‘ బిగ్ బాస్, యస్ బాస్!’-వేదాంతం శ్రీపతి శర్మ


ఐక్య రాజ్య సమితి జనరల్ సెక్రటరీ గారు ఈ సంవత్సరం సెప్టెంబర్ మాసంలో పర్యావరణానికి సంబంధించి ఒక సమావేశాన్ని ఏర్పాటు చేయ దలచినట్లు సెలవిచ్చారు. బాగుంది. అయితే పాటుగా ఒక చిత్రమైన మాట అన్నారు (నాకు చిత్రంగా తోచింది). ఈ సమావేశానికి ముఖ్యంగా అందరి కంటే ఎక్కువగా ప్రపంచ పర్యావరణాన్ని బాధిస్తున్న చైనా, భారత దేశాలు పాల్గొనాలీ అని, అలాగే కొత్త
అమెరికా అధ్యక్షులు ఒబామా గారు వస్తే చాలా బాగుంటుందీ అన్నారు. ఈ మాటకు బ్రిటన్ ప్రధాని కూడా వత్తాసు పలికారు. తెల్ల ఇల్లు (వైట్ హవుస్) నుంచి ఎటువంటి నిర్ణయం రాపోయే సరికి ఒబామా గారు రాకపోతే సమావేశం చేయటం అంత బాగుండ
దు అని అన్నారు. బ్రిటన్ మహాశయుడు మరల తందానా అన్నారు!

వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్?

విషయం లోకి వద్దాం.

ఓక్రిడ్జ్ నేషనల్ రిసర్చ్ లేబొరేటరీ అత్యధికంగా కార్బన్ డై ఆక్సైడ్ ను వదులుతున్న ఇరవై దేశాల పేర్లను వెళ్లడించినది. అందులో ముందుగా ఉన్నది అమెరికా! (1,650,020 టన్నులు- 5.61 పర్ కాపిటా). తరువాత చైనా (1,366,554 టన్నులు -1.05 పర్ కాపిటా), తరువాత రషియా ( 415,951 -2.89 పర్ కాపిటా)తరువాత మన దేశం ( 366,301 -పర్ కాపిటా 0.34)

వీరి అభిమతం ప్రకారం అభివృధ్ధి చెందిన దేశాలలో అందరి కంటే ఎక్కువ కార్బన్ డై ఆక్సైడ్ బయటికి వదులుతున్నారు. అభివృధ్ధి చెందుతున్న దేశాలలో దీని పెరుగుదల రేటు ఎక్కువగా ఉందని చెబుతున్నారు.

అస్తు! ఇప్పుడు ఆర్థిక ఎదుగుదలకు గల సంస్యలను, అసలు కాలుష్యం సంఖ్యలను చూసి ఇలా జనరల్ సెగట్రీ గారు వ్యాఖ్యానించటం ఉచితమేనా? అమెరికా ముక్కు వంకర అంతగా పెట్టుకుని ఈ రెండు దేశాలనే గుర్తించి పైగా అమెరికా హీరో గారు వస్తే దేశాల మీద సమావేశం ప్రభావం బాగుంటుందని చెప్పి రాకపోతే అసలు సమావేశమే జరగక పోవచ్చని సెలవివ్వటం న్యాయమా? అడిగే వాడు లేడు. అంతేనా?

ఇంకో మాట! అమెరికాలో పవర్ ప్లాంట్ల నుంచి వస్తున్న వివిధ రసాయనిక గాసులు ఆ దేశం లోని 40% జనాభాని ఆస్పత్రులలోకి చెరుస్తున్నాయని అమెరికా లోని పబ్లిక్ ఇంటరెస్ట్ రిసర్చ్ గ్రూప్ ఎడుకేషన్ ఫండ్ వారు ఆ ప్రభుత్వానికి సూచించి యున్నారు. ఆ దేశం లోని 40 స్టేట్స్ లో పరిస్థితి తీవ్రంగా ఉన్నదని చెప్పారు. దీనిని డర్టీ పవర్ అని కూడా వర్నించారు.

ఇవన్నీ ప్రక్కన పెట్టి హిందూ మహా సముద్రం లోకి వస్తున్న అణు సంబంధమైన వేస్ట్ ను, అడ్డ దిడ్డంగా ఇష్టం వచ్చినట్లు అంతరిక్షం లోకి పంపుతున్న ఉపగ్రహాలు, అంతరిక్ష నౌకల చెత్త, పనామా, ఫిలిపీన్స్ లాంటి దేశాలలో నిలిపిన న్యూక్లి
యర్ బేసులు ఇవన్నీ ఎక్కడ చర్చిస్తారు సార్? ఎవరు చర్చిస్తారు?

ఇరాక్, అఫ్గానిస్తాన్ లలో ఆడుకున్న ఈ అమెరికా అక్కడ ఎటువంటి కాలుష్యం సృష్టించిందో అక్కడ గాలి పీలుస్తున్న వారిని అడగాలి…

అన్నీ నేనేనని చొక్కా చించుకోవటం, అలా చించుకున్న వాడి వెనుక యెస్ బాస్ అని ఐక్య రాజ్య సమితి నిలబడటం, నిజాన్ని నిలదీయవలసిన సమయం వచ్చినప్పుడు అమెరికా నన్ను కాకుండా లెక్క వేసుకోమనటం మనకి మామూలే!

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘ బిగ్ బాస్, యస్ బాస్!’-వేదాంతం శ్రీపతి శర్మ

  1. హు…..డిప్రెసింగ్ గా వదిలేశారు. మీ విధానం లో ఓ పరిష్కారం?(సారీ – ఇది వార్తాలపం కదూ!)

    లేకపోతే అసలు తగ్గించుకోవాల్సిన వాళ్ళే రాకపోతే మీటింగెందుకు అనేమో!?మీటింగులకి డబ్బుల్లేవని ఆ మధ్య ఓ “మీటింగు పొడిగించము” అని చెప్పినట్టు చదివాను.ఎప్పుడో గుర్తులేదు.

  2. శ్రీపతి శర్మ గారు,
    You are writing two or three tapaas everyday. I am reading your blogs regularly and I am very much impressed. I request you to focus on one particular topic like environmental and pollutions issues. Write latest information available on Net on these issues. Then it will be very helpful for Andhra people.
    I am giving link here hopw this will helpful for you.
    http://free-university-in-internet.blogspot.com/

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: