‘కొత్త శృంగార లోకం’-వేదాంతం శ్రీపతి శర్మ


మొన్న ఒక మసాలా లాంటి వార్త చదివాను. పెద్దలు మన్నించాలి! ప్రపంచం లో భారత్, చైనా తప్ప అన్ని చోట్లా వృధ్ధులు ఎక్కువయిపోయారు అనేది అందరికీ
తెలిసినదే. బ్రేవ్ న్యూ వరల్డ్ బదులు గ్రే న్యూ వరల్డ్ కనిపిస్తున్నది. మన దేశం లో భోజనం చేసి ‘బ్రేవ్ ‘ మని త్రేణ్చే ‘ బ్రేవ్ ‘ ఓల్డ్ వాళ్లు ఉన్నారు. కాకపోతే ఊరకే త్రేణ్చి కూర్చోవటం లేదు వీళ్లు. అందరికంటే ఎక్కువగా పోర్నోగ్రాఫిక్ చిత్రాలను విరగబడి చూసేస్తున్నారు. దీనికి కారణం ఉంది. వాళ్ల కాలం లో అవకాశాలు లేవు. ఇప్పుడు పిల్లలు అమెరికాలో ఉండటం చేత కొన్ని కాలనీలలు కేవలం రిటైరయిన వారి కాలనీలుగా కనిపిస్తున్నాయి! మరి టైం పాస్ ఎలా? ఆ తొందర పడకండి. సత్కాలక్షేపాలూ చెస్తున్నారు. కాకపోతే సమయానుసారం గీతలో భగవంతుడు ‘ నేను కామాన్ని సుమా ‘ అన్నాడని అంటున్నారు…

అదలా ఉంచండి.

ఒక అంచనా ప్రకారం పోర్నోగ్రఫీ అనేది సంవత్సరానికి పది నుంచి పదిహేను బిలియన్ డాలర్ల లాభాన్ని ఆర్జించి పెడుతున్నది. ఇది మైక్రోసాఫ్ట్ కంపనీ పొందే లాభానికంటే చాలా ఎక్కువ!

ఈ సినిమాలను అమ్మడం లేదా అద్దెకు ఇవ్వటం ద్వారా 4.1 బిలియన్ డాలర్లు ఏటా సంపాదిస్తున్నారు. ఇది హాలీవుడ్ లో అతి ఎక్కువ ఖర్చుతో తయారయ్యే సినిమాలకంటే ఎక్కువ!

జర సోచాయించండి…

ఆ మధ్య ఒక పెద్దాయనను ‘ సార్, ఎందుకు సార్, ఆ సినిమా? అంతా చెత్త చెత్తగా దుస్తులు తొడుక్కున్నారు ‘ , అన్నాను. ఆయన కళ్లజోడు సద్దుకున్నాడు. ‘ అలాక్కాదు…’, అన్నాడు, ‘ నేను వాటికోసం వెళ్లటం లేదు. ఈ సినిమాలో అభేరి రాగం లో ఒక పాటకు ట్యూన్ కట్టారు. అది ఎలా చేశాడొ చూద్దామనుకున్నాను! ‘

మన నిర్మాతలకు తెలుసన్నమాట. హాల్లోకి దూరే ముందు అందరికీ ఒక వంక ఇచ్చేస్తున్నారు మరి. దట్ ఈస్ మార్కెటింగ్ మరి.

వార పత్రికలూ, వార్తా పత్రికలూ అంతే! దేవాలయం, దేవాలయాల మీద ఉన్న బొమ్మలు…ఇవన్నీ మరి మనకి పనికి వచ్చే ఉదాహరణలే కదా?

అన్నిటినీ మించిన ఒక సంగతి మీకు చెబుతాను. ఒక పెద్దాయన చాలా సార్లు అడుగుతూ ఉంటాడు. ‘ మీరు ఏమీ అనుకోకపోతే నాదొక చిరకాల కోరిక! ‘
‘ ఏమిటి సార్? ‘
‘ ఏమీ లేదు, ఒక్క సారి ఎలాగైనా ఒక అందాల పోటీకి న్యాయ నిర్ణేతగా వెళ్లాలి సార్, ఎలా వెళ్లాలి? ‘, అంటాడాయన.

పాత రోజులలో సినిమాలలో ఎంత శృంగారం చూపించినా కొన్ని మంచి మాటలూ చెప్పేవారు. ప్రేమ నగర్ సినిమాలో కథానాయిక పైట గాలికి ఎగిరిపోగానే ఆమె దానిని వెంటనే వెనక్కు లాగి కప్పుకుంటుంది. కథానాయకుడు అంటాడు, ‘ లలల…లతా, స్వతంత్రంగా ఎగురుతున్న దానిని బంధించావెందుకు? ‘
‘ కొన్ని ఒక బంధం లోనే, బంధం తోటే అందంగా ఉంటాయి! ‘

నిజమే కదా?…కాదా?

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

5 thoughts on “‘కొత్త శృంగార లోకం’-వేదాంతం శ్రీపతి శర్మ

 1. నిజమే! కాని అవి ఎవరూ చూడటంలేదుగా!

  మనిషి ఆటవికంగా ఉన్నప్పుడు తన కోరికలను వెంటనే తీర్చేసుకునేవాడు. రాను రాను కోరిక పుట్టుకకీ, అది తీరే సమయానికి చాలా కాల వ్యవధానం వచ్చేసింది.(అన్ని కోరికలకీ – దీన మీద నేను త్వరలో ఓ బ్లాగు రాస్తున్నాను)

  శృంగారంలోనూ అదే జరిగింది. కాబట్టి అసలు పనిలో కంటే ఇలా సిన్మాలు చూడటం, పుస్తకాలు చదవతాంలో ఎక్కువ ఆనంద పడిపోతునాడు. ఆ అవసరానికి ఇంత మార్కెట్ పెరిగింది.

  ఫుడ్ లో ఇంస్టెంట్ ఫుడ్, హోటల్ ఫుడ్ ఉన్నట్టు, ఇది తప్పదు. మారుతున్న జీవితంలో భార్యా భార్తల మధ్య సమయం తగ్గుతోంది. అందుకనే దాని విలువలలో మార్పు వస్తోంది.

 2. “‘ నేను వాటికోసం వెళ్లటం లేదు. ఈ సినిమాలో అభేరి రాగం లో ఒక పాటకు ట్యూన్ కట్టారు. అది ఎలా చేశాడొ చూద్దామనుకున్నాను! ‘”
  హ హ హ.
  అవును నేను ప్లేబోయ్ పత్రికని అందులోని తీవ్రమైన చర్చలకోసమే చదువుతాను 🙂

 3. జీడిపప్పు గారు, ఇక్కడ మేము భిన్నం అని ఎవరూ చెప్పలేదే!(మీరు కొత్తపాళీగారికే ఓటు అంటే,నాకు అర్ధం కాలేదు)

  శ్రీపతిగారు పాత సినిమాలో శృంగారం చూస్తున్నారు. వారిది కాస్త కంజేర్విటిజం.

  కొత్తపాళీ గారు, మీరు బహుశా ప్లేబాయ్ లో వెతుక్కుంటున్నారు.ఇది మధ్య రకం.(ఈ పుస్తకం చదువుతున్నామని చెప్పుకునే “ఫ్యాషన్” నా దృష్టిలో కొంచెం పాత తరం దే. కానీ అంత కాదు.

  నేను “రకరకాల” సినిమాల్లో చూసుకొంటున్నాను.నాకు సినిమా పిచ్చి కాబట్టి.

  కాకపోతే ఛాన్స్ దొరికితే (ఛాన్స్ అనేది చాల విశదీకరించాల్సినది.కానీ సమయం లేదు), ఇలా ఎందుకు ఉంటాం! వి కుడ్ హావ్ బీన్ మోర్ యాక్షన్ ఓరియంటడ్ (వి అంటే మన నలుగురమే అని కాదు)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: