‘కొంచెం ఇష్టం, కొంచెం కష్టం’-తెలుగు చలన చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష


చాలా కాలం క్రితం -దాదాపు 1970 వ దశాబ్దం అనుకుంటాను ఒక బ్లాక్ అండ్ వయిట్ చిత్రం వచ్చింది-దీని పేరు ‘అమ్మాయి పెళ్లి ‘. ఇందులో తగువులాడుకుని విడిపోయిన భార్యా భర్తలుగా ఎన్. టి. ఆర్, భానుమతి అద్భుతమైన నటనను ప్రదర్శించారు. సినిమాలోని రెండవ భాగం లో వాళ్ల సంతానం వివాహం విషయం తో మరల కలుస్తారు. ఇది ఎందుకో గుర్తుకు వచ్చింది.

నిజం చెప్పాలంటే ‘ కొంచెం ఇష్టం, కొంచెం కష్టం ‘ చిత్రం చూడదగినది. ఒక సున్నితమైన అంశం- తల్లి దండ్రుల సమస్య వలన ఒక ప్రేమ జంట ఇరుక్కున్న విషయం ఇది. ఆడా, మగా పౌరుషాలు ఇక్కడా అక్కడా ప్రతిబింబించటం చక్కని ప్రయోగం. ఆ సన్నివేశాలను చాలా నేర్పరితనం తో దర్శకుడైన కిషోర్ గారు చిత్రీకరించారు.

సిధ్ధార్థ లో ఏవో విద్యుత్ తరంగాలు తిరుగుతూనే ఉంటాయా అనిపిస్తుంది. చాలా సక్రియంగా నటిస్తాడు.
కొద్దిగా తెలుగులో ‘ బాధ ‘ లాంటి పదాలు సరిగ్గా పలికితే బాగుంటుంది. ఇతను తేలికైన సన్నివేశాలు, గాంభీర్యం గల ఉదంతాలూ రెండింటిలో తనదైన రీతిలో చేశాడు. తండ్రి దగ్గర కూర్చుని అమ్మాయితో జరిగిన తగువు గురించి మాట్లాడిన తీరు బాగుంది.

ముఖ్యంగా నాజర్, ప్రకాశ్ రాజ్, రమ్య కృష్ణ పాత్రలకు సరి పొయినట్లు నటించారు. బ్రహ్మానందం గారి గురించి వేరే చెప్పక్కరలేదు.

నేపథ్య సంగీతం తో పాటు పాటలు కూడా సన్నివేశాలకు తగ్గట్లు ఉన్నాయి. హీరో పుట్టిన రోజున అమాయిలందరూ కలసి అతనితో పాడిన పాట అంతగా రాణించలేదు.

ఈ సినిమాలో వెనుక ఉండి నృత్యం చేసే ఎక్స్ ట్రా
ఆర్టిస్ట్ లు బాగా ఇన్వాల్వ్ అయి చేశారు.

అబ్బూరి రవి గారి మాటలు ఆలోచింప చేసేవిగా ఉన్నాయి.

చిత్రం లో ఎక్కడా హీరోయిన్ దుస్తులు అభ్యంతర ధోరణిలో లేవు. (ఒక్క రాజస్థానీ జానపదం శైలిలోని పాటలో తప్ప)

దర్శకుని దగ్గర మంచి సింబాలిసం ఉన్నది. ఒక ఫేస్ అయిపోయినప్పుడు పల్లెటూరిలో అమ్మాయి తండ్రి శరతు పెట్టి పంపినప్పుడు రెండు తరాల మధ్య కథను ఒక వంతెన మీదకు తెచ్చి మధ్యాంతరం కోసం నిలిపివేయటం బాగుంది. అలాగే గోల్కొండ దగ్గర నేపథ్యానికి తగ్గట్లు ఒక కవ్వాలి రీతిలో ఎంచుకున్న పాట కూడా మంచి సృజనాత్మకతను సూచిస్తుంది.

ఇందులో నటించిన కళాకారులలోని ‘ఈస్ ‘ వలన చాలా సింపుల్ గా కథ సాగిపోతుంది.

ఈ దర్శకుని నుంచి మరి కొన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చును.

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘కొంచెం ఇష్టం, కొంచెం కష్టం’-తెలుగు చలన చిత్రం మీద వేదాంతం శ్రీపతి శర్మ సమీక్ష

  1. ఈ సినిమా నాకు నచ్చటానికి ముఖ్య కారణం కొంతవరకు నిజ జీవితంలో జరిగే సంఘటనలకు అర ఇంచు మాత్రమే దూరంగా వున్నందుకు!అక్కడక్కడ కొన్ని లోపాలు వున్నాయనుకోండీ! ఉదాహరణకి– కొన్ని సినిమాలని బ్రహ్మానందం కోసమే చూడొచ్చు. అలాంటిది ఎందుకనో ఆయన ఈ సినిమాలో తన వంతు కృషి చేసినా కొద్దిగా ఎక్కువైనదనిపించింది. ఇకపోతే, ఒక పాటలో “అబ్బ సుబ్రహ్మణ్యం…” అన్న పదప్రయోగం కూడా విన సొంపుగా లేదు.
    హీరోయిన్ చేత ఎంత కమేడియన్ అయినా వేణు మాధవ్ ని “వెధవ” అనిపించడం కూడా బాగా లేదు. ఎంతైనా వాళ్ళ ప్రేమకు హెల్ప్ చేయడానికి వచ్చిన స్నేహితుడు కదా!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: