‘తెర’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ


ఛలిగా ఉంది. మురికి వాడ ఒకటి ఊరి చివర ఆ రాత్రికి నిద్రకు ఉపక్రమిస్తోంది. ఊళ్లో ఎక్కడెక్కడో ఏవేవో పనులు చేసుకుని ఒక్కొక్కరూ ఇళ్లకు చేరుకుంటున్నారు. ఇంతలో ఒక జీపు వచ్చి ఆగింది. డబ్బా రేకులతో కట్టబడ్డ ఆ ఇళ్ల మధ్య ఒక తెర కట్టారు. అటువంటి ఇంటిలోంచి ఒక వైరు లాగి ఒక ప్రొజెక్టర్ నిలబెట్టారు. పిల్లలు, జనం మెల్లగా పోగయ్యారు. దొరికిన దుప్పటో చిరిగిన చిరెలో తెచ్చుకుని కింద పరుచుకున్నారు. మురికివాడలోని పెద్దను పిలిచి ఒక కుర్చీ వేశారు. ఈలలూ, చప్పట్ల మధ్య సినిమా ప్రారంభమైంది. ఎయిడ్స్ మీద అది ఒక చిన్న డాకుమెంటరీ! విధిగా చూపిస్తున్నారు అన్ని చోట్లా. ఒకరిద్దరు లేవబోయారు. వాళ్లని వెళ్లొద్దన్నారు. దాని తరువాత కరోడ్పతి సినిమా చూపిస్తున్నారు అని చెప్పారు.

ఇంతలో ఎయిడ్స్ మీద సినిమా అయిపోయింది. ఒక హీరో గారు బహుమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు. ఊరకే ఎవరో చపట్లు కొట్టారు. అసలు సినిమా ఉందా లేదా అని అందరూ ఎదురు చూశారు. నిజమే. ఈ ఎయిడ్స్ మీద ప్రచారం అందరూ చూడాలనే దీని తరువాత ఆ సినిమా చూపిస్తున్నారు అన్నారు! ఇంతలో తెర మరల వెలిగిపోయింది. కరోడ్పతి సినిమా మొదలయింది. కథ ముందుకు సాగింది. ఇంతలో అక్కడ కూర్చున్న వారికి ఏవో గుర్తుకొచ్చాయి. అరే! ఈ సినిమాలో పిల్లలు మన మురికి వాడ వాళ్లే! అది తెలిసి ఈలలు వేశారు. వాడ వాడంతా ఒకటే గోల. అరే! పది ఏండ్ల క్రితం ఈ వాడలోనే తీశారు ఈ సినిమా! అయ్యో, ఎలా కొడుతున్నారో మన హీరోను చూడు? పోనీలే. చివరకు మనోడే గెలిచాడు. ఆ చివరి పాటలో అందరూ పాలు పంచుకున్నారు. వారి వాడను ఆ వాడలోనే వాడిగా, వేడిగా చూసినందుకు అందరికీ కళ్లు చెమర్చాయి. పెద్దలయిపోయిన ఆ పిల్లలను అందరూ కౌగిలించుకున్నారు. ఎవరో హారతులిచ్చి దిష్టి తీశారు…

ఒక రంగుల కల నిజమినది. తెర మీద బొమ్మ తేలి తేలి ఆడింది. సినిమా అయిపోయింది. ఈ చోటు పెద్దగా ఏమీ మారలేదనుకున్నారు ఆ సినిమా చూపించేందుకు అక్కడికి వచ్చిన పెద్ద మనుషులు. రాత్రి ఇంకా ఛలి పెరిగే ముందే ఆ వెండి తెరను చుట్టి జీపులో పెట్టారు. అందరికీ టాటా చెప్పి జీపు ఎక్కారు. జీపు బయలుదేరింది. కొంత మంది దాని వెనుక బయలు దేరారు. చరిత్ర సృష్టించిన ఆ కరోడ్పతి సినిమా అందరి ఙ్ఞాపకాలనూ ఒక్క సారి తిరగేసింది. కొంత మంది బాధతో కూడా ఉన్నారు…

కలలకు, నిజాలకు మధ్య ఎన్ని రోజులు ఈ తెరలని బాధపడ్డారు. రంగుల కలలు ఈ డబ్బా రేకుల మీద బాదుతూ, నాట్యం చేస్తూ వాళ్లని కుక్కలని, నక్కలనీ అంటూ ప్రపంచమంతా ఎంత కాలం స్వారీ చేస్తాయి? వీటికి నిజమైన తెర పడదా?

జీపు మలుపు తిరిగి రోడ్డు ఎక్కింది. వాడలోని కొందరు జీపు వెంట పరుగులు తీశారు. ఎందుకో జీపు ఒక ప్రక్కగా ఆగింది. ఆ ఇద్దరూ క్రిందకి దిగి సిగరెట్లు ముట్టించారు. వాళ్లకీ ఏదో కొద్దిగా ఇరుకుగానే ఉంది. ఇద్దరు వాడలోని మనుషులు వచ్చి ఎందుకో ప్రక్కగా నిలబడ్డారు. వాళ్లకి ఒంటి మీద పాపం పూర్తిగా బట్టలు లేవు. సిగరెట్లు త్రాగుతున్న వాళ్లని ఏదో ఆశతో చూస్తున్నారు.

‘ ఏమి కావాలి? ‘, అడిగాడు ఒకడు.
‘ సినిమా బాగుంది సార్! ‘
‘ మంచిది. వెళ్లి పడుకోండి. మా వెంట ఎందుకు వచ్చారు? ‘
‘ చాలా ఛలిగా ఉంది సార్. ఏదైనా బట్ట ఉంటే…’
వాళ్లకి అర్థమైంది. ఇక్కడ ఎక్కువ సేపు ఉంటే చాలా అడుగుతారని అనుకుని సిగరెట్ పారేసి గబ గబా జీపు ఎక్కారు. బండీ బయలు దేరింది. ఆ వాడలోని వారిద్దరూ చూస్తూ నిలబడ్డారు.
ఇంతలో జీపు ఆగింది. అందులోంచి ఒకడు రమ్మని చేయి చూపించాడు. ఇద్దరూ గబ గబా పరుగు తీశారు.

‘ ఇదిగో, మా దగ్గర వేరేవి ఏమీ లేవు. ఈ తెర మీకు ఇచ్చేస్తున్నాము. తీసుకోండి! ‘
వాళ్లు ఆ తెరను పట్టుకుని మురిసిపోయారు.
‘ వెళ్లండి. మీ వాడలో చిరిగిపోయిందని చెబుతాము ‘
జీపు రయ్ మని రహదారి మీదుగా వెళ్లిపోయింది.

వాడలోని వారు ఆ తెరను తనివి తీరా ఒంటి నిండా కప్పుకున్నారు. కరోడ్పతులలాగా ఉప్పొంగిపోయారు. కలలను పండించి, కళా ఖండాలను చూపించే వెండి తెరతోనే శరీరాలను కప్పుకున్నారు. ఒక కొత్త రాత్రి గడపటానికి, వాడలోని వారందరికీ ఆ శుభ వార్త చెప్పటానికి ఆదుర్దాగా రోడ్డు దిగి లోపలికి నడిచారు!

ఆ జీపులోని వ్యక్తులు ప్రస్తుతానికి ఒక తెర తీసేసినందుకు కొద్దిసేపు కాస్త ఆనందాన్ని పంచుకున్నారు!

(‘స్లం డాగ్ మిలియనీర్ ‘ చిత్రంలో పని చేసిన మురికి వాడలోని చిన్న పెద్ద కళాకారులందరికీ, మౌనంగా మరో సారి మానభంగాన్ని అనుభవించిన ఒక వాడకీ ఈ కథ అంకితం)

-వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

3 thoughts on “‘తెర’-వేదాంతం శ్రీపతి శర్మ చిట్టి కథ

 1. I do not quite undersand the hue and cry about the movie Slumdog Millionaire. First there was criticism about the depiction of life in Mumbai slums and then the fight against the name itself. While I can understand the criticism about the name Slumdog, I can’t fathom criticism about the content of the movie. Let us all understand that the movie was based on a book ‘Q&A’ written by an Indian Author Vikas Swaroop. Though I must admit I have neither read the book nor watched the movie, from what I came to know through press that Danny Boyle faithfully stuck to the original theme and content of the book. We should complement Danny Boyle for making the film racy and interesting. Would there have been so much criticism had it been made by an Indian director? On other hand I also object to the hype in the media tomtomming about the Indianness of the movie. The movie was produced by a Brit and directed by a mainstream Hollywood director. The only Indian element about the movie apart from the location and a few actors, was its music dirctor AR Rahman.

  1. I admire this briefly presented reflection on the dust being raised on this movie. There is some fire though without which this smoke wouldn’t have come out. Let us get into the subject…

   I would look for the ideal situation-creativity is universal. Who directs or who acts does not really make any difference. Creativity ought to cut across regions. Else, it can be inferred that the skill hasn’t really done its ‘ home’ work.

   The issue is that there is alsways an ambience to such a subject. The director has chosen something sensitive (say, like ‘Gandhi’ when Attenborough had to go through a lot of research and still left out Ambedkar and got some severe criticism. The bridge between the viewr’s imagination or calculation and the events of the past and present narrows down or is simply not there and this is where the viewer begins comparisons as though he has been asked to leave fantasy aside and peep into stark reality. It becomes a dialogue between the teller and the listener from which state it is difficult all of a sudden to sit back, shake your head and pass it off just for a piece of subtle imagination)

   What cannot be actually put down in subtle terms is that the line between creative expression to harsh realities and depicting reality itself in a chosen context is pretty thin. The smoke went off since this thin fiery line simply vanished.

   It vanished because the movie does not introduce a conceptual narration but strikes directly at the concept itself like a documentary begins, yet, attacks the subject directly thereby hitting very hard at sensitive places. Movies like ‘ Chakra’, ‘Manthan’, ‘Bhumika’ etc. had slum-life as a backdrop to the ‘story’ sought to be presented. Slums themselves were not the stories! This is the irony in creative expression. Action needs to be presented between carefully chosen boundaries. You need to recognise the screen which lifts and then closes the substance.

   Slums exist even inside cities of developed nations but the expression ‘slumdog’ will not pass off quite simply. You are referring to a human being on such a big canvas-it implies a vastly bristling population and a polity worth its name! The Government of India uses the term ‘Slum’. There is ‘Slum Clearance Board’. We accept reality but there is hardly any creativity in adding the word ‘Dog’ to it. It may be true that the director simply wanted to define the initial and final status of the slum boy in such a fashion but going by whatever has been worth in the movie, there was no need.

   The movie in question is not without the stuff with which it has been actually credited with. Questiuons and answers are exercises in improving knowledge. But this exercise is taken as central to the very theme of poverty and the vicious circle with all its economic and social dimensions. It is just for this chosen idea for focussing harsh realities, overnight affluence which can only be dreamed of and the bridge between the two-the suffering from which the fellow registers his answers and succeeds-this may just bag the director the much sought after Oscars…But the dog remains only faithful to him fetching the ball from whereever it is thrown!

   The phenomenon of Q&A is sought to be depicted as entering the system of slum dwelling. The parallel here is that it is not actually the boy answering the questions. Where the questions are drawn from-Indian ethos, History and Culture and wherefrom the boy answers-his registering them in his mind because of the incidents involving turmoil and torture. So the director is asking us-what have the elements of a glorious past meant to a Nation at the end of the day?

   It is not so simple! Reality is something else. The poorest Indian population is by far the most religious and not willing to be deprived of its self respect. It is seriously involved in nation building, might be suffering silently but it respects its nation-past and present. It does still have a vision for the future.

   The question raised by the director is quite relevant but has been wrongly framed.

   Hence the hue and cry. There is another irony. It has hurt many at many places. But not all of them are correctly expressing how and why it hurts. This is the majic which goes with many a visual presentation…

   Sripati

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: