08.02.2009 నుంచి 14.02.2009 వరకు రాశి ఫలాలు-వేదాంతం శ్రీపతి శర్మ


శ్లో: శ్రీరామచంద్ర: శ్రితపారిజాత:
సమస్త కళ్యాణగుణాభిరామ:
సీతాముఖాంభోరుహ చంచరీక:
నిరంతరం మంగళమాతనోతు!

08.02.2009 నుంచి 14.02.2009 వరకు రాశి ఫలాలు:

ఈ వారం గురు, కుజ, రాహు, బుధ, రవి గ్రహాలు మకర రాశిలోనూ, శుక్రుడు మీనం లోనూ, కేతువు కర్కాటకం లోనూ, శని సింహం లోనూ, చంద్రుడు కర్కాటక, సింహ, కన్య రాశులలోనూ సంచరిస్తారు. రవి 13 వ తేదీన కుంభ సంక్రమణం చేయనున్నాడు.

ఇది మంచి యోగములున్న వారం. కాకపోతే బంధు విరోధం, పొరుగు దేశాలతో సమస్యలు, నీటిలో దుర్ఘటనలు, పశువులకు అనారోగ్యం వంటివి కనిపిస్తున్నాయి.

వ్రతాలు, సంప్రదాయబధ్ధమైన పుజలు జరిపించే వారికి మంచి ఫలితాలు ఉండే కాలం. భార్యా భర్తలు తగువులాడుకోకుండా జాగ్రత్త వహించ వలసిన వారం. ఈ వారం కొద్దిగా అందరినీ శ్రమ పెడుతుంది!

మేష రాశి: ఇంటి పనులు చేపట్టాలని అనుకుంటారు. పాత వస్తువులు మరమ్మత్తు చేయిస్తారు. బుధ వారం మనసు కలవర పడగలదు. స్త్రీలు ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. శివునికి అభిషేకం చేయించండి.

వృషభ రాశి: ఉద్యోగం లో మంచి పదోన్నతి ఉన్నది. మీ పై వారు మిమ్మలను మెచ్చుకుంటారు. వివాహం కాని వారికి మంచి వారం. మంచి సంబంధం దొరక గలదు! ఆహారం విషయం లో శ్రధ్ధ వహించాలి. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

మిథున రాశి: డబ్బు సకాలానికి అంద గలదు. ఇంటిలో బాధ్యతలు పెరుగుతాయి. పట్టుదల పెరుగుతుంది. చెల్లెలు దూరం నుంచి సంభాషిస్తుంది. ప్రయాణాలు వద్దు. బంధువుల ఆరోగ్యం విషయం లో చింత కలుగుతుంది. దుర్గా సప్త శ్లోకీ పఠించండి.

కర్కాటక రాశి: మొండితనం పెరుగుతుంది. ఇతరుల పట్ల ఒక నిర్లిప్తత ఏర్పడుతుంది. మీ విషయం లొ జీవిత భాగస్వామియే సర్గ్గా ఆలోచించెనని తెలుసుకుంటారు. కానీ ఒప్పుకోరు. దొంగతనాలు జరుగవచ్చు. జాగ్రత్త వహించాలి. సుబ్రహ్మణ్య స్వామికి అర్చన చేయించండి.

సింహ రాశి:బంధువుల నుంచి కీలకమైన సమాచారం వస్తుంది. వస్తువులు సేకరిస్తారు. కళ్ల పరీక్ష చేయించుకోవాల్సి వస్తుంది. ఖర్చులు పెరుగుతాయి. భూ వివాదాలు తలెత్తనున్నాయి. పిల్లల అభివృధ్ధి బాగుంటుంది. లలితా సహస్రనామం పఠించండి.

కన్య రాశి: శ్రమతో కార్యాలను సాధిస్తారు. తలచిన పనులు నెరవేరుతాయి. కీళ్ల నొప్పులు బాధిస్తాయి. సంఘం లో గౌరవం పెరుగుతుంది. మీ నుంచి అందరూ ఏవో ఆశలు పెంచుకుంటారు. మీ సలహాలను ఇతరులు పాటిస్తారు. కొందరు మిమ్మలను ఆలోచింప చేస్తారు. శ్రీ సూక్తం పారాయణ చేయండి.

తుల రాశి: ఇంటిలో శుభ కార్యాలు తలపెడతారు. ఇతరులు మీ ఇంటిలో కార్యాలు నెరవేర్చుకుంటారు. ఆదాయం, వ్యయం రెండూ బాగున్నాయి. పోయిన ఉంగరం దొరుకుతుంది. కొత్త విద్యలను అభ్యసించాలని అనుకుంటారు. డబ్బు మంచి పనులకే వెచ్చిస్తారు. ఉద్యోగం లో మార్పు కోరుతారు. ఆదిత్య హృదయం చదవండి.

వృశ్చిక రాశి: ఆరోగ్యం బాగు పడుతుంది. మీరు ఊహించినంతగా మీ పట్ల మీ సోదర సోదరీ మణులు ప్రవర్తించరు. భూమి తాలూకు విషయాలు మంచి లాభాలు ఇస్తాయి. పుస్తకాలు చదవాలనిపిస్తుంది. మీ అనుజులు చికాకు పెడతారు. వారాంతం లో ఆకస్మిక ధన లాభం ఉన్నది. శివునికి ఈ సోమవారం అభిషేకం చేయించండి.

ధను రాశి: ఆచి తూచి ఈ వారం వ్యవహరించాలి. మీతో వ్యవహారం చేయు వారు మరో బాధలో యుండి వింతగా ప్రవర్తిస్తారు. ప్రతిక్రియలు చూపకండి. ముఖ్యమైన నిన్ర్ణయాలు వాయిదా వెయ్యటం మంచిది. మీ పై అధికారి మారగలరు! జీవిత భాగస్వామి ఆరోగ్యం విషయం లొ జాగ్రత్త వహించాలి. గోవుకు గ్రాసం వేయండి.

మకర రాశి: ఒక అపవాదుకు గురి కాగలరు,. చింతించకండి. అన్ని వేళ్లు సమం కావు, అన్ని వేళలు సమం కావు. ఊహించనంత మాత్రాన ఏ సమస్య తీవ్రతరం కాబోదు. మిత్రులు సహకరిస్తారు. కాళ్ల విషయం లొ జాగ్రత్త వహించాలి. నిదానం అవసరం. ఆదాయం బాగుంటుంది. విష్ణు సహస్రనామం పారాయణ చేయండి.

కుంభ రాశి: కళాకారులు మంచి అవకాశాలు పొందుతారు. శ్రమ ఫలిస్తుంది. నలుగురిలోకీ వస్తారు. బంధువులకు సహాయం చేస్తారు. ఒక అనుకోని విషయం లొ ప్రయాణం చేయవలసి రావచ్చును. వాగ్దానాలు చెస్తారు. సమ్రదాయం పట్ల అభిరుచి పెరుగుతుంది. శుక్ర వారం రోజున అతిథులు రానున్నారు. హనుమాన్ చాలీసా పారాయణ చేయండి.

మీన రాశి: ఒక మంచి కార్యం పరిసమాప్తి కాగలదు. ఆదాయం వచ్చే మార్గాలు అధికం కాగలవు. ఆలొచనల వైవిధ్యం పెరుగుతుంది. కడుపు నొప్పులు రాగలవు. జాగ్రత్త వహించవలెను. పూర్వం మీరు చేసిన సహాయం ఇప్పుడు తిరిగి పొంద గలరు. సంగీత సాధకులకు మంచి అవకాశాలు రాగలవు. లలితా సహస్రనామం పారాయణ చేయండి.

ఈ వారం మంచి మాట:

న హ్యేక: సాధకో హేతు: స్వల్పస్యాపీహ కర్మణ:
యో హ్యర్థం బహుధా వేద స సమర్థోర్థసాధనే

చిన్న చిన్న పనులు సిధ్ధించుటకు కూడా ఒక సాధక హేతువే ఉండదు. ఏ పురుషుడైతే ఒక కార్యం లేదా ప్రయోజనం సిధ్ధించుట కోసం అనేక విధాలుగా సిధ్ధించే కళను తెలిసిన వాడయి ఉంటాడో, అతనే కార్య సాధనలో సమర్థుడయి ఉంటాడు.

(వాల్మీకి రామాయణం, సుందర కాండ 41.6)

ఓం శాంతి: శాంతి: శాంతి:

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: