15.02.2009 నుండి 21.02.2009 వరకు రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత: సమస్త కళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహ చంచరీక: నిరంతరం మంగళమాతనోతు!

15.02.2009 నుండి 21.02.2009 వరకు రాశి ఫలాలు:

ఈ వారం రవి కుంభం లో, గురువు, రాహువు, కుజుడు, బుధుడు మకరం లో, శుక్రుడు మీనం లో,కేతువు కర్కాటకం లో, శని సింహంలో, చంద్రుడు తుల, వృష్చిక ధను రాశులలో సంచరిస్తారు.
ఈ వారం మంచి ఉత్సాహం తో ప్రారంభమవుతుంది. కాకపోతే స్టాక్ మార్కెట్ కలవర పెట్ట గలదు. ఇంటిలోని పోరు ఇంతింత కాదయ్యా! అని చాలా మంది అనుకోవాల్సి వస్తుంది. కొన్ని రహస్య వ్యవహారాలు బయట పడతాయి. రాజకీయ రంగం లో ఒక హత్య తాలూకు వార్త సంచలనం సృష్టించగలదు.

మేష రాశి: సమస్యలను ధైర్యంగా ఎదుర్కుంటారు. ఆలోచనలు కలసి వస్తాయి. ఎక్కువ మాట్లాడాలని అనిపిస్తుంది. అవసరం లేదు! బంధువుల నుంచి మంచి వార్తలు వింటారు. వస్తువులు సేకరిస్తారు. కనకధారా స్తవం చదవండి.

వృషభ రాశి: చాలా కాలంగా చేయాలనుకున్న యాత్రలు చేయాలని నిర్ణయిస్తారు. ఆదాయం బాగుంటుంది. మిత్రులను భాగస్వాములుగా చేసుకోవాలని యోచిస్తారు. మరి కొద్దిగా యోచించవలసిన అవసరం ఉన్నది.
పదోన్నతి కోసం పరీక్షలు వ్రాయటం మంచిదే.
ఖర్చుల లెక్కలు వ్రాసుకోవటం మంచిది. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

మిథున రాశి: తాత్విక చింతన పెరుగుతుంది. పుణ్య క్షేత్రాలను దర్శించాలనుకుంటారు. మీ మొండి వైఖరి ఇతరులను బాధిస్తుంది. ఆహారం విషయం లో జాగ్రత్త వహించాలి. ఎవరు మీ వారో ఎవరు పరాయి వారో అర్థం అవుతుంది. సుబ్రహ్మణ్య స్వామిని అర్చించండి.

కర్కాటక రాశి: ఎక్కడెక్కడో వెతికినది మీ ఇంటిలోనే దొరుకుతుంది. స్థిరాస్తులు కలసి వస్తాయి. అనవసరంగా ఖర్చులు చేస్తారు. మోకాళ్ల విషయం లో జాగ్రత్త వహించాలి. ప్రయాణాలు కొంత కాలం పూర్తిగా మానివేయటం మంచిది. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

సింహ రాశి: అనవసరమైన అప్పులు చేస్తారు. నరాల బలహీనత బాధిస్తుంది. పిల్లల అభివృధ్ధి బాగుంటుంది. మీకు ఉద్యోగంలో బదిలీ అయ్యే సూచనలున్నాయి. ఇంటిలోని వస్తువులను జాగ్రత్తగా చూసుకోవాలి. ఆదిత్య హృదయం చదవండి.

కన్య రాశి: మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. మీ సహనం మీ ఆయుధం. ఓపిక లేకపోయినా పనులను చేబడతారు. ఒక సరిక్రొత్త దృష్టికోణం గురించి యోచన చేస్తారు. కాళ్ల నొప్పులు బాధిస్తాయి. డబ్బు చేతికి అందుతుంది. నిద్ర లోపిస్తుంది. దుర్గా సప్తశ్లోకీ పారాయణ చేయండి.

తుల రాశి: ఇంటి విషయం లో మీరు ఎంతో కాలంగా చేస్తున్న ప్రయత్నాలు ఒక రూపు దిద్దుకుంటాయి. బంధువులు సహకరిస్తారు. పెద్దల ఆరోగ్యం కలవర పెడుతుంది. అజీర్ణం ఇబ్బంది పెడుతుంది. ఈ బుధ వారం ఖర్చు పెట్టే ముంది ఆలోచించాలి. శ్రీసూక్తం పారాయన చేయండి.

వృశ్చిక రాశి: ఇది మీకు చాలా అనుకూలమైన వారం. మంచి పనులు చేపట్టగలరు. చిన్న పిల్లలు మిమ్మలను ఆకర్షిస్తారు. వ్యాపారంలో మంచి లాభాలు కలవు. బంగారం కొనుగోలు చేస్తారు. శుభకార్యాలలో పాల్గొన్నప్పుడు మంచి పరిచయాలు ఏర్పడతాయి. శివునికి అభిషేకం చేయించిన విశేషమైన ఫలితాలు ఉండగలవు.

ధను రాశి: ఇంటిలో శుభకార్యం జరుగ వచ్చును. వివాహం కోసం ఎదురు చూస్తున్న వారికి ఇది మంచి వారం. చంకలో పిల్లాడిని పెట్టుకుని ఊరంతా వెతకటమనేది ఈ వారం నిజమవుతుంది. చిన్న పిల్లల ఆరోగ్యం విషయం లో జాగ్రత వహించండి. సుబ్రహ్మణ్య కవచం పఠించండి.

మకర రాశి: నిర్ణయాలు తీసుకొనేందుకు మరో వారం ఆగాలి. అపవాదులు మీ మీద పడనున్నాయి. జాగ్రత్త వహించాలి. మౌనంగా ఉండటం మంచిది. అన్నిటినీ మీరే పట్టించుకోవాలి అనే నైజం మంచిది కాదు. ప్రతికూలమైన పర్యవసానాలు ఉండగలవు. లలితా సహస్రనామం పారాయణ చేయండి.

కుంభ రాశి: కళాకారులకు చక్కని వారం. స్త్రీల విషయాలలో జాగ్రత్త వహించాలి. ఇది మొక్కుబడులు తీర్చే సమయం. తాతల సొమ్ము అందగలదు. జీవిత భాగస్వామిని సంతోష పరచండి. మేలు జరుగగలదు. అష్టలక్ష్మీ స్తోత్రం పారాయణ చేయండి.

మీన రాశి: క్రయ విక్రయాలు లాభిస్తాయి. వారం ఉత్తరార్థం లాభిస్తుంది. బంధువులు మీ సహాయం కోరుతారు. శక్తి సంపన్నులైన మిత్రులు పరిచయమవుతారు. ఒక విందులో పాల్గొని ఆకట్టుకుంటారు. వారాంతం లో ఒక చికాకు పెడుతున్న సమస్య లోంచి ఇవతలకు వస్తారు. గోవునకు గ్రాసం వేయండి.

ఈ వారం మంచి మాట:

అనాహూత: ప్రవిశతి అపృష్టో బహుభాషతే
అవిశ్వస్తే విశ్వసితి మూఢచేతా నరాధమ:

పిలవబడకుండా ఎక్కడికైనా వెళ్లేవాడు, అడగకుండా ఎక్కువగా మాట్లాడే వాడు, విశ్వసనీయులు కాని వారి మీద విశ్వాసం ఉంచువాడు నరాధముడు

(విదురనీతి)

ఓం శాంతి: శాంతి: శాంతి:

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “15.02.2009 నుండి 21.02.2009 వరకు రాశిఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: