‘ ముందు…మందు!’-వేదాంతం శ్రీపతి శర్మ


కొద్ది రోజుల క్రితం ‘ ద స్టేట్స్ మేన్ ‘ దిన పత్రికలో ఒక వార్త వచ్చింది. రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోట్ గారు రాష్ట్రమంతటా పబ్బులూ బారులకు విరుధ్ధంగా ఒక ప్రచారం మొదలు పెట్టారు. ఆ మధ్య ఒక పబ్ లో ఒక యువతిని శారీరికంగా కొందరు బాధ పెట్టిన వార్త కూడా వచ్చింది.

ఇది జరుగుతూనే ఉంటుంది. మన రాష్ట్రంలో ఇంకా ఘోరమైన పరిస్థితి ఉంది. ఇరానీ కేఫ్ లలాగా ఎక్కడ పడితే అక్కడే ఈ మందు షాపుల పేర్లతో చిన్న సైజు పబ్బులే వెలిసి చక్కని వ్యాపారం చేసుకుంటున్నాయి. బొడ్డు ఊడని పిల్లలు కూడా విచ్చల విడిగా మందు కొట్టటం, సిగరెట్టులు త్రాగటం చూస్తున్నాం. రెసిడెన్షియల్ ప్రాంతాలలోనూ, కాలనీలలోనూ కూడా స్త్రీలకు సాయంత్రం పూట నడచి వెళ్లాలంటే చాలా ఇబ్బందిగా ఉంది.

వీళ్లకి లైసెన్స్లు ఇచ్చేవారు ఏమైనా నిబంధనలు పాటిస్తున్నారా అనే సందేహం కలుగుతున్నది.

రాబోయేవి ఎన్నికలు. వీటికీ మందుకీ ఉన్న సంబంధం అందరికీ తెలిసినదే! ఎన్నికల పంటను మద్యంతో పండిస్తారు మహానుభావులు.

స్వీట్ షాపులలో కూర్చుని ఒక ప్లేట్ స్వీట్ ఏదైనా తినాలంటే చాలా నిబంధనలున్నాయి. షాపు వాడు ఏవో హోటళ్లకు సంబంధించిన కొన్ని పన్నులు కట్టాలి. అందు చేత అతను జాగ్రత్తగా పక్కన ఒక బెంచీ మీద కూర్చో పెట్టి చేతికి ఇస్తాడు.

‘ ఇదే బ్రాందీ షాపు ‘ అని ఉన్న చోట ఇవేమీ పాటించనక్కరలేదు. సింపుల్ గా నిలబడి బాటిల్ ఎత్తేయటమే!

పెద్ద పెద్ద కాంప్లెక్సులు, అపార్ట్ మెంట్సూ కడుతున్న చోట ఆ సెల్లార్లలో ఉండే వారు స్వతంత్ర భారతాన్ని తనివి తీరా ఆస్వాదిస్తున్నారు. సాయంత్రం పూట సినిమా చూసి ఇంటి వైపు వెళుతుంటే మమ్మల్నే ఆపి ‘ ఎక్కడికి పోతావు చిన్నవాడా? ‘ అంటున్నారు సోడా బుడ్డీలంత ఉన్న కుర్రాళ్లు. మందులోనైనా నన్ను ‘ చిన్న వాడా ‘ అన్నందుకు ఆనందం కలిగినా మన రాష్ట్రంలో ఒక ప్రశాసనం ఉంది అని మటుకు అనిపించటంలేదు.

‘ ఎందుకు లేదు సార్?…’, అన్నాడు ఒక పెద్దమనిషి, సిగరెట్ ముట్టించి స్టైలుగా అగ్గిపుల్ల పారేసి,’…మీరు పెబుత్వాన్ని తిట్టకూడదు. మనం పెబుత్వంలో ఉన్నాం, పెబుత్వం మనలో ఉంది! ‘ ఆ మనిషి ఊగుతుంటే ప్రజాస్వామ్యం పాము పడగ విప్పి ఊగిపోయి బుసలు కొట్టినట్లుంది. ఆయన ఇంకా స్పందిస్తూనే ఉన్నాడు, ‘…ఎంత మాట సార్? మందుకు లివర్ చెడిపోతుంది. కరెక్ట్! మరి లివర్ని తీసి మందులోనే కాపాడతారెందుకు? ‘

వెనుకనుంచి వినిపించిన ఆ మాటలు కరెక్ట్ గా తోచాయి. కాకపోతే జనాలను చంపి ‘ అందులోనే ‘ భద్రపరుస్తారన్నమాట!
ఈయన ఇచ్చిన ఉదాహరణ ప్రభుత్వాలకీ, మందుకీ బాగా సరిపోయింది. నిజమే. ప్రభుత్వాలు, వ్యవస్థలు ఇందులో మునిగిపోయి పని చేసుకుంటున్నప్పుడు దేని గురించి అపీల్ చేస్తాం?

ఇది కేవలం సమాచార యుగం! సదాచారం గురించి మాట్లాడిన వాడిని జైల్లో పెట్టి కొడతారు!
-వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

One thought on “‘ ముందు…మందు!’-వేదాంతం శ్రీపతి శర్మ

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: