అప్పు తచ్చు -వేదాంతం శ్రీపతి శర్మ


చాలా కాలం క్రితం రీడర్స్ డైజెస్ట్ లో ఒక జోకు చదివాను…
ఒక చిన్న కుర్రాడు లెక్కలు చేసుకుంటున్నాడు. తండ్రి ప్రక్కనే కూర్చుని పేపరు చదువుకుంటున్నాడు. కుర్రాడు అంటున్నాడు, ‘ ఫైవ్ ప్లస్ సిక్స్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ఇలెవెన్, ఫైవ్ ప్లస్ సెవెన్ ద సన్ ఆఫ్ ఎ బిచ్ ఈస్ ట్వెల్వ్..”!
తండ్రికి పిచ్చెక్కింది. ‘ ఏమిటిరా ఇది? ఎవరు చెప్పారు? ‘, అడిగాడు.
కుర్రాడు చేతులు కట్టుకుని చెప్పాడు, ‘ మా మేడం చెప్పింది డాడీ ‘
ఆయనకు ఇంకాస్త పిచ్చెక్కింది. మర్నాడు స్కూల్ కి వెళ్లి ప్రిన్సిపాల్ గారికి చెప్పాడు. ఆయనకూ పిచ్చెక్కి మేడం ని పిలిచాడు. ఆవిడ వచ్చి, ‘ అయ్యో సార్, నేను అటువంటిదేమీ చెప్పలేదు. నేను అన్నదల్లా ఏమిటంటే ఫైవ్ ప్లస్ సిక్స్ ద సం ఆఫ్ విచ్ ఈస్ ఇలెవెన్…’!

బాగుంది. ఇదే బెంగాలీలో అయితే ‘ విచ్ ‘ ను ‘ బీఛ్ ‘ అనే చెప్పేవారు కదా?

ఆస్ట్రేలియా వారు ఇంకా వింతగా పలుకుతారు. అన్నిటికీ చివర ఐ అనటం వారికి అలవాటు. ‘ ఐ కేం టుడే ‘ అనేందుకు ‘ ఐ కేం టు డై ‘ అంటారు.

అదే దేశం లో ఒకే శ్వాసలో పలకటం , పలకాలని చూడటం వారికి అలవాటు. ఒక సారి కప్పు గెలుచుకున్న కెప్టెన్ కు అభినందనలు చెబుతూ ముఖ్య అతిథి ‘ హి షుడ్ గో ఫ్రం సక్సెస్ టు సక్సెస్ ‘ అనే బదులు స్టైల్ గా ‘ హి షుడ్ గో ఫ్రం సక్సెస్ టు సెక్స్ ‘ అన్నాడట.

అచ్చు తప్పులు అప్పు తచ్చులు మనం చూస్తూనే ఉన్నాం. కాలేజీలలో పంక్చుఏషన్ మార్కులు చెబుతారు, వాటి లోపల ఏమిటి అనేది చెప్పరు అనే వారు ఒకప్పుడు.

మీ ఉద్దేశ్యం లో కాలేజీ అంటే ఏమిటి అని ఒక పెద్దాయనని అడిగితే ‘ అడల్ట్ హుడ్ నుంచి అడల్టరీ కి వెళ్లే చోటు ‘ అని చక్కగా బదులిచ్చాడు.

ఈ స్కూలు గురించి, పిల్లల గురించి ఆలోచిద్దాం. అచ్చు తప్పు-ఇది ఒక పధ్ధతి. పాపం టీచర్ చెప్పింది కరెక్టే! కాకపోతే కుర్రాడు ఆ స్వరానికి క్లాసు బయట తోటి పిల్లల మాటలను ‘ అప్పు తెచ్చుకుని ‘ అనుసంధానం చేసినట్లున్నాడు!

తెలుగు సినిమా చూసి బయటకు వచ్చిన వాడు ఎందుకో వంకరగా నడవటం మొదలు పెడతాడు. తెలుగు కాన్వెంట్ నుంచి వచ్చిన వాడు ‘ సూటిగా ‘ తిడుతున్నాడు!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “అప్పు తచ్చు -వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: