నాయకులు-ఎన్నికలు-చేపలు!


ఎక్కడైనా నలుగురు కలిస్తే ఎవరైతే ఏదో ఒకటి పాడి వినిపించాలనుకుంటారో ఉన్నట్టుండి ‘ ఎవరైనా పాడండి విందాం ‘ అంటారు. చివరకు ఎవరూ పాడరు. ఇలా మొదలు పెట్టిన వారు కావలసినన్ని పాటలు పాడేసి అందరినీ కింద పడేసి ఇంటికి వెళుతూ ఉంటారు.

ఆఫీసులో బాస్ కూడా లోపలికి పిలచి ఏదో ఆయనకు నచ్చిన దానిమీద ఒక రెండు గంటలు బాదుతాడు. మధ్యలో మర్యాదకి రెండు కప్పులు కాఫీతో గొంతు తడుపుతాడు. ‘ అసలు మన ఆఫీసులో అందరికీ దీని గురించి చెప్పేందుకు ఒక స్పెషల్ లెక్చర్ ఏర్పాటు చేయాలోయ్ ‘ అంటాడు. భజన చేసే విధం తెలిసిన వాడు ‘ సార్, మీరు ఉండగా ఎవరో ఎందుకు సార్ ‘ అని ఎక్కడ లేని బాధను మొహం లోని నరాలను బిగ బట్టి మరీ చూపిస్తాడు. ‘ నేను ఇక్కడ చెప్పాను కానీ…’
భజన్ లాల్ ఊర్కోడు. ముక్కు మీద వేలు పెడతాడు. ‘ ఎంత మాట సార్, మీరు ఒక సారి పూనుకోండి. అదే అయిపోతుంది. మేము అసలు మీ స్కిల్ ను మీరు చూడనీయటం లేదు. తప్పు సార్ ‘ అంటాడు. అంతే! వారం తిరగకుండా కాంఫరన్స్ హాల్ లొ ఒక సమావెశం. ఆవేశంలో ఆఫీసర్ అటాక్! చప్పట్లు, మైకులు, ఒహో…
మర్నాడు రూములో ఆయన టై సద్దుకుంటాడు. ‘ ఇది ఒక్క సారే! నాకు పబ్లిసిటీ ఇష్టముండదు ‘ అంటాడు.
భజన్ లాల్ మొబైల్ తీస్తాడు. ‘ ఇదిగోండి. ఇందులో నాకు వచ్చిన కాల్స్ చూడండి! ఇద్దరినైతే నేనే రావద్దన్నాను. మిమ్మల్ని కలుసుకోవాలని అంటున్నారు…’
ఆ టై అలా ఉచ్చు లాగా బిగుసుకుపోతు ఉంటుంది.

‘ మనలోంచి ఒక నాయకుడు పుట్టాలి…’ అంటూ కుర్చీలోకి వెనక్కు వాలుతాడు ఒకడు, ‘…లైక్ మైండెడ్ వాళ్లందరూ ఒక సంఘాన్ని స్థాపిస్తే ఎలాఉంటుంది? ‘
ఇలా నాలుగైదు వారాలు వాగుతూనే ఉంటాడు. రెండు నెలలు తిరిగే సరికి గోడల మీద ఒక పోస్టర్ ఉంటుంది-సాంస్కృతిక సమితి కార్య దర్శి-వీడి ఫొటో అక్కడ పడిపోతుంది!

సిడ్నీ యూనివర్సిటీ లోని ఆష్లే వార్డ్ అనే ఆయన స్టికల్బాక్ చేపల మీద ఒక పరిశోధన చేసి ఒక విషయాన్ని కనుగొన్నారు. ఈ చేపలు శారిరికంగా గట్టి వాడిని నాయకునిగా ఎంచుకుంటాయట. అయితే ఆ సమూహం సైజు పెరుగుతున్న కొద్దీ ఆ ఎంపిక ఇంకా గట్టి వాడి వైపు మారుతూ ఉంటుందట!

ఎవరు నాయకులవాలో ముందుగా ఎంచుకుని ఉంటాయి ఈ చేపలు. అయితే కొన్ని మరోలా కూడా ఎంచుకుంటాయి. కాకపోతే ఇలా బహుమతానికి భిన్నంగా ఎంచుకున్న చేపలు మెల్లగా బహుమతంలోకి వచ్చేస్తాయి కూడా!

ఒక సమూహం అందరికీ సమ్మతమైన అభిప్రాయంతో పోతోందా లెదా అనేదానిని ఎలా పరీక్షించాలో తొలుత ఫ్రెంచ్ తత్వ వేత్త కొందోర్సెత్ 18 వ శతాబ్దంలో చెప్పాడు. ఆయన సిధ్ధాంతం ప్రకారం ఒక సమూహం సైజు పెరుగుతున్నప్పుడు స్వతంత్రంగా కరెక్టు గా ఆలోచించే వారి సంఖ్య పెరుగుతుంది. అదే సిధ్ధాంతాన్ని ఈ స్టికలర్ చేపలు చూపిస్తున్నాయి అని శాస్త్రఙ్ఞులు చెబుతున్నారు.

బాగుంది. ఓటు వేసే వారి జనాభా మరి పెరిగినదికదా? మరి నాయకుడిని సరిగా ఎంచుకుంటామా?

ఇక్కడ ఒక మంచి మాట ఉంది. ‘ ఒక సమూహం సైజు పెరుగుతున్నప్పుడు స్వతంత్రంగా కరెక్ట్ గా ఆలోచించే వారి సంఖ్య పెరుగుతుంది ‘ అన్నారు. స్వతంత్రంగా మనలో ఎంతమంది ఆలోచిస్తామండీ?

అందుకే రవీంద్రుడు అన్నాడు-వేర్ ద మైండ్ ఈస్ విథవుట్ ఫియర్…ఇంటు దట్ వర్ల్డ్ ఆఫ్ ఫ్రీడం…

ఉన్నదా ఆ స్వాతంత్య్ర్యం? ఆ ప్రపంచం?

-వేదాంతం శ్రీపతి శర్మ

రచయిత: srikaaram

నేను తెలుగు, హిందీ, ఆంగ్ల భాషలలో కథలు, నవలలు, నాటకాలు రచిస్తాను. ప్రస్తుతం ఆంధ్ర ప్రభ ఆదివారం సంచ్కలో ' ఆరోగ్య భాగ్య చక్రం ' అను శీర్షిక నడుపుతున్నాను. ఇందులో జ్యోతిషం, ఆరోగ్యం కు సంబంధించి వ్యాసములు వస్తున్నాయి. సాక్షి దిన పత్రికకు పురాణం ప్రశ్నోత్తరములు నిర్వహిస్తున్నాను. మరి కొన్ని శీర్షికలు వార పత్రికలలో రాబోవుతున్నవి. సరళమైన హాస్యం, రుచించే సంవాదం నాకు ఇష్టమైనవి.

2 thoughts on “నాయకులు-ఎన్నికలు-చేపలు!

 1. బాగా రాశారు.కానీ స్వతంత్రగా అలోచిస్తున్న వాళ్లందరూ, కొంత మంది భజన పరుల్ని కూడేసుకొని, పార్టీల సంఖ్య పెంచారు.

  ఇప్పుడు బహుమతానికి భిన్నంగా ఉన్న వాళ్ళు మారి రావాలంటారు. కానీ అందరి కంటే బలమైన వాడు తెలియాలిగా!

  తెలిస్తే స్వతంత్ర్య అలోచన వల్ల కాదు, గుంపుగా గెలుస్తామని కలుస్తారు. అంతే!మీరు చెప్పిన ప్రయోగంలో ఇన్‍ఫరెన్స్ తప్పు.

  అలాగే ఇంకో థియరీ. డబ్బున్నవాడు గెలవటం కాదూ.. గెలిచే వాడి దగ్గరికే డబ్బుకూడా వెళ్తుంది
  అని.తద్వారా వాడే గెలుస్తాడు.

  కానీ బలమైన వాడెవడో తేలలేదే!అందుకే అద్వానీ ఓ మాట అన్నాట్ట. మా కే ఓటెయ్యండి. ఒక వేళ అహ ఒక వేళ వేయలేని పక్షంలో కాంగ్రెస్‍కే ఓటెయ్యండి అని. ఈ రాజకీయం ఎంత చిరగ్గా ఉందో ఆ మాటలో తెలుస్తోంది.

  యస్ మీరన్నట్టు ఇది తేల్చుకోవాల్సిన సమయమే. నేనున్నాను అని నమ్మించ గల ధీరుడు/ ధీరుది!?

  హిందుత్వా కార్డ్ వల్ల వచ్చిన బహుమతమే ఇవాళ కొంప ముంచుతోంది. దాన్ని ఒదులుకోలేరు.దాంతో ఎవరూ గెలిపించరు. అందకే means are more important than ends అన్నారు.రాజకీయ నాయకులు దీన్ని తెలుసుకోవాలి. ఒక్క చౌరీ చౌరా సంఘటనకి తన పిలుపుని వెనక్కు తీసుకున్నారు గాంధీగారు – అని చదవాను. ఎనీ కామెంట్!?

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

%d bloggers like this: