‘ ఆలోచనే అమృతం’-వేదాంతం శ్రీపతి శర్మ


ఆ మధ్య ఒక ఆటోలో ఎందుకో ఏదో పని జరగలేదని నిరాశతో కూర్చున్నాను. అనుకోకుండా నా కన్ను ఆటో నడిపే వాని ముందు ఉన్న అద్దానికి అతికించి ఉన్న స్టిక్కర్ మీద పడింది.

‘ ఐ యాం ఆల్వేస్ ఇన్ ట్రబల్…ఇట్ ఈస్ సో మచ్ ఫన్! ‘ అని ఉంది.
‘ ఇది ఎవరిచ్చారు? ‘, అడిగాను.
‘ ఆ మద్దలా టైరు కొనినికి ఎల్లినా సారు, ఆ షాపులో స్టిక్కరు ఇచ్చిన్రు మల్ల. దీని అర్థం ఏందిరా బై? అని అక్కడ చదువుకున్నోడి లెక్క ఉన్న ఆయన్ను అడిగిన. ఆయన చెప్పిండు మల్ల. గప్పుడు అతికించిన. నాకు మంచిగ నచ్చింది సారు! ‘
‘ ఎందుకు? ‘
‘ ఏముంది సారు, అంతా స్మూత్ గా ఎల్లిపోతే ఏముంది లైఫ్లా? జర సేపు గొడవుండాలె, జర సబర్ చెయ్యాలె, మరి మల్ల బయటకి రావలె. అవ్? చెప్పు సారూ! ‘
‘ నిజమే! మంచి ఉషారున్నవులె! ‘

~~~***~~~

గ్లెన్ కనింగ్ హాం అనే అతనికి అయిదు సంవత్సరాల వయసు అప్పుడు కాళ్లు కాలిపోయి ఆస్పత్రిలో చేరాడు. డాక్టర్లు కాళ్లు బాగయ్యే ఆస్కారం లేదన్నారు. కాని ఆ పై వారమే అతను లేచాడు.

‘ డాక్టర్లు నా కాళ్లనే చూశారు…’, అతను అన్నాడు, ‘…నా హృదయాన్ని చూడలేదు! ఇప్పుడు అందరి కంటే వేగంగా పరిగెడతాను! ‘

1934 లో అతను 1500 మీ. ప్రపంచ రికార్డ్ పడగొట్టాడు. ఈ సారి 4 ని. 6 సెకండ్లలో పరిగెట్టి చూపించాడు. మేడిసన్ స్క్వేర్ గార్డెన్ లో శతాబ్దానికే అథ్లెట్ గా అతనికి ప్రజలు శ్రధ్ధాంజలి ఘటించారు (1909-1988).

~~~***~~~

కలాం గారు ఓ మాట అంటారు-మన భూగ్రహం అంతరిక్షంలో తిరుగుతూ ఒక లయబధ్ధమైన గతిలో నిరంతరం సాగుతూ ఉంటుంది. ఈ గతిలో ఈ భూమి మీద ఉన్న ప్రతి అణువూ ఒక అభిన్నమైన భాగమే! నేను ఈ గ్రహం మీద ఉన్నాను అంటే దీనిని నడిపే శక్తిలో కూడా ఒక భాగం గానే ఉన్నాను! ఈ భూమి యొక్క ప్రధానమైన శక్తి నాలో ఉంది. అందు చేత మనలో ఉండే సంకల్పం మన చుట్టూ ఉన్న శక్తికి అనుబంధమై యున్నది ( డైయర్ సిధ్ధాంతం). అటు వైపు నుంచి చూస్తే మన చుట్టూ ఉన్న శక్తి కూడా మన సంకల్పంతో ముడి బడి యున్నది!

~~~ *** ~~~

వేదంలో ఒక చక్కని కథ ఉన్నది. గురువుగారు శిష్యులను అడుగుతారు-‘ చాలా శక్తివంతంగా మీకు ఏది కనిపిస్తున్నది? ‘
శిష్యులు చెబుతారు, ‘ కనిపించే పర్వతాలు ఎంతో శక్తి ఉన్నట్లు కనిపిస్తున్నాయి.’
‘ పర్వతాల కంటే శక్తివంతముగా ఏమి కనిపిస్తున్నాయి? ‘
‘ ఇనుము గట్టిగా కనిపిస్తోంది. ఎందుకంటే ఇనుముతో ఎంత రాయినైనా పగులగొట్టగలం ‘
‘ ఇనుము కంటే గట్టిది ఏది? ‘
‘ అగ్ని. అగ్ని ఇనుమును కూడా కరిగిస్తున్నది ‘
‘ అగ్నికంటే గట్టిది ఏది? ‘
‘ జలం. జలం అగ్నిని చల్లారుస్తున్నది ‘
‘ జలం కంటే శక్తివంతమైనది ఏది? ‘
‘ వాయువు. వాయువు జలాన్ని కూడా కదిలిస్తున్నది ‘
‘ వాయువు కంటే గొప్పది ఏది? ‘
ఇక్కడ ఆలోచన ప్రారంభమైనది. గురువు గారు తొందర పెట్టలేదు. ప్రశ్నను మరల అడిగారు.
‘ వాయువు కంటే గొప్పది ఏది? ‘
శిష్యులు కళ్లు మూసుకున్నారు. ‘ ప్రాణం ‘, అన్నారు.
‘ ఎలా? ‘
‘ వ్యాపించునది, కదిలించునది, ఎదిగేది ప్రాణ శక్తియే కదా? ‘
గురువు గారు చిరునవ్వు నవ్వారు.
‘ ప్రాణం కంటే గొప్పది ఏది? ‘, అని అడిగారు.
శిష్యులు కళ్లు తెరిచారు. ప్రాణాన్ని తయారు చేసేది ఏది? శోధించారు.
‘ దేనితో శోధిస్తున్నారు? ‘, అడిగారు గురువుగారు.
‘ మనస్సుతో ‘
‘ మనస్సుకు గల శక్తి ఏది? ‘
‘…’
‘ సంకల్పం! ‘
‘ ఎలా? ‘, అడిగారు శిష్యులు.
‘ నీలో ఎంత శక్తి ఉన్నా, నీ సంకల్పం తోనే అది కదులుతుంది. ప్రజోత్పత్తి చేసే సంకల్పం లేకపోతే ప్రాణం ఏది? ప్రాణ శక్తికి ఇన్ని రూపాలు ఏవి? ‘

ఒక విద్యుత్తు తీగె చుట్టూ ఒక అయస్కాంతపు శక్తి ఏర్పడుతుంది. ఒక అయస్కాంతపు పరిధిలో ఒక మోటార్ తిరిగితే విద్యుత్తు ఉత్పన్నమవుతోంది!

మయి మేధాం, మయి ప్రజాం…మేధాం మేధాం మయి…

అందుకే శ్రీ రుద్రం చెబుతుంది-సుమతిశ్చమే, సూషా చమే, సుదినం చమే!

మనలో మనస్సు లేదు. మనస్సులో, దాని సంకల్పం లో మనమున్నాము!

శుభం భూయాత్!

~వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “‘ ఆలోచనే అమృతం’-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: