‘ చెత్తతో చిత్తు! ‘-వేదాంతం శ్రీపతి శర్మ


దారిన పోతూ ఒక అర్థం కాని దృశ్యాన్ని చూస్తూ ఉండే వాడిని. మెయిన్ రోడ్డుకి కొద్ది దూరంగా ఒక చెత్త కుండీ ప్రక్కన ఒక పెద్ద మనిషి ఒక కర్ర పట్టుకుని ఏదో కెలుకుతూ కనిపిస్తాడు. ఆయనకు ఆ పని అవసరం లేదేమో అని చాలా సార్లు అనిపించింది. ఒక రోజు ఉండ బట్టలేక అడిగేశాను. ‘ సార్, ఏదైనా పోగొట్టుకున్నారా? ‘
ఆయన కెలుకుతూనే నవ్వాడు. ‘ లేదు..’, అన్నాడాయన, ‘ సంపాదించాను ‘. ఆశ్చర్యం వేసింది! జాగ్రత్తగా చూస్తే ఆయన చేస్తున్నది కెలకటం కాదు. రిసైకల్ చేయగలిగినది, చేయలేనిది-ఈ రెండిటినీ అటూ ఇటూ సద్దుతున్నాడు.
చేయ గలిగిన దానిని ఒక సంచీలో వేసి ఉంచుతున్నాడు.

‘ దీనిని ఒక సంస్థ వారు వచ్చి తీసుకుని వెళతారు ‘, చెప్పాడు.

‘ మీరు అందులో పని చేస్తారా? ‘, అడిగాను.
‘ లేదు. నేను ఫుడ్ కార్పరేషన్ లో చేసి రిటైరయ్యాను. పోస్ట్ గురించి చెప్పను. నాకు ఇష్టం లేదు. మొత్తానికి మాది ఫుడ్ ఫామిలీ! ‘ నేను వేస్ట్ కేండిడేట్ ను కాను. మంచి టేస్ట్ ఉన్న కేండిడేట్ ని! ‘

‘ ఇది ఎలా చేపట్టారు? ‘
‘ నాకు చేతనైన పని ఇది. ఒక కర్ర పట్టుకుని ఇలా కాలక్షేపం చెస్తాను. మీలాంటి వారితో ఇలా కబుర్లు చెబుతాను. ‘

అటూ ఇటూ చూశాను. ఆయన నవ్వాడు.

‘ ఏమి లేదు సార్. నేను కొత్తలో ఇక్కడ చెత్త వేసే వారికి చెత్త పారేసే విధానం గురించి చెప్పే వాడిని. పెద్దగా నన్ను ఎవరూ పట్టించుకోలేదు. కాకపోతే వాళ్లు వేసిన చెత్తను వాళ్ల ముందు నేనే విభజించటం ప్రారంభించాను. ఈ మధ్య ఇక్కడికి వచ్చి విసిరేసే వాళ్లు జాగ్రత్తగా విభజించే పారేస్తున్నారు. ఆ.. నేను ఉన్నంత సేపైనా ! ‘

‘ మీ ఇంటిలో…’
‘ ఒకరు మెచ్చుకుంటారని ఒక పని చేయం. ఒకరు తిడతారని ఒక పని చేయటం మానెయ్యం. ‘
కళ్లెగరేశారు ఆయన.
‘ కరెక్ట్ సార్. ఎంత వరకూ ఇలా చేస్తారు? ‘
‘ ఈ కాలనీలో ఇక్కడ పారేసే వారందరూ ఇది నేర్చుకున్నక మరో చెత్త కుండీని ఎంచుకుంటాను. నాకు పనీ పాటా లేదు. చెత్త ఏరుకునే కుర్రాళ్లు వచ్చినప్పుడు ఆ సన్స్థకు ఒక ఫోన్ చేస్తాను. వాళ్లు పట్టుకెళ్లి స్కూళ్లలో చేరుస్తారు. ‘

కేవలం ఒక చెత్త కుండీ దగ్గర నిలబడినందుకు ఎన్ని ప్రయోజనాలు? ఆయన చేయి పట్టుకుని అభినందించి వచ్చాను.

ఈ రోజు వాషింగ్టన్ పోస్ట్ లో ఒక చక్కని వార్త ఉంది.

జొహాన్నెస్ బర్గ్ లోని సోవెటో అనబడే ఒక వాడలో ఆ సిటీ పార్కులకు మేనేజింగ్ డైరెక్టర్ అయిన లూథర్ విలియంసన్ ‘ పర్యావరణ న్యాయాన్ని ‘ ఎందరికో పార్కుల రూపంలో అందిస్తున్నారు. ఎందరికో ఉద్యోగం ఇస్తున్నారు. పూర్వం అపార్థీడ్ రాజ్యమేలుతున్నప్పుడు కావాలని మురికిగా వదిలేసిన నల్ల జాతీయుల వాడలను అతి వేగంగా బాగు చేసి ఆయన నలుపు తెలుపు అను భేదాన్ని కేవలం పార్కుల ద్వారా నిర్మూలిస్తున్నారు!

సొవేటో లోని అయిదు ఎకరాల భూమి- ఇది ఒకప్పుడు కేవలం అనుమతి లేకుండా చెత్త పడేసే ప్రదేశం. దీనిని ఒకే ఒక రాత్రిలో 200 మనుషులతో ఒక అద్భుతమైన పార్కుగా తీర్చి దిద్దారు ఆయన!

ఇందులో నీటి ఫౌంటేన్ లు, పిల్లలకు పనికి వచ్చే అధ్యయన శాలలు, సాకర్ మైదానాలు,
ఇలా ఎన్నో-ఒకప్పుడి ఇది అది అంటే ఎవరూ నమ్మరు.

ఈ డీక్ప్లూఫ్ ఎక్స్ ట్రీం పార్క్ కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు కూడా వచ్చాయి.

ఇక్కడ చెప్ప వలసినదేమిటంటే ప్రజలు పాల్గొనే ఉద్యమాలు ఇవి. మన దగ్గర కూడా అక్కడక్కడ ప్రయోగాలు జరుగుతున్నాయి.

ఒక చక్కని ప్రణాలికను రూపొందించుకుని నేను ఉదహరించిన పెద్ద మనిషిలాగా కొద్దిగా ఆలోచించి స్థిత ప్రఙ్ఞత్వంతో పనిలోకి దిగితే చాలా చేయ వచ్చును.

మనిషిని బ్రహ్మయ్య మట్టితో చేసెనయ్యా! చెత్తతో పని లేకుండా ఏ రోజు ఉన్నది? ఎందుకు అసహ్యించుకోవటం?

‘ నన్ను కాకుండా లెక్కేసుకో ‘ ఈ సిధ్ధాంతం నుంచి దూరంగా వచ్చి ఆయన నేనే చేసి చూపిస్తాను అని సెలవిచ్చారు!

ఒక అరటి పండు వొలిచి తొక్క రోడ్డు మీద పారేసే ముందు ఒక్క సారి ఆయన చిరునవ్వుతో కర్ర పట్టుకున్న నైజం కనిపిస్తుంది.

ఏ ఆశ్రమం లోనో కృష్ణా రామా అనవచ్చుగా? టి. వీలో కూడా కనిపించవచ్చు!

ఇది కర్మ భూమి. బాధ్యత లేని సమయం ఏ జీవుడికీ ఎక్కడా ఉండదు.

మా అపార్ట్మెంట్లలో రోజూ ఒక సారి గోడ అవతలకి వెళ్లి చూస్తాను. అలా నిలబడ్డందుకే చాలా మంది ఈ మధ్య చెత్త విషయం లో కొద్దిగా కొత్తగా ప్రవర్తిస్తున్నారు! ఇప్పటికి మా ఇలాకాలో అందరికీ ఈ చెత్త విభజన గురించి తెలిసింది. ఏది ఎలా పారెయ్యాలీ అనెది మీ దగ్గర ఉన్న పర్యావరణ సంస్థలో గానీ జి. ఎచ్. ఎం .సీ లో కానీ అడిగి తెలుసుకో గలరు. వీలు వెంట ఆ వివరాలు ఈ బ్లాగులో కూడా పెడతాను…

కర్మణి సంచరరే! మానవా, కర్మణి సంచరరే!

~వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘ చెత్తతో చిత్తు! ‘-వేదాంతం శ్రీపతి శర్మ

  1. మానవ సంచరరే, కర్మణి, మానవ సంచరరే
    బావుంది…..

    వాళ్ళు మనకి డబ్బులిస్తారా! వేస్ట్ ఈస్ నాట్ రియల్లీ వేస్ట్! ఇది మంచి బిజినస్ ప్రొపోజల్. ఇన్సూరెన్స్ ఏజంట్స్ ని చేసినట్టు చేసిపారేయాలి ఏజెంట్స్ ని. అప్పుడు కానీ మీరనుకున్నది జరగదు.

    కానీ ఒరిజినల్ ఐడియా ఇచ్చినా ఆయన ఫొటోకూడా వేయండి. రెండో బ్లాగులో – ఫర్ పోస్ట్రరిటీ ; అట్ లీస్ట్ ఫర్ మై సేక్!

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: