌంట్ బడ్జట్ లో రెవెన్యూ డెఫిసిట్ జి.డి.పీ లో 1% బదులు 4.4%, ఫిస్కల్ డెఫిసిట్ 2.5% బదులు 6% (అంచనాలకు భిన్నంగా) మనకు కనిపిస్తున్నాయి.
పన్నుల వసూళ్లు కూడా తగ్గనున్నాయి. ఎరువుల రాయితీలు ఇలాంటివి తీసుకుంటే నాన్-ప్లాన్ వ్యయం, అలాగే రాష్ట్రాలకు పెంచిన అలాట్మెంట్ వలన ప్లాన్ వ్యయం పెరగటం కనిపించింది. మొత్తానికి మొత్తం వ్యయం 1,50,069 కోట్లు పెరిగింది.
దేసం ఆర్థిక స్థితి, ప్రపంచ ఆర్థిక స్థితిగతులను బట్టి కొత్త ప్రభుత్వం అదనపు ఫిస్కల్ విధానాలను చేపట్టవలసి ఉంటుందని మంత్రి గారు చెప్పారు. కొత్త ప్రభుత్వం ప్లాన్ వ్యయం ఎక్కువగానే పెంచవలసిన అవసరం ఉంటుంది అని చెబుతూనే దీని వలన ఫిస్కల్ డెఫిసిట్ మరల పెరుగనున్నదని ఆయన ఒప్పుకుంటున్నట్లు తెలుస్తున్నది.

అన్నీ పక్కన పెట్టి దేని మీద అందరికంటే ఎక్కువ ఖర్చు పెడుతున్నాము మాష్టారూ అంటే సమాధానం ఈ రోజు కలవర పెట్టేటట్లే ఉన్నది. అది-వడ్డీ!

కుంటుతున్న బాంకింగ్ వ్యవస్థ కోసం ప్రపంచ బాంకును అప్పు అడగాలని ప్రతిపాదించటం జరిగింది.

దీని భావమేమి? అయినా ఈ పరిస్థితులలో ఈ ఋణా
లు పెద్దగా అందుతాయనే ఆశ లేదు.

ఆన్ అకౌంట్ బడ్జట్ లో ఇంతకంటే చూపించగలిగినది పెద్దగా ఉండకపోవచ్చని పలువురూ అభిప్రాయ పడ్డా కొంత చేయగలిగినది చేయలేదనే అనిపిస్తున్నది…

బడ్జట్ అనేది ఒక రహదారి లాంటిది. ఇందులోకి ఎన్ని ఆర్థిక పరమైన అంశాలు వచ్చి ఈ ప్రయాణం లో నిలబడతాయి అనేది ఒక సారి చూడవలసిన అవసరం ఉంటుంది. ఈ అంశాలు ఒక దానికొకటి ముడి పడి యున్నవా? లేక ఆ ఒక్క దానికీ విడిగా ప్రణాలిక రూపొందించాలా అనే యోచన మరల చేసుకోవాలి. ఈ దారిలో ఎదుర్కొనబోయే సమస్యలకు ఏవి మనకు తోడుగా రాగలవు, ఏవి మనకే సమస్యలను సృష్టించగలవు అనేది ప్రస్తుత పరిస్థితులలో ఖచ్చితంగా చెప్పగల్గటం కష్టమైనా కొన్ని రంగాలను విస్మరించటం ఎందుకో అర్థం కాలేదు.

ఫైనాన్షీయల్ మేనేజ్మెంట్ లో ‘లివరేజ్ ‘ అనే మాట ఒకటి ఉంటుంది. దేని మీద మనం స్వారీ చేసి ఆవలి ఒడ్డుకు దాట గలం, ఏది మనలను తక్కువ సమయం, ఎక్కువ ఆదాయం లేదా సేవింగుల వలన ఒక లాభసాటి స్థితిలో నిలబెట్టగలదు అనేది ఎకనమిక్ మేనవరింగ్ ద్వారా ఏదైనా చూపిస్తారేమోనని నేనూ కొందరు మిత్రుల లాగా ఆశ పడి చూశాను. అయితే నేను ఎవరినీ తప్పు పట్టటం లేదు. ఇక్కడ మా తరం లో చూస్తున్న ఈ ప్రపంచ ఆర్థిక మాంద్యం చారిత్రకమైనదని నేను భావిస్తున్నాను. నేను రెండవ ప్రపంచ యుధ్ధం చూడలేదు, స్వాతంత్ర్య సమరం చూడలేదు. అయినా ఆ సమకాలీన సమస్యలకు ఇంత సమాచార ప్రసారం లేదు. ఇప్పుడు మనం అదృష్టవంతులం. ఒక వేయి దీపాలు వెలుగనీ… అన్నాడు ఒక మహాత్ముడు. అలాగే ఒక వేయి ఆలోచనలు నాకు చూడాలని ఉంది! చదవాలని ఉంది…

మన వ్యవసాయ రంగం మనలను కనపడకుండా ఆదుకుంటున్నది. ఎరువుల విషయం లో చైనా ప్రపంచాన్ని శాసించినట్లు ప్రపంచానికి అవసరమైన వ్యావసాయిక వనరులను మనం మార్కెట్ చేయలేమా?

సర్వీసెస్ రంగంలో మనకు లివరేజ్ ఉన్నది. సరైన ప్రశాసనం లేకపోవటం వలన దాని పూర్తి సామర్థ్యం ముందుకు రవతం లేదు.ఇది ఒక అవకాశం. బి.పి.ఓలు, సాఫ్ట్వేర్ లాంటివి గట్టి శ్రమ చేసి కొత్త దారులు చూపగలిగితే ఒక సంచలనం సృష్టించవచ్చు! ప్రపంచం లో చిన్న చిన్న దేశాలు పేటెంటెడ్ సాఫ్ట్వేర్స్ సృష్టించి నిలబడ్డాయి. ఇంత మంది ఇంజినీయర్లను పెట్టుకుని మనం కేవలం డేటా ఎంట్రీ తప్ప ఏమి చేస్తున్నాము? ఇది ఇండియన్ పేటెంటెడ్ సాఫ్ట్వేర్ అని గుండెల మీద చేతులు పెట్టి చూపించండి!

అషోక్ పార్థసారథి గారు ఒక సారి వ్రాశారు-ఇండియన్ టెలిఫోన్ ఇండస్ట్రీస్ గోండా జిల్లలోని మంకాపుర్ గ్రామం లో చాలా కాలం క్రితం అక్కడ అడవి జాతి వారికి శిక్షననిచ్చి ప్రపంచ స్థాయిలో ఉత్పతులను తయారు చేసి చూపించింది. ప్రపంచం లో సార్వజనిక సంస్థలలో ముందంజ ఫ్రాన్స్ దేశం. మన దేశం అటు ఆలోచించటమే తక్కువ. దీనికి కారణం మన సివిల్ సర్వీసెస్ వ్యవస్థ అని ఆయన చాలా కాలం క్రిందే పేర్కొన్నారు!

మరల పాయింటుకు వస్తే రైల్వే, టెలికాం రంగాలు ఈ ఆర్థిక మాంద్యం సమయంలో కీలకం అని గతం లో నేను వ్రాసి యున్నాను. రైల్వే బడ్జట్ కొంత ఆసను అంకెల మాధ్యమం లో చూపించింది.కానీ అది డివిడెండ్ ప్రభుత్వానికి ఇవ్వటం వరకే కనిపిస్తుంది కానీ ఝీ.దీ.ఫి కి ఎంత దోహద పడుతుందీ అనేది ప్రశ్నార్థకమే!
రెండవ కీలకమైన రంగం గురించి ఎక్కడా హోంవర్క్ జరిగినట్లు లేదు. ఇల్లు సరి చూసుకునేటప్పుడు అన్ని గదులూ చూడాలి కదా మాష్టారూ? ఈ రోజు కాకపోయినా రేపైనా మరో మనిషికి ఒక కీలకమైన, సృజనాత్మకమైన ఆలోచన రావచ్చును కదా?

ఆ అవకాశం, ఆ చోటూ ఈ బడ్జట్ మిగల్చటం కానీ పోనీ భవిష్యత్తులో తయారయ్యే దారిలో పయనించకపోవటం కొద్దిగా బాధనే మిగిల్చింది…

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: